పోస్ట్‌లు

ఆగస్టు, 2023లోని పోస్ట్‌లను చూపుతోంది

పంద్రాగస్టు పండుగన ? విషాదమా ?

 గంగాయునది. తీరం లోనూ గానది తీరమే కాదు, సనాతన ధర్మం, సంస్కృతి విక సించింది. సింధు, ముల్తాన్ వంటి ప్రదేశాలలో మన వేదాలు రాశారు. పాకిస్తాన్ హిందువు లకు కూడా పవిత్రమైనదే కానీ, దురదృష్టవశాత్తు 1947లో వాటిని మనం కోల్పోయాం. ముందుచూపు లేకపోవడం వల్లనో, ముస్లిం లీగ్ బెదిరింపు తలొగ్గడం వల్లనో, మత ప్రాతిపదికన దేశాన్ని విభజించుకున్నాం. ఈ దేశ విభజన భారత చరిత్రలోనే కాదు, ప్రపంచ చరిత్రలోనే మానవత్వానికి మాయని మచ్చ.. అభిప్రాయం అఖండ భారతన్ను సమర్థిస్తూనే. పాకిస్తాన్లో ఉన్న మైనారిటీలను పూర్తిగా వదిలివే యమని, ఆపత్కాలంలో ఆదుకుంటామని విభజన సమయంలో గాంధీ, నెహ్రూ లాంటి కాంగ్రెస్ నాయకులు వారికి హామీలు ఇచ్చా రు. అంతకుముందు ఇదే కాంగ్రెస్ నాయకు. అనేక తీర్మానాల ద్వారా అఖండ హిందు స్థాన్ విభజన జరగదని హామీ ఇచ్చారు. భారత జాతీయ కాంగ్రెస్ చారిత్రాత్మక మహా సభలు 1929 - 30లో లాహోర్లో జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన జరిగాయి. డిసెంబర్ 31న ఆయన మన దేశ ప్రజల చేత సంపూర్ణ స్వాతం త్ర ప్రతిజ్ఞ చేయించాడు. ఆ జాతీయ లక్ష్యం పట్ల నిబద్దతకు పావన రావీనది జలాలే సాక్షాలు. 1940లో ముస్లిం లీగ్ పాకిస్తాన్ ఏర్పాటు తీర్మానాన్ని తమ సమావేశాల్లో ఆమోదించిం

ఉర్దూ కవితారూపాలు Degree 5th sem

ఉర్దూ కవితారూపాలు 1. రుబాయి తెలుగు కవితా తరంగిణిలోకి ఎల్లలు దాటి వచ్చి ఒద్దికగా ఒదిగిపోయిన ప్రక్రియలెన్నో ఉన్నాయి. వాటిలో తెలుగువారిని మంత్రముగ్ధుల్ని చేసిన ప్రక్రియల్లో రుబాయి, గజల్ ముఖ్యమైనవి. గజల్, రుబాయి రెండూ సమాంతర ప్రక్రియలు. ఇవి గేయ కవిత్వ శాఖకు చెందినవి. రుబాయి రుబాయిలోని భావుకత, రమణీయత మనసు మీద చెరగని ముద్ర వేసి మాధుర్యాన్ని హృదయానికి అందిస్తాయి. తెలుగు కవితా పూదోటలో రుబాయి ఒకానొక వర్ణరంజితమైన కుసుమం. 'అర్బా' అనే అరబ్బీ పదం నుండి 'రుబాయి' అనే పదం ఏర్పడింది. 'రుబాయి' అంటే 'నాలుగు' అని అర్ధం ఉంది. నాలుగు పంక్తులుగల కవిత అని అర్ధం చేసుకోవాలి. 'రుబ్' అంటే 'రసం', 'సారం' అనే అర్ధాలు ఉన్నాయి. 'రుబాయి' అంటే రసవంతమైనది అని అర్థం. 'రుబాయి' అనేది ఒక పారసీ ఛందస్సుకు పేరు. ఇదే కవితా ప్రక్రియగా మారింది. దీన్నే హిందీలో 'చౌపదీ' అంటారు. పారసీ భాష నుంచి తెలుగులోకి దిగుమతి అయిన ప్రక్రియ 'రుబాయి'. దీనికి ఆద్యుడు పర్షియన్ కవి అయిన మహమ్మద్ రూర్కీ (859-941), ఉర్దూ లేదా పారసీ రుబాయిలు తెలుగు వారికి అనువాదాల ద్వార

వ్యాసం Degree 5th semester Telugu

 సమకాలీనంలో జరుగుతున్న విషయాలను గతంలో జరిగిన విషయాలను వచన రూపంలో రికార్డు చేయడమే వ్యాసం. చరిత్రలో జరిగిన విషయ సంఘటనలు నమోదు చేయడానికి ఉపయోగపడుతుంది. వచన రచనగా వ్యాసం ఉన్నందువల్ల విషయం. తొందరగా పాఠకునికి చేరుతుంది. పాఠకునిలో కొత్త ఆలోచనలకు నాంది పడుతుంది. ఆ ఆలోచనల ప్రభావం వివిధ మార్గాల ద్వారా సమాజంపై ప్రతిఫలిస్తుంది. దీంతో ఒక సామాజిక పరివర్తనకు కొత్త మార్గం ఏర్పడుతుంది. ఈ మార్గాన్వేషణ వ్యాసం ద్వారా స్పష్టంగా కలుగుతుంది. ప్రతి వచన రచనకు మూలం వ్యాసమే. ఇదే వివిధ రూపాలను, మార్పులను పొంది. వెలువడుతున్నది. ఒక నూతన ఆలోచనా విధానాన్ని కలిగిస్తున్నది. విభిన్న వస్తు రూపాలున్నా దేని మార్గం దానిదే, దేని ప్రతిఫలనం దానిదే. ఇది వ్యాసం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది.  నిర్వచనం వ్యాసం ఒక ఆధునిక సాహిత్య ప్రక్రియ. ఈ పదానికి ప్రయత్నం, పరిశీలనం అని అర్ధాలున్నాయి. ప్రయత్నం రాతకు, పరిశీలనం ఆలోచనకు సంబంధించినది. ఒక విషయానికి పరిమితమై దాన్ని చర్చించడం, దానికి సంబంధించిన కొత్త కోణాన్ని ఆవిష్కరించడం, కొత్త ఆలోచనలను కలిగించడం, కొత్త విషయాన్ని పరిచయం చేయడం, కొత్త ప్రతిపాదనలు చేస్తూ వచనంలో సాగే ప్రక్రియను వ్యాసం అని ని

వ్యాస పరిణామం Degree 5th semester

 వ్యాస పరిణామం ప్రక్రియ ఏదైనా దానికి ఓ పరిణామక్రమం ఉంటుంది. ఆవిర్భావం, వికాసం ఒక క్రమపద్ధతిలో జరుగుతాయి, కాలం, అవసరాలను బట్టి వ్యాసం కూడా అనేక మార్పులకు గురై ఇప్పటి పరిణత రూపం సంతరించుకున్నది. అనేకమంది రచయితల కృషి ఫలితంగా తెలుగువ్యాసం వస్తువులో, భాషలో, శైలిలో, ప్రయోజనంలో ప్రత్యేకతను, పరిపూర్ణతను సాధించింది. వ్యాసం చర్చించే విషయం, అప్పటి పరిస్థితులు, వాటి తీవ్రతను బట్టి ఆ పరిణామాలు సంభవించాయి. విమర్శనాత్మకమైనవి, వ్యక్తిగత విషయాలపై సాగేవి, చారిత్రక విషయాలను చర్చించేవి, శాస్త్ర వైజ్ఞానిక, సాంకేతిక విషయాలను ఆవిష్కరించేవి, రచనల్లోని పాత్రలనూ, వ్యక్తులనూ పరిచయం చేస్తూ సాగేవి, స్వీయ అనుభవాలను తెలియజేస్తూ రాసేవి. ఆయా విషయాలపై అభిప్రాయాలను తెలియజేస్తూ సాగే సంపాదకీయాల వంటివి. వంగ్య హాస్య ప్రధానమైనవి. వినోద ప్రధానమైనవి. ఇలా అనేక విభాగాలుగా తెలుగు వ్యాసం విస్తరించింది. ప్రారంభ దశ (1862-1910) 1862-1876 మధ్య కాలంలో సామినేని ముద్దునరసింహనాయుడు, పరవస్తు వేంకట రంగాచార్యులు, జియ్యరు సూరి వ్యాస పరిణామంలో ప్రధానవ్యక్తులుగా గుర్తించవచ్చు. అయితే వీరు వ్యాస లక్షణాలు కలిగి ఉన్న వచన రూప రచనలు గ్రంథం, ప్రకరణముల

వ్యాస రచనా పద్ధతులు Degree 5th semester Telugu

 వ్యాస రచనా పద్ధతులు ఒక విషయాన్ని వివరించి, క్లుప్తంగా రాయడం వ్యాసమని ముందు పాఠంలో నేర్చుకున్నాం. వ్యాసం పరిమితమైన అంశంతో, పూర్వ పర సమన్వయంతో వచన రూపంలో ఉంటుంది. విషయ నిర్ణయార్హతను మానసిక సామర్ధ్యాన్ని స్వేచ్ఛగా తెలిపేదే వ్యాసమని చెప్పవచ్చు. అర్ధవంతమైన వ్యాసం రాయడానికి అనేక రచనా పద్ధతులున్నాయి. వ్యాస రచన ప్రావీణ్యత కోసం శిక్షణ అవసరం. ఒక విషయాన్ని స్థూలంగా చదివి, దానిలోని సారాంశాన్ని సంగ్రహించి కొత్త ఆలోచనలతో విషయాన్ని రాయడం ఎలాగో రచనా పద్ధతుల్లో తెలుసుకుంటాం. వ్యాస రచనా పద్ధతులు పాఠశాల నుంచి కళాశాల స్థాయి వరకు విద్యార్థులను పరీక్షల్లో కొన్ని ప్రశ్నలకు వ్యాస రూప సమాధానాలు రాయండి అని అడుగుతారు. వాటికి మార్కులు కూడా ఎక్కువ. పరీక్షకుడు పాఠ్యభాగ సారాంశాన్నో లేక ఏదేని పాత్ర గురించో సమాధానం రాయమని విద్యార్థులను ఈ ప్రశ్నల్లో అడుగుతాడు. దానికి విద్యార్థులు తెలిసిన విషయాన్ని విస్తారం చేసి రాస్తారు. సమాధానం వ్యక్తీకరించడంలో కొన్ని నిర్దిష్ట పద్ధతులు అనుసరించి రాసినవారు . ఎక్కువ మార్కులు సాధిస్తారు. కేవలం పేజీలు నింపినవారు విఫలమవుతారు. ఇది విద్యార్థులందరికీ అనుభవంలో ఉన్నదే. అలాగే పోటీ పరీక్షల్లో క

వ్యాసంలో వస్తు వైవిధ్యం Degree 5th semester

 వ్యాసంలో వస్తు వైవిధ్యం వ్యాసం నిర్వచనం. పరిణామం, రచనా పద్ధతుల గురించి ముందు పాఠాల్లో తెల్చుకున్నాం. ఇందులో వ్యాసంలోని వస్తు వైవిధ్యం గురించి నేర్చుకుందాం. ఇంతకీ వస్తువు అంటే ఏమిటి? అందులో వైవిధ్యం ఎలా ఉంటుంది? దానికి నిర్దిష్టమైన సూత్రాలు ఉన్నాయా? అనే విషయాలు పరిశీలిద్దాం. వస్తువంటే వ్యాసం రాయడానికి ఎంచుకున్న విషయం. ఏ అంశం మీద వ్యాస రచన చేస్తామో అది వస్తువు. వ్యాసంలో వస్తువే ప్రధానం. వైవిధ్యం అంటే వివిధత్వం. అంటే అనేక రకాలుగా ఉండటం. వ్యాస వస్తువు ఫలానా అయి ఉండాలన్న నిబంధన ఏమీ లేదు. రంగం ఏదైనా కావచ్చు. ఆ రంగానికి సంబంధించిన ఆలోచనల పరంపరను క్రమపద్ధతిలో కూర్చడం, విషయాన్ని విభజించి కళాత్మకంగా పేర్చడం వల్ల మంచి వ్యాసం రూపుదిద్దుకుంటుంది. వ్యాస వస్తువు రచయిత అభిరుచి, అవగాహనపై ఆధారపడి ఉంటుంది. అది కాల పరిస్థితులకు అనుగుణంగా మారుతూ ఉంటుంది. వ్యాసం ఒక సృజనాత్మక కళ. అది సామాజిక చైతన్యానికి వాహిక. అది విభిన్న అంశాల పట్ల అవగాహన కలిగిస్తుంది. పరిసరాలను, ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది. తార్కిక జ్ఞానాన్ని పెంపొందిస్తుంది. వ్యక్తుల బుద్ధి వికాసానికి దోహదం చేస్తుంది. హృదయాన్ని చలింపజేస్తుంది. స్పందింపజ

వ్యాసరచనలో భాషాప్రయోగాలు డిగ్రీ 5వ sem

 వ్యాసరచనలో భాషాప్రయోగాలు భావవ్యక్తీకరణకు భాష ఒక సాధనం. పదజాలం ద్వారా అది ఆలోచనలు, సమాచార వినిమయానికి దోహదం చేస్తుంది. వ్యక్తులు తమను తాము వ్యక్తం చేసుకోవడానికి, జ్ఞానం పెంచుకోవడానికి భాష ఒక వాహికగా పనిచేస్తుంది. ప్రక్రియ ఏదైనా పరమార్ధం అదే. ఆధునిక కాలంలో వ్యాసం మిగతా ప్రక్రియల కంటే ఈ కర్తవ్యాన్ని ఎక్కువగా నిర్వర్తిస్తున్నది. -వ్యాసంలో భాష ఎంతో ముఖ్యమైనది. వ్యాసంలోని సారాంశాన్ని పాఠకుని దగ్గరకు చేర్చేది అందులోని భాషనే. కాబట్టి అందుకు అనుగుణమైన భాషను వ్యాసంలో ప్రయోగించాలి. పలుకుబడులతో కూడిన జనవ్యవహార భాష పాఠకుని హృదయానికి హత్తుకుంటుంది. భాష ఒక నదిలాంటిది. అది నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. పిల్ల కాలువలా ఉద్భవించి మధ్యలో ఉపనదులు, వాగులు, వంకలు, కాలువలను కలుపుకొని ముందుకు సాగుతుంది. దేనినీ నిరాకరించదు. అది క్రమంగా మహానదియై విస్తరిస్తుంది. భాష కూడా అలాంటిదే. సాహిత్య రూపం పొందిన భాష సజీవ స్రవంతిలా వృద్ధి చెందుతుంది. ఇతరు భాషా పదాలను తనలో మేళవించుకొని వికసిస్తుంది. ఆధునిక సమాజ అవసరాలకు అనుగుణంగా శాస్త్రసాంకేతికరంగ పారిభాషిక పదాలను కూడా తనలో కలుపుకుంటుంది. అవన్నీ సాహిత్యరూపాల్లో వ్యక్తమవుతాయి. జ

అధ్యయన సంస్కృతి Degree 5th sem

 అధ్యయన సంస్కృతి మన సమాజం క్రమానుగతంగా పరిణామం చెందింది. ప్రకృతిలో భాగమైన ఆదిమ. సమాజం నుంచి ఆధునిక యుగం వరకు మనుషులు సుదీర్ఘ ప్రయాణం చేశారు. ప్రకృతిలో జరిగే పరిణామాలకు కార్యకారణం తెలియక అమూర్తభావనలోకి ఇంకిపోయారు. సూర్యుడు. ఉదయించటం, వెన్నెల కురియటం, మేఘం వర్షించటం, మెరుపు మెరవటం, ఉరుము ఉరమటం, పిడుగు పడటం, భూమి చలించటం, విత్తనం మొలకెత్తటం, పువ్వు కాయగా మారటం, ఆకు రాలిపోవటం, వసంతం చిగురించటం, పక్షుల కిలకిలా రావాలు, పులి గాండ్రింపు, లేడి గంతులు, నెమలి నాట్యం ఇలా ఎన్నో మరెన్నో అద్భుతాలను తొలిమానవులు చూశారు. విన్నారు. కానీ ఆ ప్రకృతి రమణీయతను అర్థం చేసుకోవడానికి చాలా కాలం పట్టింది. భూమిని సాగు చేయటం, నీటికి అడ్డుకట్ట వేయటం ఆ కాలపు మనిషి సాధించిన అద్భుత ప్రగతి. 'భూమితో మాట్లాడితే జ్ఞానమిస్తుంది' అనేది సూక్తి, నిజంగా వ్యవసాయం ప్రారంభం కావటం మానవవికాసదశలో ముఖ్యమైనది. భూమిని సాగుచేస్తున్న క్రమంలో మనుషులు ఎన్నో అనుభవాలను సొంతం చేసుకున్నారు. ప్రకృతిలో దొరికిన పదార్థాలను ఏ రోజుకారోజు తిని జీవించే స్థితినుంచి పంటను ఉత్పత్తి చేసి తర్వాతి కాలానికి నిల్వ చేసుకునే స్థాయికి సమాజం ఎదిగింది. జంతువు

సాహిత్య అధ్యయనం ప్రయోజనాలు Degree 5th sem Telugu

సాహిత్య అధ్యయనం ప్రయోజనాలు పాటలు, గేయగాథలు, సామెతలు, పొడుపు కథలు, తోలుబొమ్మలాటలు, యక్షగానం, కోలాటం మొదలైన రూపాలలో శ్రామికవర్గాల సాహిత్యం ప్రజలలో సజీవంగా ఒక తరం నుంచి మరో తరానికి కొనసాగుతున్నది. దీనినే మనం విద్యాసంబంధ పాఠ్య ప్రణాళికలలో జానపద సాహిత్యం అంటున్నాం. ఇది కాకుండా మార్గ సాహిత్యంగా ఉండిన కావ్యాలు, ఇతిహాసాలు సామాజిక ప్రతిబింబాలుగా కోకొల్లలుగా వచ్చాయి. వేదాలలో ఉన్న భావాన్ని పురాణంగా, ఇతిహాసంగా, సాహిత్యంగా మార్చి ప్రజలలోకి తీసుకొచ్చారు. వేదం రాజులాంటిదని, పురాణం మిత్రుల వంటిదని, కావ్యం కాంత వంటిదని మన పెద్దలు చెప్పారు. వేదంలోని విషయాలను, పురాణంలోని అంశాలను సున్నితంగా, రసాత్మకంగా అందరికీ అర్ధమయ్యేలా ప్రేమగా చెప్పవలసిన అవసరం ఆనాటి సమాజానికి ఏర్పడింది. కనుక ధర్మశాస్త్రాలు, ప్రకృతి శాస్త్రాలు, వైద్య శాస్త్రాలు, మంత్రగత విషయాలు, నీతిశాస్త్రాలు, వైదిక విషయాలు మొదలైన శాస్త్ర సంబంధ అంశాలన్నింటిని సాహిత్యంగా మార్చి చెప్పటం వలన ప్రజలు ఆకర్షితులయ్యారు. ఆనాటి సమాజానికి సాహిత్యం రూపొందవలసిన అవసరం ఏర్పడింది. మనిషిలో ఉండే సహజాతమైన ఉద్వేగాలు, సామాజిక సంబంధాలు కళాత్మకంగా వ్యక్తమవుతాయి, ప్రకృతి, శ్ర

ముందుమాట Degree 5th sem

 ముందుమాట ఇంటికి ప్రధాన ద్వారం ఎలాగో పుస్తకానికి ముందుమాట అలాంటిది. పుస్తక పుటల్లోకి ప్రవేశించడానికి ముందుమాట ఒక సన్నని బాట ఏర్పరుస్తుంది. పుస్తక స్వరూప, స్వభావాలను సారాంశాన్ని ముందుమాట ప్రతిబింబిస్తుంది. ముందుమాట కొత్త పాఠకులకు ఒక దీపధారిలాంటిది. 'Fore word ' అనే ఆంగ్ల పదానికి సమానార్ధక పదంగా తెలుగులో ముందుమాట అని వాడుతున్నారు. గ్రంథం లేదా రచనకు ప్రారంభంలో ముందుగా ఉంటుంది. కాబట్టి ముందుమాట అని వ్యవహరిస్తున్నాం. తెలుగు గ్రంథాలలో మున్నది, ఆముఖం, పీఠిక, ప్రస్తావన, పరిచయం, భూమికలాంటి మాటలతో సూచించారు. జె.ఎ. కర్జన్ (J. A. Cuddon) తన డిక్షనరీ ఆఫ్ లిటరరీ టెక్స్ట్ fore word అంటే usually a short introductory piece to a book. It is similar to preface (Q.V) and an introduction, but is generally com- posed not by the author but by some are else" అని వివరించాడు. ఇది నిర్వచనం కాకపోయినా fore word అంటే ఏమిటో వివరిస్తుంది. తెలుగులో 'ముందుమాట' అనే అర్ధాన్నే ఇస్తూ అనేక పదాలున్నట్లుగానే ఆంగ్లంలోనూ Preface, introduction అనే పదాలున్నాయి. ఆయా కాల, సందర్భాల్లో వారి వారి అవసరాలను బట్టి భి

పుస్తక సమీక్ష Degree 5th sem Telugu

  పుస్తక సమీక్ష పుస్తక రచయితకు, పాఠకుడికి మధ్య వంతెన లాంటిది. సాహిత్యంలో అస్పష్టత, అన్వయ క్లిష్టత పెరుగుతున్న నేటి కాలంలో సమీక్షా వ్యాసం ఎంతో ప్రజాదరణ పొందుతున్నది. అవగాహనకూ, అనుభూతికి పుస్తక సమీక్ష తోడ్పాటునందిస్తున్నది. సాధారణ పాఠకుడికి మార్గదర్శనం చేస్తూ పఠనాభిలాషను పెంపొందిస్తుంది. పుస్తక సమీక్ష దూరతీరాల్లో ఉన్న సహృదయ పాఠకుడి దగ్గరికి పుస్తకాన్ని చేరవేస్తుంది. ' ఈక్ష' అనే ధాతువుకు 'సం' అనే ఉపసర్గ చేరి 'సమీక్ష' అనే పదం ఏర్పడింది. అంటే లోతుగా చూడడం, పరిశీలన, అవగాహన, అన్వేషణం, ఆలోచన అనే అర్ధాలున్నాయి. విమర్శ. సమీక్ష రెండూ ఒకటి కాదు. రెండింటి మధ్య సన్నటి విభజనరేఖ ఉంది. విమర్శ అంటే 'గుణదోష వివరణ' సమీక్ష అనే పదానికి శబ్దరత్నాకరము 'చక్కగా చూచుట', 'వెదుకుట' అనే అర్ధాలనిచ్చింది. ఆంగ్లంలోని Review అనే పదానికి సమానార్ధకంగా తెలుగులో 'సమీక్ష' అనే పదాన్ని వాడుతున్నారు. ఆంగ్ల సాహిత్య పరిచయంతో తెలుగులో సమీక్ష మరింత పరిణతి సాధించింది. ముద్రణా సౌకర్యాలు పెరగడం, పత్రికలు పెరగడం, విరివిగా పుస్తకాలు వెలువడటం ఇత్యాది కారణాల వలన గ్రంథ సమీక్ష ఒక ప్రత