పోస్ట్‌లు

జనవరి, 2023లోని పోస్ట్‌లను చూపుతోంది

భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు

 అధికార భాషా అధికార భాషా వివాదం హిందీ వ్యతిరేక రూపం తీసుకొనడం వలన చాలా తీవ్రమయింది. దేశంలో హిందీ మాట్లాడే ప్రాంతాలు, హిందీ మాట్లాడని ప్రాంతాల మధ్య ఘర్షణ సృష్టించే ధోరణి ప్రబలింది. వివాదం జాతీయ భాషా సమస్యపై కాదు. అంటే కొంతకాలం తరువాత భారతీయులందరు ఒక భాషను ఆమోదించాలని, భారత జాతీయతా గుర్తింపుకి ఒక జాతీయభాష అవసరం అనే ఆలోచన జాతీయ నాయకత్వంలోని అత్యధిక మెజారిటీచే గతంలోనే తిరస్కరించబడింది. భారతదేశం బహు భాషల దేశం. అది అలాగే కొనసాగాలి. జాతీయోద్యమం తన సైద్ధాంతిక రాజకీయ కార్యకలాపాల్ని వివిధ ప్రాంతీయ భాషలలో నిర్వహించింది. ఉన్నత విద్య, పరిపాలన, కోర్టు వ్యవహారాలు అన్ని కూడా ఇంగ్లీషుని తొలగించి మాతృ భాష మాధ్యమంగా జరగాలన్నది జాతీయోద్యమం డిమాండ్. ఈ అభిప్రాయాన్ని 1937లో నెహ్రూ ఇలా స్పష్టం చేశాడు. 'మన గొప్ప ప్రాంతీయ భాషలు సంపద్వంతమైన వారసత్వం గత ప్రాచీన భాషలు, ప్రతి ప్రాంతీయ భాష లక్షలాది ప్రజలు మాట్లాడే భాష, ప్రతి భాష సాధారణ ప్రజల ఉన్నత వర్గాల జీవితంతో సంస్కృతితో ఆలోచనలతో గాఢంగా పెనవేసుకొన్న భాష, సాధారణ ప్రజలు, మాతృ భాషా మాధ్యమం ద్వారానే విద్యాపరంగా సాంస్కృతికంగా అభివృద్ధి చెందగలుగుతారు. కాబట్టి మనం ప