భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు

 అధికార భాషా


అధికార భాషా వివాదం హిందీ వ్యతిరేక రూపం తీసుకొనడం వలన చాలా తీవ్రమయింది. దేశంలో హిందీ మాట్లాడే ప్రాంతాలు, హిందీ మాట్లాడని ప్రాంతాల మధ్య ఘర్షణ సృష్టించే ధోరణి ప్రబలింది. వివాదం జాతీయ భాషా సమస్యపై కాదు. అంటే కొంతకాలం తరువాత భారతీయులందరు ఒక భాషను ఆమోదించాలని, భారత జాతీయతా గుర్తింపుకి ఒక జాతీయభాష అవసరం అనే ఆలోచన జాతీయ నాయకత్వంలోని అత్యధిక మెజారిటీచే గతంలోనే తిరస్కరించబడింది. భారతదేశం బహు భాషల దేశం. అది అలాగే కొనసాగాలి. జాతీయోద్యమం తన సైద్ధాంతిక రాజకీయ కార్యకలాపాల్ని వివిధ ప్రాంతీయ భాషలలో నిర్వహించింది. ఉన్నత విద్య, పరిపాలన, కోర్టు వ్యవహారాలు అన్ని కూడా ఇంగ్లీషుని తొలగించి మాతృ భాష మాధ్యమంగా జరగాలన్నది జాతీయోద్యమం డిమాండ్. ఈ అభిప్రాయాన్ని 1937లో నెహ్రూ ఇలా స్పష్టం చేశాడు. 'మన గొప్ప ప్రాంతీయ భాషలు సంపద్వంతమైన వారసత్వం గత ప్రాచీన భాషలు, ప్రతి ప్రాంతీయ భాష లక్షలాది ప్రజలు మాట్లాడే భాష, ప్రతి భాష సాధారణ ప్రజల ఉన్నత వర్గాల జీవితంతో సంస్కృతితో ఆలోచనలతో గాఢంగా పెనవేసుకొన్న భాష, సాధారణ ప్రజలు, మాతృ భాషా మాధ్యమం ద్వారానే విద్యాపరంగా సాంస్కృతికంగా అభివృద్ధి చెందగలుగుతారు. కాబట్టి మనం ప్రాంతీయ భాషలకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చి మన కార్యకలాపాల్ని వాటి ద్వారా సాగించడం అనివార్యం..... కాబట్టి మన విద్యావిధానం ప్రజా కార్యకలాపాలు అన్ని ప్రాంతీయ భాషల ద్వారానే జరగాలి.


మన రాజ్యాంగ నిర్మాతలు మన పెద్ద భాషల్ని 'భారతీయ భాషలుగా' లేక భారత జాతీయ భాషాలుగా అంగీకరించడంతో జాతీయ భాషా సమస్య పరిష్కరింపబడింది. కాని దేశం యొక్క అధికార కార్యకలాపాలు అన్ని భాషలలో సాగించడం సాధ్యపడదు. కేంద్ర ప్రభుత్వం పాలనా వ్యవహారాలు నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వాలతో సంబంధాలు కలిగి వుండటానికి ఒక ఉమ్మడి భాష అవసరం అది ఏ భాష? భారతదేశ అధికార భాషగా అనుసంధానం భాషగా ఏది వుండాలి? అందుకు ఇంగ్లీషు, హిందీలు చర్చకు వచ్చాయి. ఈ రెండింటిలో దేనిని ఎంపిక చేయాలని రాజ్యాంగ పరిషత్ తీవ్రంగా చర్చించింది.

కాని వాస్తవంగా ఈ ఎంపిక కూడా స్వతంత్రానికి ముందే జాతీయోద్యమ నాయకత్వం చేసింది. స్వతంత్ర భారతదేశంలో అఖిల భారత మాధ్యమంగా ఇంగ్లీష కొనసాగకూడదని నాయకత్వం విశ్వసించింది. ఉదాహరణకు ప్రపంచ భాషగా ఇంగ్లీషు విలువను అభినందిస్తూనే గాంధీజీ 'విదేశీ భాషలో ప్రజల మేధస్సు విప్పారదు, సంస్కృతి మొగ్గ తొడగదు' అని స్పష్టం చేశాడు. 1920లలో గాంధీజీ 'ఇంగ్లీషు అంతర్జాతీయ వాణిజ్య భాష, దౌత్యనీతి భాష, సాహిత్య నిధి కలిగిన భాష, పాశ్చాత్య ఆలోచనల్ని, సంస్కృతిని పరిచయం చేసిన భాష' అని ఇంగ్లీషు గురించి చాల గొప్పగా చెప్పారు. కాని | భారతదేశంలో ఇంగ్లీషు వారితో మనకు గల అసమాన సంబంధాల కారణంగా అధి |అసహజమైన కృత్రిమమైన స్థానాన్ని ఆక్రమించిందని గాంధీజీ వాదించారు. ఇంకా ఇంగ్లీషు 'జాతి శక్తిని పీల్చింది. సాధారణ ప్రజల వల్ల విముఖత కలిగించింది. సాధారణ ప్రజల నుండి దూరం చేసింది. విద్యావంతులైన భారతీయులు విదేశీ మాధ్యమం వశీకరణ మాయాజాలం నుండి ఎంత త్వరగా బయట పడితే అది వారికి భారత ప్రజలకు అంత మంచిది. 1946లో గాంధీజీ ఇలా వ్రాశాడు. "ఇంగ్లీషు భాష దాని స్వస్థానంలో అది ఉంటే నేను అభిమానిస్తాను. కాని తనకు చెందని స్థానాన్ని లాక్కొని ఆక్రమిస్తే దానికి నేను తీవ్రమైన వ్యతిరేకిని. ఇంగ్లీషు ఈనాడు నిస్సందేహంగా ప్రపంచ భాష, కాబట్టి రెండవ ఐచ్చిక భాషగా దానికి స్థానం ఇస్తాను." నెహ్రూ 1937లో 'భాషా సమస్యపై వ్రాసిన వ్యాసంలోను, రాజ్యాంగ పరిషత్ చర్చలలోను ఇవే అభిప్రాయాల్ని వ్యక్తం చేశారు.


అధికార భాషలేక అనుసంధాన భాష స్థాయిని కోరుతున్న హిందీ లేక హిందుస్థానీ జాతీయ పోరాటకాలంలో ప్రత్యేకించి ప్రజా సమీకరణ దశలో ముఖ్య పాత్ర నిర్వహించింది. హిందీ ఎక్కువ ప్రాంతాలలో మాట్లాడే భాష గనుక హిందీ మాట్లాడని ప్రాంత నాయకులు కూడా హిందీని అంగీకరించారు. లోక మాన్యతిలక్ గాంధీజీ, సి. రాజగోపాలాచారి, సుభాష్ బోస్, సర్దార్ పటేల్ - హిందీని బలపరిచిన ముఖ్యులలో కొందరు. కాంగ్రెస్ సదస్సులలో, రాజకీయ కార్యకలాపాలలో కాంగ్రెస్ ఇంగ్లీషు స్థానంలో హిందీని లేక ప్రాంతీయ భాషల్ని ప్రవేశపెట్టింది. 1925లో కాంగ్రెస్ తన నిబంధనావళిని ఇలా మార్చుకొన్నది. "కాంగ్రెస్ కార్యకలాపాలు వీలైనంత వరకు హిందూస్థానీలో నిర్వహింపబడతాయి. వక్త హిందూస్తానీ మాట్లాడలేక పోయినప్పుడు గాని లేక అవసరమైనప్పుడు గాని ఇంగ్లీషుని గాని మరే ఇతర ప్రాంతీయ భాషనిగాని ఉపయోగించవచ్చు. కాంగ్రెస్ ప్రాంతీయ కమిటీ కార్యకలాపాలు సంబంధిత ప్రాంతీయ

భాషలలో నిర్వహించాలి. హిందుస్థానీని కూడా ఉపయోగించవచ్చు." జాతీయ _ ఏకాభిప్రాయాన్ని ప్రతిఫలిస్తూ 1928లో నెహ్రూ రిపోర్టు దేవనాగరి లిపిలో లేక ఉర్దూలిపిలో. హిందూస్తానీ భారతదేశ ఉమ్మడి భాషగా ఉండాలని నిర్ధారించింది. ఇంగ్లీషు కూడా కొంతకాలం పాటు కొనసాగాలని చెప్పింది. స్వతంత్ర భారతదేశ రాజ్యాంగం కూడా హిందూస్తానీకి బదులుగా హిందీ అనే మార్పుతో అమలుపరచవలసి వచ్చింది. రాజ్యాంగ పరిషత్లో రెండు సమస్యలపై తీవ్రమైన చర్చ జరిగింది. ఇంగ్లీషు స్థానంలో హిందీ ఉండాలా లేక హిందూస్తానీ ఉండాలా? ఈ మార్పు ఎంతకాల వ్యవధి లోపల జరగాలి?


అధికార భాషా సమస్య రాజకీయీకరణ చేయబడడంతో చర్చల్లో చాలా తీవ్రమైన విభేదాలు వ్యక్తమయ్యాయి. హిందీ లేక హిందూస్తానీ సమస్య త్వరలోనే పరిష్కరించబడింది. గాంధీ, నెహ్రూ - ఇద్దరూ దేవనాగరి లేక ఉర్దూ లిపిలో వుండే హిందుస్తానీకి మద్దతిచ్చారు. హిందీ మద్దతుదారులు విభేదించినప్పటికీ గాంధీ నెహ్రూ అభిప్రాయాన్ని అంగీకరించేందుకు సన్నద్ధులయ్యారు. కాని దేశ విభజన ప్రకటించబడగానే ఉర్దూ ముస్లింల భాష అని పాకిస్తాన్ భాషయని పాకిస్తాన్ మద్దతుదారులు ప్రచారాలు సాగించడంతో హిందీ భాషాభిమానులు వైఖరి మారింది. హిందీ వీరాభిమానులు ఉర్దూపై వేర్పాటుకు సంకేతమనే ముద్ర వేశారు. దేవ నాగరలిపిలోని హిందీని జాతీయ భాషగా చేయాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండు కాంగ్రెస్ పార్టీని నిలువునా చీల్చింది. నెహ్రూ, ఆజాద్, హిందూస్థానీ కొరకు పోరాడినప్పటికీ కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ 78-77 ఓట్లతో హిందీకి అనుకూలంగా నిర్ణయం చేసింది. హిందీ వీరాభిమానులు కూడా రాజీకి రాక తప్పలేదు. హిందీని జాతీయ భాషగా గాక అధికార భాషగా చేసేందుకు అంగీకరించారు.


ఇంగ్లీషు నుండి హిందీకి మార్పుకి సంబంధించిన కాల వ్యవధి సమస్య హిందీ - హిందీయేతర ప్రాంతాల మధ్య విభజన తెచ్చింది. హిందీ ప్రాంతాల ప్రతినిధులు హిందీని వెంటనే అధికారభాషగా ప్రకటించాలన్నారు. కాని హిందీయేతర ప్రాంతాల ప్రతినిధులు నిరవధికంగా కాకపోయినా ఇంగ్లీషుని చాలా కాలం వరకు కొనసాగించాలన్నారు. భవిష్యత్తులో ఏర్పడనున్న పార్లమెంటు హిందీని అధికారభాషగా ప్రకటించే వరకు యధాతథాస్థితి కొనసాగాలని కోరారు. నెహ్రూ హిందీని అధికార భాషగా చేసేందుకు అనుకూలంగా ఉన్నాడు. అదనపు అధికార భాషగా ఇంగ్లీషు కొనసాగింపుకి కూడా అనుకూలంగా ఉన్నాడు. ఇంగ్లీషు నుండి హిందీకి మార్పు నెమ్మదిగా క్రమంగా జరగాలన్నాడు. సమకాలీన ప్రపంచంలో ఇంగ్లీషు ఉపయోగాన్ని గమనంలో దానిని ప్రోత్సహించాలన్నాడు. భారత ప్రజలలోని మెజారిటీ కాకపోయినా అత్యధికులు మాట్లాడే భాష హిందీ, పెట్టుకొని


లో బెంగాలునుంచి పంజాబు వరకు అలాగే మహరాష్ట్ర, గుజరాత్ లోని పట్టణ ప్రజలు అర్థం చేసుకునే భాష, కాని ఒక సాహిత్య భాషగా సైన్సు రాజకీయాల భాష హిందీ ఇతర భాషల కంటే తక్కువ అభివృద్ధి చెందిన భాషని విమర్శకుల అభిప్రాయం. హిందీని అధికార భాషగా చేస్తే హిందీయేతర ప్రాంతాల వారు ప్రత్యేకించి దక్షిణ భారతదేశం విద్య, ఆర్థిక రంగాలలో ప్రభుత్వ, ప్రభుత్వరంగ ఉద్యోగాలలో వెనుకబడుతుందని ఆందోళన. హిందీయేతర ప్రాంతాలపై హిందీని రుద్దడం వలన హిందీ ... రాజకీయ సామాజిక సాంస్కృతిక ఆధిపత్యానికి దారి తీస్తుందని ఆందోళన,


నిర్మాతలు బహు భాషలు గల దేశం నాయకులుగా ఒక భాషా |ంతాన్ని విస్మరించకూడదని, విస్మరించారనే భావం కలిగించడంగాని చేయకూడదని గహించారు. ఒక రాజీ కుదర్చబడింది. అంతర్జాతీయ అంకెలతో దేవనాగరి లిపిగ హిందీ అధికార భాషగా రాజ్యాంగం అవకాశం కల్పించింది. 1965 వరకు ఇంగ్లీషుల అధికార భాషగా కొనసాగుతుంది. హిందీ దశలవారీగా ప్రవేశపెట్టబడుతుంది. 1965 తరువాత, అది పూర్తి అధికార భాష అవుతుంది. అయినప్పటికి 1965 తరువాత కూడా ప్రత్యేకమైన ప్రయోజనాల రీత్యా ఇంగ్లీషుకి అవకాశం కల్పించే అధికారం పార్లమెంటుకి ఉంటుంది. హిందీ విస్తరణని అభివృద్ధిని పెంపొందించే బాధ్యత రాజ్యాంగం ప్రభుత్వంపై పెట్టింది. దీని అభివృద్ధిని సమీక్షించేందుకు కమిషన్ని, జాయింట్ కమిటీ ఆఫ్ పార్లమెంటుని నియమించే అధికారం కల్పించింది. యూనియన్ అధికార భాష వివిధ రాష్ట్రాల మధ్య అలాగే కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య అనుసంధాన భాషగా పనిచేస్తుంది. రాష్ట్ర శాసన సభలు అధికార భాషని రాష్ట్ర స్థాయిలో నిర్ణయించాలి.


దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికి రాజ్యాంగం నిర్దేశించిన భాషాపరమైన అంశాల అమలు కష్టతరమయింది. హిందీ పూర్తి అధికార భాష కాబోతుందనే అంశాన్ని ఎవరూ సవాలు చేయనప్పటికి కాలక్రమంలో సమస్య మరి జటిలమయింది.


రాజ్యాంగ నిర్మాతలు 1965 నాటికి హిందీ సమర్థకులు హిందీ బలహీనతల్ని హిందీయేతర ప్రాంతాల ప్రజల విశ్వాసాన్ని చూరగొంటారని ఆశించారు.

 అంతే వేగంగా పెరుగుతున్న విద్యావ్యాప్తితో హిందీ కూడా విస్తరిస్తుందని, హిందీకి ప్రతిఘటన క్రమంగా బలహీనపడి అదృశ్యమవుతుందని ఆశించటం జరిగింది. కాని __చాలా నెమ్మదిగా జరిగిన విద్యావ్యాప్తి ప్రతి కూల ప్రభావం చూపింది..


అంతేగాక అధికార భాషగా హిందీ విజయావకాశాల్ని హిందీ ప్రతిపాదకులే.. పాడు చేశారు. హిందీయేతర ప్రాంతాల వారి అంగీకారాన్ని పొందేందుకు క్రమబద్ధమైన నెమ్మదియైన నచ్చజెప్పే మితవాద వైఖరి అవలంబించడానికి బదులుగా హిందీ వీరాభిమానులు ప్రభుత్వ చర్యల ద్వారా బలవంతంగా రుద్దడానికి ప్రయత్నించారు. వారి అమితాసక్తి వ్యతిరేక ఉద్యమాన్ని ప్రేరేపించింది. 1959లో నెహ్రూ పార్లమెంటులో చెప్పినట్లు వారి అత్యుత్సకత వారి వైఖరి "నాకు చిరాకు కలిగించినట్లే ఇతరులకు చిరాకు కలిగించింది".


హిందీలో సామాజిక శాస్త్రాల, విజ్ఞాన శాస్త్రాల రచనలు వెలువడలేదు. ఉదాహరణకు 1950లలో సాహిత్యపరమైన పత్రికలుగాక విద్యావిషయక పత్రికలు ప్రచురింపబడలేదు. ఉన్నత విద్య, పత్రికలు, ఇతర రంగాలలో హిందీని ప్రయోజనకరమైన మాద్యమంగా అభివృద్ధి పరచడానికి బదులుగా నాయకులు హిందీని పూర్తి అధికార భాషని చేయడం పట్ల ఆసక్తి చూపారు.


హిందీ ప్రచారకులు విస్తృతమైన ఆదరణ పొందే సాధారణ స్థాయి భాషని అభివృద్ధి పరచటానికి లేక హిందీ ప్రాంతాలలో ఇంకా దేశంలోని పలు ప్రాంతాలలో ప్రజలు మాట్లాడే. వ్రాసే వ్యవహారిక భాషకు ప్రచారం ఇవ్వటానికి బదులుగా విదేశీ ప్రభావాలకు దూరంగా వుంచాలని, భాష యొక్క పవిత్రతని కాపాడే పేరుతో, సాధారణంగా అందరికి అర్థమయ్యే మాటల స్థానంలో కొత్తగా సృష్టించబడిన, కొద్దిమందికే అర్థమయ్యే మాటల్ని ప్రవేశపెట్టారు. హిందీ మాట్లాడనివారు (లేక హిందీ మాట్లాడేవారు కూడా) ఈ కొత్త భాషని అర్థం చేసుకొనడం నేర్చుకొనడం కష్టతరమయింది. హిందీని ప్రచారం చేయటంలో ముఖ్య పాత్ర నిర్వహించవలసిన జలిండియా రేడియో హిందీ వార్తల్ని సంస్కృతమయం చేసి శ్రోతల్ని హిందీ వార్తల్ని వినకుండా చేసింది. హిందీలో వడ, రచయిత అయిన నెహ్రూ, హిందీలోకి అనువదింపబడి ప్రసారం చేయబడిన తన ఉపన్యాసాలను తానే అర్ధం చేసుకోలేకపోతున్నానని 1958లో ఫిర్యాదు చేశాడు. కాని హిందీ పరిశుద్ధవాదులు మెత్తబడలేదు. హిందీ వార్తల్ని సరళతరం చేసే అన్నీ ప్రయత్నాలు అడ్డుకున్నారు. ఈ వైఖరి చాలా మందిని హిందీ వ్యతిరేక శ్రేణుల్లోకి చేర్చింది. కాని నెహ్రూ, ఇతర నాయకులు హిందీని అధికార భాష చేయడం పట్ల నిబద్ధులై ఉన్నారు.

ఇంగ్లీషు అధ్యయనం ప్రోత్సహించదగిన దైనప్పటికీ భారతదేశ అధికార భాషగా ఇంగ్లీషుల కలకాలం కొనసాగకూడదన్నారు. జాతీయైక్యత అలాగే ఆర్థిక రాజకీయాభివృద్ధి ప్రయోజనాల రీతా హిందీని అధికార భాషగా మార్చడానికి నిర్దిష్టకాల పరిమితిని విధించకూడదన్ని హిందీ ప్రాంతాల ప్రజల ఆమోదం లభించేవరకు వేచి చూడటం అవసరమని గుర్తించారు. హిందీయేతరులు కూడా మెత్తబడటానికి సిద్దంగా లేరు. కాలంతో పాటు వారి హిందీ వ్యతిరేకత పెరిగింది.


1956-60 కాలంలో అధికార భాషా సమస్యపై తీవ్రమైన విభేదాలు పెల్లుబికాయి. నియమించబడిన అధికార భాషా కమిషన్ తన రిపోర్టుని 1956లో సమర్పించింది. కేంద్ర ప్రభుత్వం యొక్క వివిధ కార్యక్రమాలలో ఇంగ్లీషుకి బదులుగా హిందీని క్రమబద్ధంగా ప్రవేశపెట్టాలని, 1965 నాటికి కట్టుదిట్టమైన మార్పులు తీసుకొని . రావాలని కమిషన్ సిఫార్సు చేసింది. కాని కమిషన్లోని పశ్చిమ బెంగాల్, తమిళనాడుకు.. చెందిన ఇద్దరు సభ్యులు - ప్రొఫెసర్ సునీత కుమార్ ఛటర్జీ, సుబ్బరామన్లు కమిషన్ సభ్యులు హిందీ అనుకూల మొగ్గులో వున్నారని ఆరోపించారు. అధికార భాషగా ఇంగ్లీషు కొనసాగాలన్నారు. విపరీతమేమంటే స్వతంత్రానికి ముందు ఛటర్జీ బెంగాలులో హిందీ ప్రచారిణి సభ కార్య నిర్వహకుడు. కమిషన్ రిపోర్టుని పార్లమెంటు స్పెషల్ జాయింటు కమిటీ సమీక్షించింది. జాయింట్ కమిటీ సిఫార్సుల్ని అమలు జరిపేందుకు ప్రెసిడెంటు 1960 ఏప్రిల్లో ఆదేశాలు జారీ చేశాడు. దానిలో 1965 తరువాత హిందీ అధికార భాషగా ఉంటుందని ఇంగ్లీషు సహ అధికార భాషగా కొనసాగుతుందని స్పష్టం చేశాడు. కొంతకాలం తరువాత యూనియన్ పబ్లిక్ కమిషన్ పరీక్షలకు హిందీ ప్రత్యామ్నాయ మాధ్యమమవుతుంది. కాని ప్రస్తుతానికి మాత్రం హిందీ అర్హత కల్పించే సబ్జెక్టుగా. ప్రవేశపెట్టబడుతుంది. ప్రెసిడెంటు ఆదేశాన్ననుసరించి హిందీని ప్రొత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం చాలా చర్యలు చేపట్టింది. సెంట్రల్ హిందీ డైరెక్టరేట్ను స్థాపించింది. హిందీ పుస్తకాల, హిందీలోకి అనువదించిన పుస్తకాల ప్రచురణ చేపట్టింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు హిందీలో నిర్బంధ శిక్షణ ఇప్పించింది. చట్టానికి సంబంధించి పెద్ద గ్రంథాల్ని హిందీలోకి అనువదింపజేసి, కోర్టులలో వాటి ఉపయోగాన్ని ప్రోత్సహించింది.


ఈ చర్యలు హిందీయేతర ప్రాంతాలలో గ్రూపులలో అనుమానాన్ని ఆతురతనికి పెంచాయి. ఉదాహరణకు ప్రముఖ భాషావేత్త. హిందీ ప్రచార ప్రోత్సాహకుడు ప్రొఫెసర్ సునిత్ కుమార్ ఛటర్జీ అధికార భాషా కమిషన్ రిపోర్టుకి పంపిన అసమ్మతి పత్రంలో కమిషన్ దృక్పధం 'తక్షణమే గాక చాలా కాలం వరకు ప్రయోజనాలు పొందే హిందీ మాట్లాడే వారి ప్రయోజనాలే'నని స్పష్టం చేశాడు. అలాగే 1958 మార్చిలో దక్షిణ భారతదేశంలో హిందీ ప్రచారిణి మాజీ ప్రెసిడెంట్ సి. రాజగోపాలాచారి 'హిందీ' ప్రచారకులకు ఇంగ్లీషు ఎంత విదేశీ భాషో హిందీ మాట్లాడని వారికి హిందీ అంతే విదేశీ భాషనీ స్పష్టం చేశాడు. మరోవైపు ఇరువురు ప్రముఖ హిందీ భాషాభిమానులు పురుషోత్తమాస్ టాండన్, సేర్ గోవింద్ దాస్ జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఇంగ్లీషుకు అనుకూలంగా వ్యవహరించిందని ఆరోపించారు. రాజ్యాంగంలో నిర్దేశించిన విధంగా ఇంగ్లీషుని తొలగించడంలో తాత్సారం జరుగుతుందని చాలా మంది హిందీ నాయకులు నెహ్రూని, విద్యా మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాదిని దుయ్యబట్టారు. రాజ్యాంగంలో నిర్దేశించిన హిందీలోకి మార్పు గడువుని కచ్చితంగా అమలు జరపాలని పట్టుబట్టారు. అధికార భాషగా ఇంగ్లీషు స్థానంలో హిందీని తక్షణమే అమలు జరపాలని 1957లో డాక్టర్ లోహియా సంయుక్త సోషలిస్టు పార్టీ, జనసంఘ్ ప్రారంభించిన సమరశీల ఉద్యమం రెండు సంవత్సరాల పాటు కొనసాగింది. లోహియా అనుచరులు విస్తృతంగా అమలు జరిపిన ఆందోళనా పద్ధతులలో ఒకటి షాపులు ఇతర స్థలాల్లోని సైన్ బోర్డులను చెరిపి వేయటం.


పాలనా వ్యవహారాలపై అధికార భాషా సమస్య కలిగించనున్న ప్రమాదాన్ని గుర్తించిన కాంగ్రెస్ నాయకత్వం హిందీయేతర ప్రాంతాల ఇబ్బందుల్ని గమనంలోకి తీసుకొని సమస్య పట్ల జాగ్రత్తగా వ్యవహరించింది. రాజీ కొరకు ప్రయత్నించింది. అధికార భాష దేశంలోని ఏ ప్రాంతం పైనైనా బలవంతంగా రుద్దబడదని, హిందీయేతర ప్రజల ఆకాంక్షల్ని గమనంలో పెట్టుకొని హిందీ మార్పుకి వ్యవధి నిర్ణయించబడుతుందని నెహ్రూ చాలాసార్లు స్పష్టం చేశారు. ఈ అంశంలో నెహ్రూ ప్రజా సోషలిస్టు పార్టీ (పిఎస్పి) భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) నాయకులు మద్దతునిచ్చారు. పి.ఎస్.పి. హిందీ తీవ్రవాదాన్ని విమర్శించింది. "భారతదేశం వంటి బహు భాషలు గల దేశంలో దేశ ఐక్యతకు తీవ్రమైన నష్టాన్ని కలిగించవచ్చునని ఆందోళన వ్యక్తం చేసింది.


నెహ్రూ 1959 ఆగస్టు 7న పార్లమెంట్ లో ముఖ్యమైన ప్రకటన చేశాడు. హిందీయేతర ప్రజల భయాందోళనల్ని తగ్గించేందుకు నిర్దిష్టమైన హామీ ఇచ్చాడు. "ప్రజలు కోరినంత కాలం ఇంగ్లీషు ప్రత్యామ్నాయ భాషగా ఉంటుంది. నిర్ణయం హిందీ ప్రజలు గాక హిందీయేతర ప్రజలు చేస్తారు. హిందీ నేర్చుకోవాలని కోరుకొనకపోతే నేర్చుకోకుం అని దక్షిణ భారత ప్రజలకు చెప్పాడు. ఈ హామీనే 1959 సెప్టెంబరు 4న నెహ్రూ పార్లమెంట్ పునరుద్ఘాటించాడు.


అంతర్గత పార్టీ ఒత్తిడులు, ఇండియా చట్టం చైనా యుద్ధం కారణంగా కొంత ఆలస్యమైనప్పటికి నెహ్రూ హామీల ననుసరించి 1963లో అధికార భాషా చేయబడింది. 1965 తరువాత ఇంగ్లీషు ఉపయోగంపై రాజ్యాంగం విధించిన నిబంధనని తొలగించడం చట్టం యొక్క లక్ష్యమని నెహ్రూ ప్రకటించాడు. కాని హామీలను స్పష్టమైన పదజాలంతో చట్టంలో వ్యక్తం చేయకపోవడం వలన ప్రయోజనం పూర్తిగా సిద్ధించలేదు. చట్టంలో 'హిందీతో పాటు ఇంగ్లీషు భాష ఉపయోగం కొనసాగించబడవచ్చును. హిందీయేతర గ్రూపులు చట్టంలోని పదజాలాన్ని విమర్శించారు. వారు దానిని చట్టపరమైన హామీగా భావించలేదు. ఇంకా స్పష్టమైన పదజాలమవసరమన్నారు. కారణం నెహ్రూన్ని నమ్మకపోవడం కాదు. హిందీనాయకుల నుండి కూడా ఒత్తిడి పెరుగుతుండడంతో నెహ్రూ తరువాత హామీకి ఏ గతి పడుతుందోనని ఆందోళన చెందారు. 1964 జూన్లో నెహ్రూ మరణించడంతో ఆందోళన పెరిగింది. దానికి తోడు వివిధ మంత్రిత్వశాఖలు రానున్న సంవత్సరంలో హిందీని అధికార భాషగా మార్చటానికి చర్యలు చేపట్టవలసిందిగా సర్క్యులర్లు జారీ చేశాయి. ఉదాహరణకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలతో జరిపే ఉత్తర ప్రత్యుత్తరాలు హిందీలో జరపాలని ఆదేశాలు జారీ చేయబడ్డాయి. హిందీయేతర రాష్ట్రాలకు ఆంగ్లీషు అనువాదం కూడా జతపరచబడుతుందని కూడా పేర్కొనబడింది.


నెహ్రూ వారసునిగా ప్రధానమంత్రి అయిన లాల్ బహుదూర్ శాస్త్రి హిందీయేతర గ్రూపుల అభిప్రాయానికి అంత సున్నితంగా స్పందించలేదు. హిందీ ఏకైక అధికార భాష అవుతుందనే భయాన్ని పోగొట్టడానికి బదులుగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలలో హిందీని ప్రత్యామ్నాయ మాధ్యమం చేసే ప్రతిపాదన పరిశీలనలో ఉందని ప్రకటించారు. అంటే హిందీయేతరుల అఖిల భారత ఉద్యోగాలలో ఇంగ్లీష్ మాధ్యమం ద్వారా పోటీలో వుండగలిగినప్పటికి హిందీ మాట్లాడే వారికి మాతృభాష కారణంగా సానుకూలత


అందుకు నిరసనగా చాలా మంది హిందీయేతర నాయకులు అధికార భాషా సమస్యపై వారి వైఖరి మార్చుకొన్నారు. ఇంగ్లీషు స్థానంలో హిందీని అధికార భాష చేసేందుకు చివరి గడువు పెట్టరాదని డిమాండ్ చేయడం ప్రారంభించారు. కొందరు నాయకులు ఇంకా ముందుకు పోయారు. ఉదాహరణకు ద్రవిడ మున్నేట్ర కజగం, సి. రాజగోపాలాచారి రాజ్యాంగాన్ని సవరించి ఇంగ్లీషుని అధికార భాష చేయాలని డిమాండ్ చేశారు.


1965 జనవరి 26 సమీపించేటప్పటికి హిందీయేతర ప్రాంతాలు, ప్రత్యేకించి తమిళనాడు భయాందోళనలకు గురయి హిందీ వ్యతిరేక ఉద్యమాన్ని ప్రారంభించింది. జనవరి 17న డి.యం.కె. పార్టీ మద్రాసు రాష్ట్ర హిందీ వ్యతిరేక సదస్సు నిర్వహించి జనవరి 26 సంతాప దినంగా పాటించమని పిలుపిచ్చింది. అఖిల భారత ఉద్యోగాలలో హిందీ ప్రాంతాల కంటే బాగా వెనుకబడి పోతామని కలత చెందిన విద్యార్థులు ఆందోళన నిర్వహణలో ప్రజాభిప్రాయాన్ని తన కనుకూలంగా మలచుకొనడంలో చురుకుగా పనిచేశారు. 'హిందీ నెవర్-ఇంగ్లీషు ఎవర్' నినాదానికి విస్తృత ప్రచారమిచ్చారు. రాజ్యాంగ సవరణ కొరకు కూడా డిమాండ్ చేశారు. విద్యార్థుల ఆందోళన రాష్ట్ర వ్యాప్త అశాంతిగా మారింది. ఉద్యమం యొక్క తీవ్రతని విస్తృతిని అంచనా వేయటంలో విఫలమైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కాంగ్రెస్ నాయకత్వం విద్యార్థులతో చర్చలు జరపడానికి బదులుగా ఉద్యమాన్ని అణచ ప్రయత్నించింది. ఫిబ్రవరి మొదటి వారాలలో విస్తృతంగా చెలరేగిన ఘర్షణలు, హింస పెద్ద ఎత్తున రైల్వేలు, ఇతర కేంద్ర ప్రభుత్వ ఆస్తులు విధ్వంసానికి దారి తీశాయి. హిందీ వ్యతిరేక భావాలు విపరీతంగా వ్యాప్తి చెందాయి. అధికార భాషా విధానానికి వ్యతిరేకంగా నలుగురు విద్యార్థులతో పాటు చాలామంది యువకులు ఆత్మాహుతి చేసుకున్నారు. కేంద్ర మంత్రి వర్గం నుండి ఇరువురు తమిళ మంత్రులు - సి.సుబ్రమణ్యం, అలగేశన్లు రాజీనామా చేశారు. ఆందోళన దాదాపు రెండు నెలలు కొనసాగింది. పొలీసు కాల్పులలో 60 మందికి పైగా చనిపోయారు. ఆందోళనకారుల పట్ల కలత చెందిన ఒకే ఒక కేంద్ర నాయకులు శ్రీమతి ఇందిరాగాంధీ. అప్పుడు ఆమె కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి. ఉద్యమం తీవ్రంగావున్న సమయంలో ఆమె మద్రాసు వెళ్ళింది. అలజడి ఎక్కువగా వున్న ప్రాంతాలలో పర్యటించింది. ఉద్యమకారుల పట్ల సానుభూతి ప్రకటించింది. ఆ విధంగా నెహ్రూ తరువాత బాధలలో కూరుకుపోయిన తమిళ ప్రజల, దక్షిణ భారత ప్రజల విశ్వాసాన్ని పొందిన మొదటి ఉత్తర భారతదేశ నాయకురాలు శ్రీమతి ఇందిరాగాంధీ.


జనసంఘ్, యస్.యస్. పి పార్టీలు హిందీ ప్రాంతాలలో ఇంగ్లీషు వ్యతిరేక ఆందోళన నిర్వహించయత్నించారు. కాని ప్రజల మద్దతు అంతగా లభించలేదు. ఆందోళనతో కేంద్ర ప్రభుత్వం మద్రాసు ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ - వైఖరులను ___మార్చుకొనక తప్పలేదు. దక్షిణ భారతదేశ ప్రజాభిప్రాయానికి తలొగ్గాలని నిర్ణయించాయి. విధానాన్ని మార్చుకొని ఆందోళనకారులు ప్రధాన డిమాండ్లను అంగీకరించాలన నిర్ణయించాయి. కాంగ్రెస్ వర్కింగు కమిటీ కొన్ని చర్యల్ని ప్రకటించింది. కేంద్ర చట్టానికి ప్రాతిపదికన వుండేది. హిందీ ఉద్యమ విరమణకు దారి తీసేది అయిన ఈ చట్టం చేయడాన్ని 1965 భారత్ - పాకిస్తాన్ యుద్ధం కొంత వెనక్కి నెట్టివేసింది. చట్టం అసంతృప్తి సద్దుమణిగేలా చేసింది.


బహుదూర్ శాస్త్రి 1966 జనవరిలో మరణించడంతో ఇందిరాగాంధీ ప్రధానం మంత్రి అయ్యారు. ఆమె అప్పటికే దక్షిణ భారత ప్రజల విశ్వాసం చూరగొనడంతో దీర్ఘకాలిక సమస్య పరిష్కారానికి చిత్తశుద్ధితో కూడిన ప్రయత్నం జరుగుతుందని ప్రజలు ఆశించారు. ఇతర సానుకూలమైన అంశాలు జనసంఘ్ ఇంగ్లీషు వ్యతిరేక తీవ్రతని తగ్గించుకొని మెత్తబడటం, 1965 ఒప్పందంలోని మౌలిక అంశాలను యస్.యస్.పి. అంగీకారం తెలపటం.


ఆర్థిక సమస్యల నెదుర్కొన్నప్పటికీ 1967 ఎన్నికలలో పార్లమెంట్లో కాంగ్రెస్ బలహీన పడినప్పటికి ఇందిరాగాంధీ 1963 అధికార భాషా చట్ట సవరణ బిల్లుని నవంబరు 27న ప్రతిపాదించారు. 1967 డిసెంబరు 16న 205-41 ఓట్లతో లోక్సభ బిల్లును ఆమోదించింది. 1959 సెప్టెంబరులో నెహ్రూ ఇచ్చిన హామీలకు చట్టం అసందిగ్ధమైన చట్టపరమైన రక్షణ కల్పించింది. కేంద్రంలో అధికార కార్యకలాపాలకు, కేంద్రం హిందీయేతర రాష్ట్రాల మధ్య సమాచార సంబంధాలకు హిందీతో పాటు ఇంగ్లీషుని సహభాషగా ఉపయోగించుకొనడాన్ని హిందీయేతర రాష్ట్రాలు కోరినంతకాలం కొనసాగించటానికి చట్టం అవకాశం కల్పించింది. నిరవధికంగా ద్విభాషా విధానం ఆమోదించబడింది. సర్వీస్ కమిషన్ పరీక్షలు హిందీ, ఇంగ్లీషులలోనే గాక అన్ని ప్రాంతీయభాషలలో కూడా శ్రీ నిర్వహింపబడాలని ఒక విధాన తీర్మానాన్ని కూడా పార్లమెంట్ ఆమోదించింది. కాని అభ్యర్థులకు హిందీలో లేక ఇంగ్లీషులో అదనపు పరిజ్ఞానం వుండాలని షరతు విధించింది. రాష్ట్రాలు త్రిభాషా విధానాన్ని అమలు పరచాలి. దీనిననుసరించి హిందీయేతర రాష్ట్రాలలోని పాఠశాలల్లో మాతృభాష హిందీ, ఇంగ్లీషు లేక మరేదైనా జాతీయ భాష బోధించాలి. హిందీ ప్రాంతాలలో హిందీయేతర భాష వీలైనంతవరకు దక్షిణ భారతదేశ భాష బోధించాలి. భారత ప్రభుత్వం భాషా సమస్యపై 1967 జూలైలో మరొక ముఖ్యమైన చర్య చేపట్టింది. 1966 విద్యాకమిషన్ రిపోర్టు సిఫార్సుల ననుసరించి యూనివర్సిటీ స్థాయిలో అన్ని సబ్జెక్టులలో కాలక్రమంలో భారతీయ భాషలు విద్యామాధ్యమాలు అవుతాయని ప్రభుత్వం ప్రకటించింది. మార్పుకి కాలవ్యవధిని నిర్ణయించుకొనే అవకాశం యూనివర్సిటీలకు వదిలి వేయబడింది.


ఎన్నో మెలికలు మలుపులు, ఎన్నో చిన్నా పెద్ద చర్చలు ఆందోళనలు, రాజీల తరువాత సంక్లిష్టమైన అధికారభాష, అనుసంధాన భాషల సమస్యకి విస్తృతామోదం పొందిన పరిష్కారం లభించింది. 1967 నుండి ఈ సమస్య భారతదేశ రాజకీయ రంగం నుండి క్రమంగా అదృశ్యమయింది. ఒక వివాదాస్పదమైన సమస్యని ప్రజాస్వామ్యయుతంగా జాతీయైక్యతని పెంపొందించే పద్ధతిలో పరిష్కరించే శక్తి సామర్థ్యాలు భారత రాజకీయ వ్యవస్థకి కలపని నిరూపితమైంది. ఉద్రిక్తతల పరంగా ప్రజల్ని విభజించిన, దేశ సమైక్యతకు హాని కలిగించగలిగే సమస్యకు చర్చలు రాజీ ద్వారా విస్తృతామోదం పొందిన పరిష్కారం కనుగొనబడింది.


చివరికి భాషా సమస్య ముఖ్యమైన పాత్ర నిర్వహించడంతో అధికారంలోకి వచ్చిన డి.యం.కె కూడా తమిళనాడులోని రాజకీయ వాతావరణాన్ని శాంతింపచేయడానికి తోడ్పడింది  .


ఏ రాజకీయ సమస్య కూడా శాశ్వతంగా పరిష్కరింపబడదు. భారతదేశం బాంటి సంక్లిష్టమైన దేశంలో సమస్య పరిష్కారం ఒక నిరంతర ప్రక్రియగా వుంటుంది. కాని హిందీయేతర ప్రాంతాలలో విద్య, వాణిజ్యం, టూరిజం, చలన చిత్రాలు, రేడియో, టెలివిజన్ల ద్వారా హిందీ వేగంగా అభివృద్ధి చెందడం గమనార్హం. ఇంగ్లీషుది ఆధిపత్యం ల అయినప్పటికీ అధికారభాషగా హిందీ ఉపయోగం పెరుగుతూ వుంది. అదే సమయంలో హిందీ మాట్లాడే ప్రాంతాలతో సహా రెండవ భాషగా ఇంగ్లీషు వేగంగా విస్తరించింది. అందుకు ఉపాధ్యాయులు వసతులు ఎంత అధ్వానంగా వున్నప్పటికీ కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకు దేశవ్యాప్తంగా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ప్రైవేట్ ఇంగ్లీషు మీడియం స్కూలే సాక్ష్యం మాట్లాడే ఇంగ్లీషు, వ్రాసే ఇంగ్లీషు స్థాయి పడిపోయింది. కాని ఇంగ్లీషు తెలిసిన వారి సంఖ్య ఎన్నో రెట్లు పెరిగింది. ఇంగ్లీషు, హిందీ రెండు అనుసంధాన భాషలుగా అభివృద్ధి చెందవచ్చు. అధికార కార్యకలాపాల ద్వారా విద్య ద్వారా మీడియా ద్వారా ప్రాంతీయ భాషలు విస్తరిస్తున్నాయి హిందీ, ఇంగ్లీషు ప్రాంతీయ భాషల పెరుగుదలకు ఆయా భాషలలో వెలువడుతున్న వార్త పత్రికలే నిదర్శనం. వాస్తవంగా ఇంగ్లీషు భారతదేశంలో కలకాలం మనగలుగుతుందని చెప్పలేము. కాని దేశవ్యాప్తంగా గల మేధావుల మధ్య పరస్పర భావవ్యక్తీకరణ భాషగా, లైబ్రరీ భాషగా యూనివర్సిటీలలో రెండవ భాషగా ఇంగ్లీషు వుంటుంది. అభివృద్ధి చెందుతుంది. ఇప్పటి వరకు హిందీ ఆ మూడు పాత్రలు నిర్వహించడంలో విఫలమయింది. హిందీని దేశం యొక్క అనుసంధాన భాషగా చేయాలనే ఆదర్శం అలాగే వుండిపోయింది. కాని అత్యుత్సాహ హిందీ ప్రచారకులు హిందీ పట్ల అవలంబించిన విధానం హిందీ దేశవ్యాప్త అనుసంధాన భాష అయ్యే క్రమాన్ని కూడా వెనక్కి నెట్టి వేసింది.


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నారద గానమాత్సర్యం - పింగళి సూరన degree 4 th sem Telugu

మీరు అటామిక్ హ్యాబిట్ చదవకపోతే ఏమి జరుగుతుంది?మీరు అటామిక్ హ్యాబిట్ చదవకపోతే ఏమి జరుగుతుంది? ఎందుకు తప్పక చదవాలి

డెడ్ సీ అంటే ఏమిటి ?