ఉర్దూ కవితారూపాలు Degree 5th sem

ఉర్దూ కవితారూపాలు


1. రుబాయి


తెలుగు కవితా తరంగిణిలోకి ఎల్లలు దాటి వచ్చి ఒద్దికగా ఒదిగిపోయిన ప్రక్రియలెన్నో ఉన్నాయి. వాటిలో తెలుగువారిని మంత్రముగ్ధుల్ని చేసిన ప్రక్రియల్లో రుబాయి, గజల్ ముఖ్యమైనవి. గజల్, రుబాయి రెండూ సమాంతర ప్రక్రియలు. ఇవి గేయ కవిత్వ శాఖకు చెందినవి.


రుబాయి


రుబాయిలోని భావుకత, రమణీయత మనసు మీద చెరగని ముద్ర వేసి మాధుర్యాన్ని హృదయానికి అందిస్తాయి. తెలుగు కవితా పూదోటలో రుబాయి ఒకానొక వర్ణరంజితమైన కుసుమం. 'అర్బా' అనే అరబ్బీ పదం నుండి 'రుబాయి' అనే పదం ఏర్పడింది. 'రుబాయి' అంటే 'నాలుగు' అని అర్ధం ఉంది. నాలుగు పంక్తులుగల కవిత అని అర్ధం చేసుకోవాలి. 'రుబ్' అంటే 'రసం', 'సారం' అనే అర్ధాలు ఉన్నాయి. 'రుబాయి' అంటే రసవంతమైనది అని అర్థం. 'రుబాయి' అనేది ఒక పారసీ ఛందస్సుకు పేరు. ఇదే కవితా ప్రక్రియగా మారింది. దీన్నే హిందీలో 'చౌపదీ' అంటారు. పారసీ భాష నుంచి తెలుగులోకి దిగుమతి అయిన ప్రక్రియ 'రుబాయి'. దీనికి ఆద్యుడు పర్షియన్ కవి అయిన మహమ్మద్ రూర్కీ (859-941), ఉర్దూ లేదా పారసీ రుబాయిలు తెలుగు వారికి అనువాదాల ద్వారానే పరిచయం అయ్యాయి. విప్రలంబ శృంగారం, స్త్రీ ఆరాధన, మార్మికత ఉన్నందువల్ల ఉమర్ ఖయ్యాం కవిత్వం తెలుగు కవితా ప్రేమికులను బాగా ఆకర్షించింది.


లక్షణాలు


భారతీయ భాషలైన ఉర్దూ, తెలుగు భాషల్లో తప్ప మిగిలిన భాషల్లో రుబాయి ఇంత బాగా ఒదగలేదని కొంతమంది విమర్శకులంటారు. 1. రుబాయి మాత్రా ఛందస్సుతో కూడినది. 2. నాలుగు పాదాలలో ముగిసే ముక్తకం. 3. ప్రతి పాదంలో సమానమైన మాత్రలుండాలి. 4. మూడవ పాదానికి తప్పించి మిగిలిన 1, 2, 4 పాదాలకు అంత్యప్రాస ఉంటుంది. దీన్నే 'రరీఫ్' అంటారు. 5. రదీఫ్ కన్నా ముందున్న పదాల్లోని అచ్చును లేదా హల్లును 'కాఫియా' అంటారు. 6. రుబాయిలో కొంత మంది కవులు 'తఖల్లుస్' (నామముద్ర)ను అంటే కలం పేరును ప్రయోగిస్తారు. ఇది తప్పనిసరి కాదు. 7. మాత్ర ఛందస్సులోని ఏ గతిలోనైనా

దుబాయి రాయవచ్చు. 8. ప్రతి పాదం దేనికది పూర్తి అర్థంతో స్వతంత్రంగా ఉండాలి. ఒక పాదంలోని అర్ధం మరో పాదంలోకి వ్యాపించకూడదు. తెలుగులో 'గజళ్ళను, రుబాయిలను రాసిన తొలి కవి దాశరథి కృష్ణమాచార్య. 1975లో


'రాసిన 'ఆలోచనా లోచనాలు' కవితా సంపుటిలో 'నేనంటాను' శీర్షికతో దాశరథి కొన్ని రుబాయిలు:


నవ భాష్పధారలో నవ్వుకాగలవు


ముళ్ళ తీగలలోన పువ్వు కాగలవు | యత్నించి చూడమని అంటాను నేను.


రాళ్ళ రాసులలోన రవ్వ కాగలవు -దాశరథి ప్రయత్నిస్తే సాధించలేనిది లేదు. చీకటి ఎన్నాళ్ళో ఉండదు. వేదన నుంచి, విపత్కర పరిస్థితుల నుంచి బయటపడి మేలిమి రత్నంగా మారగలవనే భరోసానిస్తాడు కవి.


ఒక ఉప్పెన ఉరికిందంటే తప్పదు ఉత్పాతం.


ఒక ఊపిరి తగిలిందంటే తప్పదు ఉద్ఘాతం. తన కుత్తుక అదకత్తెరలో తడబడుతూ వున్నా..


ఒక ఉద్యమ మురిమిందంటే తప్పదు పోరాటం -సి. నారాయణరెడ్డి


పురుడుపోసుకున్న ఉప్పెన నుండే ఉపద్రవం మొదలవుతుంది. రగిలిపోయిన ఊపిరి నుండే తీవ్ర నష్టం జరుగుతుంది. నినదిస్తున్న గొంతును కుత్తుకలోనే నొక్కేస్తే అది ఉద్యమంగా మారి పోరాటానికి దారి తీస్తుందని హెచ్చరిస్తాడు కవి.

ఛందస్సు

రుబాయిలో నాలుగు పాదాలుంటాయి. 1, 2, 4 పాదాలకు రదీఫ్, కాఫియాలుండాలి. -మూడవ పాదానికి ఈ నియమం లేదు. మూడవ పాదంలో కూడా రదీఫ్, కాఫియాలను పాటించిన రుబాయిలను 'రుబాయి తరానా'లనేవారు. రుబాయిలో రెండవ పాదాన్ని చదివిన తరువాతనే అందులో 'రదీఫ్' ఏదో, 'కాఫియా' ఏదో గుర్తుపట్టగలం. గజల్లోలాగానే రుబాయిలో కూడా 'రదీఫ్', 'కాఫియా'లను కచ్చితంగా పాటించాలి. ఎక్కడో ఒక చోట 'కాఫియా' లేకుండా కేవలం 'రదీఫ్'లతోనే లేదా రదీఫ్ లేకుండా కేవలం కాఫీయాలతోనే రుబాయిలు రాశారు. కాని ఇలాంటి సందర్భాలు చాలా అరుదు.


గజల్లోనైనా, దుబాయిలోనైనా 'రెడీ', 'కాఫియా'లు రెండూ పాటించినప్పుడు మాత్రమే 'కాఫియా' ప్రయోగ వైవిధ్యం వలన ఎక్కువగా చమత్కారం సాధించుటకు వీలవుతుంది. ఉర్దూలో అక్షర ఛందస్సులు లేవు. కేవలం మాత్రా ఛందస్సులు మాత్రమే ఉన్నాయి. గజల్ కు, రుబాయిలకు వేర్వేరు ఛందస్సులున్నాయి. రుబాయిలోని నాలుగు పాదాలు ఒకే భావాన్ని వ్యక్తం చేయాలి. చెప్పాలనుకున్న భావానికి మొదటి పాదం పునాది అయితే రెండవ పాదం ఉత్సుకతను కలిగించాలి. మూడవ పాదంలో భావపరిణామం ఉండాలి. నాల్గవ పాదంలోని రదీఫ్, కాఫియాల కవితలోని చమత్కారం ఒక్కసారిగా పాఠకుని మనసుకు అంది, ఆనందంలో ముంచి వేయాలి. రుబాయిలోని నాలుగు పాదాలు దేనికది స్వతంత్రంగా ఉండాలి. రుబాయికి ప్రాణప్రదమైంది మూడవ పాదం. కనుకనే రదీఫ్, కాఫియాల నుండి దీనికి మినహాయింపు ఇచ్చారు. ఈ మూడవ వాక్యమే మిగిలిన 1, 2, 4 పాదాలను కలిపే ఒక అంతస్సూత్ర వాక్యం.


"దుబాయి రచన ఎంత సులభమో మంచి రుబాయి నిర్మాణం అంత కష్టం. రుబాయిలో ప్రధానంగా ఒకే ఒక్క భావం ఉంటుంది. ఈ భావప్రసూనం నాలుగు రేకులుగా విచ్చుకుంటుంది. మొదటి పాదంలో భావం మొగ్గతొడుగుతుంది. రెండవ పాదంలో కొంచెం విచ్చుకుంటుంది. మూడవ పాదంలో వినూత్న ప్రాసతో ఉబికి వస్తుంది. హృదయాన్ని సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తుతుంది. సంగీతంలో ఆరోహణ స్వరంలా తరగెత్తుతుంది. నాలుగవ పాదం రుబాయిలోని అతి ప్రధాన భాగం. ఇందులో మూడు పాదాల సారం ఇమిడి ఉంటుంది. మొదటి పాదంలో అంకురించిన భావం సమగ్రంగా గుబాళిస్తుంది. ఈ ముగింపులోనే కవి ప్రతిభ, చమత్కృతి, ప్రాచీన ప్రస్ఫుటమవుతాయి.


దుబాయిలో ప్రతిపాదం వాక్యనిర్మాణ దృష్టితో స్వతంత్రంగా ఉండడం వాంఛనీయం... కృత్రిమ పద ప్రయోగం, దురాన్వయం కూడదు, శ్లేషలను విశ్లేషించుకునే ఆగత్యం నుంచి సహృదయులను తప్పించడం అత్యావశ్యకం. ఒక బిందువులో సింధువును ఇమిడ్చినంత పని అవుతుంది. ఒక రుబాయిని రచించడం అంటే కవికున్న ప్రౌఢీమకు అంటే కుదింపునకు రుబాయి.. ఒక నికషోఫలం" అని అంటారు ఇరివెంటి కృష్ణమూర్తి, రాసే విధానం


మాత్రా ఛందస్సు ప్రయోగంలో నైపుణ్యం సాధించాలి. శబ్ద ప్రయోగం మీద సాధికారికత కలిగి ఉండాలి. చమత్కారంగా రాసే ప్రావీణ్యం ఉండాలి. పాదాల కూర్పులో నిర్మాణ చాతుర్యం, వ్యూహాలను ప్రదర్శించే నేర్పు కావాలి. కొత్త కొత్త ఊహలను సంధించాలి. భావనవ్యత, వర్తమానాంశాలను చెప్పి పాఠకులను ఒప్పించే కవితా నైపుణ్యం కావాలి. ఉదాహరణగా ఇచ్చిన 'నవ బాష్పధారలోన నవ్వు కాగలవు' అనే రుబాయిని మరోసారి చదవండి. ఈ రుబాయిలో పైన చెప్పిన లక్షణాలన్నీ ఉన్నాయి. ఇది మాత్రా ఛందస్సులో రాసిన రుబాయి. అన్ని పాదాల్లో సమానమైన మాత్రలున్నాయి. ఒక్కసారి లెక్కించి చూడండి.


రుబాయిని తెలుగు సాహితీ ప్రియులకు పరిచయం చేసిన దాశరథి, వికాసానికి తోడ్పడిన సి. నారాయణరెడ్డి, తిరుమల శ్రీనివాసాచార్య మొదలగువారు రుబాయిలో ఇన్ని మాత్రలే ఉండాలనే కచ్చితమైన నియమాన్ని పాటించలేదు. ఒకటి రెండు ఎక్కువ తక్కువ మాత్రలను ప్రయోగించి కొద్దిగా స్వేచ్ఛను పాటించారు. ప్రధానంగా దుబాయికి నాలుగు పాదాలుండాలి. 1, 2, 4 పాదాలలో అంత్య (Rhyme), అనుప్రాసల (Alliteration) నియమం .

మూడవ పాదంలో ఈ రెండూ లేకపోవడంతో పాటు అది దృష్టాంతంగా (Exemplification) ఉండడాన్ని పాటించారు. కొన్నిసార్లు మూడవ పాదాన్ని దృష్టాంతంగా రాయకుండా తక్కిన పాదాల వలెనే రాసిన సందర్భాలున్నాయి. దీన్నే 'తరానా' అంటారు. తెలుగు రుబాయికర్తలు మూల రుబాయి లక్షణాల్ని ఉన్నది ఉన్నట్టుగా కాకుండా కొంత సడలింపు తీసుకున్నారు.. తెలుగు రుబాయిలు ఎక్కువగా త్రిస, చతురస్ర, మిత్ర, ఖండ గతుల్లో సాగాయి. మాత్రలు ఒకటి, రెండు ఎక్కువ, తక్కువ ఉన్నా వాటిని రాగంతో సర్దుబాటు చేస్తారు.


భుని మీదికి దిగుతారు సురలంతా..


దీవికి ఆశపడుతారు నరులంతా


ఈ లోకం ఆ లోకానికి కొత్త


కొత్తదనం కోసమే గద! పరుగంతా -తిరుమల శ్రీనివాసాచార్య


1, 2, 4 పాదాలు వరుసగా 'సురలంతా', 'నరులంతా', 'పరుగంతా' అనే పదాలతో ముగిశాయి. దీన్నే 'రదీఫ్' అంటారు. ఇది చతురస్రగతిలో నడిచిన రుబాయి, అన్ని పాదాల్లో 17 మాత్రలున్నాయి. చెప్పేభావానికి తగిన అంత్యప్రాసలను ప్రయోగించాలి. సాధ్యమైనంత వరకు 'కాఫియా' లేకుండా రుబాయి రాయడానికి పూనుకోకూడదు.


ఎన్ని జోలలు మదికి పాడను, తనువు వొరిగే లోపుగా!

కలత పెట్టే కలలు ఎన్నో రేయి ముగిసే లోపుగా!

ఏ క్షణానికి ఆ క్షణం, యమయాతనే కద జీవనం!


కన్నీటినెంతగ మింగవలెనో, కనులు తడిసే లోపుగా! పెన్నా శివరామకృష్ణ ఇందులో 1, 2, 4 పాదాలు 'లోపుగా!' అనే పదంతో ముగిశాయి. ఇదే రదీఫ్. 'ఏ' అనే అచ్చును కాఫియాగా భావించాలి. ఇలా అంత్యానుప్రాసలను ప్రయోగిస్తూనే దాని ముందరి పదంలో అంటే కాఫియాలో సమానమైన అచ్చు లేదా హల్లు వచ్చేలా చూసుకోవాలి. పై ఉదాహరణను మరోసారి గమనించండి. కవి చమత్కారం బోధపడుతుంది. ఇది మిశ్రగతిలో సాగిన రుబాయి. నాల్గవ పాదం మొదట్లో రెండు మాత్రలు పెరిగాయి. మిశ్రగతిలో లేదా ఇతర గతుల్లో పాదాది లోగాని, పాదం మధ్యలోగాని భావపూర్తి కోసం ఒకటి, రెండు మాత్రలను అధికంగా వాడడమనే సంప్రదాయం మాత్రాఛందస్సులో ఉన్నది. ఇంతకు ముందరి గేయకవులు అలా వాడినట్లు అక్కడక్కడ కనిపిస్తున్నది. రుబాయి గానయోగ్యమైన ప్రక్రియ కాబట్టి ఇలాంటి మాత్రల హెచ్చుతగ్గులను రాగంతో పూరిస్తారు. "మాత్రా ఛందస్సులో పాదాంతంలోగాని, పద్యాంతంలో గాని ఉన్న లఘువును గురువుగా ఉచ్చరించే సంప్రదాయం ఉంది" అని చేకూరి రామారావు అన్నాడు.

ఆశించి వేసేటి అడుగులన్నీ భ్రమలు పెంచి పోషించేటి బలములన్నీ భ్రమలు సహజమౌ నడకలో ఎదురైనదే మనది.


పథకమేసీ నడుచు పథములన్నీ భ్రమలు - ఏనుగు నరసింహారెడ్డి 1, 2, 4 పాదాలలో 'భ్రమలు' రదీఫ్, 'అడుగు', 'బలము', 'పథము' లోని 'ఉ' అనే అచ్చు కాఫియా. ఇది ఖండగతిలో సాగిన రుబాయి. రుబాయి రాసే ముందు ఈ ప్రక్రియలో ఇంతకు ముందు కృషి చేసిన కవుల రుబాయిల అధ్యయనం తప్పనిసరి. వారి రుబాయిలు నడకను, భావనా బలాన్ని, పద ప్రయోగ వైచిత్రిని 'రదీఫ్', 'కాఫీయా'ల నిర్వహణను విశ్లేషించుకోవాలి.


రుబాయిలు తత్త్వాలను, నీతులను, జ్ఞానాన్ని చెప్పడానికి చాలా అనువైన ప్రక్రియ. తెలుగు కవులు ఒక్క అడుగు ముందుకు వేసి సామాజిక, రాజకీయ, సాంస్కృతిక విషయాలను చెప్పి రుబాయిని మరింత వెలిగించారు. నిత్యం రకరకాల సమస్యలతో రగిలిపోయే సమాజానికి రుబాయి ఎల్లవేళలా అవసరమే. గజల్ ఆనందాన్ని కలిగిస్తే, రుబాయి ఉపదేశాన్ని బోధిస్తుంది. కావ్య ప్రయోజనం ఉపదేశమే అయితే దానికి రుబాయి సరిగ్గా సరిపోతుంది.


 II. గజల్

సాహితీ ప్రక్రియల్లో గానయోగ్యమైన ప్రక్రియలెన్నున్నా వాటిలో గజల్ద ప్రముఖమైన స్థానం. శతాబ్దాలుగా ఉర్దూ, పారసీ కవులు గుండెకింది తడిని జీరగొంతుతో వినిపిస్త రసహృదయులను పరవశింపజేస్తున్న 'గజల్' ప్రపంచ కవితా వినీలాకాశంలో ఒక వెన్నెల పుష్పం. గజల్ అనగానే ప్రేమ, ఎడబాటు, వేదనలు గుర్తుకు వస్తాయి.


హిందీ, మరాఠీ, గుజరాతీ, పంజాబీ, బెంగాలీ, తమిళం, మలయాళం, కన్నడం, తెలుగు తదితర భాషా ప్రేమికుల్ని కూడా తన కవిత్వ ఇంద్రజాలంతో రసలోకంలో ఓలలాడిస్తోన్న గజల్ అరబ్బీ, పారసీ భాషల్లోని సంప్రదాయాల సమ్మిళితమై 11వ శతాబ్దం నాటికి ఇప్పుడున్న రూపాన్ని సంతరించుకుంది. పారశీ, ఉర్దూ సాహిత్యాల్లో గానయోగ్యమైన ప్రక్రియగా విలసిల్లి నేడు ప్రపంచవ్యాప్తమైంది. 20వ శతాబ్దంలో తెలుగు భాషలోకి ప్రవేశించి ఎంతో మంది శ్రోతల, పాఠకుల మదిని దోచుకుంది. అరబ్బీ భాషలోని 'ఖసీదా' (ప్రశంసాత్మక రచన) తెలుగులోని 'ఉదాహరణ' ప్రక్రియను పోలి ఉంటుంది. ఇది అయిదు భాగాలుగా ఉంటుంది. ఇందులోని మొదటి భాగమైన 'తష్బీబ్' లో ప్రియురాలిని వర్ణిస్తే దాన్ని 'గజల్' అని పిలిచేవారు. నిర్వచ


'గజల్' అనే పదానికి అరబ్బీ భాషలో 'రాగాలాపన' అనే అర్ధం ఉన్నా ప్రియురాలితో సల్లాపం' అనే భావాన్నే వ్యక్తపరుస్తుంది. విజ్ఞాన సర్వస్వం 14వ సంపుటం 'ఛందో వ్యాకరణ బద్ధమై లయానుగుణమైన నడకతో, స్వేచ్ఛా ప్రవృత్తిని, నిర్భర భావావేశమును ప్రకటించే రచనా ప్రక్రియ' గజల్ అని పేర్కొంది. అంత పెద్ద వృక్షాన్ని కడుపులో దాచుకున్న మర్రి విత్తనంలాగా గజల్ ఆకాశమంత భావాన్ని తన 'ఇముడ్చుకుంది.


బతికినన్నినాళ్లు ప్రేమ క్షీర సాగరంలోనే మునిగి తేలి, ప్రేమపూరిత కవిత్వాన్నే రాసిన 'గ్యుల్' అనే కవి పేరుతోనే 'గజల్' అనే పేరు వచ్చిందని దాశరధి కృష్ణమాచార్య పేర్కొన్నారు. 'శృంగార రసాత్మక సిసలైన భావ కవిత గజల్' అని దాశరథి నిర్వచించినా తెలుగు కవులు మాత్రం దానికి శృంగార రసానికి బదులు సామాజిక దృక్పథాన్ని అద్ది తెలుగు కవిత్వం ఎప్పుడూ ప్రజల వైపే నిలుచుంటుందని చెప్పకనే చెప్పారు. ఛందస్సు


రెండు రెండు పాదాలు కలిపి ఒక సెట్ గా కూర్పబడిన ముక్తకాలను గజల్ అంటారు. ఈ రెండు పాదాలను కలిపి 'షేర్' అంటారు. ఒక గజల్లో ఐదు, ఏడు, తొమ్మిది.. ఇలా ఎన్ని షేరైనా ఉండవచ్చు. మొదటి షేర్ను 'మల్లా' (ఉదయించేది) అని పిలుస్తారు. ఇది పాటల్లో, 'పల్లవి'లాంటిది. పాదంలోని చివరి పదాన్ని లేదా పద సముదాయాన్ని 'రదీఫ్' అంటారు. రదీఫ్కు ముందున్నది హలంత పదమైతే ఆ పదంలోని చివరి హల్లును, అజంత పదమైతే ఆ పదంలోని చివరి అచ్చును 'కాఫియా' అంటారు. ఛందస్సు క్రమంగా అమరినప్పటికీ రదీఫ్ కాఫియాల వలన కలిగే నాద సౌందర్యం విని అనుభవించవలసిందే.


,


గజల్లోని చివరి షేర న్ను 'మక్తా' అంటారు. గజల్ రచయిత తన పేరును కాని లేదా తన పేరులోని కృష్టమైన పదాన్ని కాని 'మక్తా'లో ఇమిడ్చి చెప్తాడు. ఇలా చెప్పడాన్ని 'తఖల్లుస్' అంటారు. 'తఖల్లుస్' అనే అరబ్బీ పదానికి 'మారుపేరు లేదా కలం పేరు' అనే అర్థం ఉంది. 'తఖల్లుస్ 'ను చివరి పాదంలోనే చెప్పాలనే నిబంధనేమీ లేదు. ఎక్కువ మంది చివరి పాదంలో చెప్పడానికి ప్రయత్నించారు. అలాగే 'తఖల్లుస్' ను కచ్చితంగా పాటించాలనే నియమం కూడా ఏమీ లేదు. 'తఖల్లుస్' లేకుండానే రాసినవారున్నారు. లక్షణాలు


1. వినూత్న వ్యక్తీకరణ, చమత్కారం. 2. సర్వనామాలే వాడుతూ నామవాచకాలు లేకుండా రాయడం, 3. ప్రతీకాత్మకంగా, నర్మగర్భంగా రాయడం. 4. సంకేత భాషలో చెప్పడం. 5. స్థల కాలాలను స్పష్టంగా పేర్కొనకుండా సాధారణీకరించి తాత్త్వికస్థాయిలో రాయడం. రాసే విధానం


గజలు విషాదమే వస్తువు. గుండె మూలలో తొలుస్తున్న దుఃఖాన్ని ఒక నిర్వేదంతో రాయడమే గజల్ యొక్క అంతస్సారం, గాయాన్ని, దుఃఖాన్ని సున్నితంగా తట్టిలేపి మనసు లోలోపలి పొరల్లోని వేదనను కవిత్వంగా మలచడమే గజల్. సామల సదాశివ పేర్కొన్నట్లు "గజల్ మార్మిక కవిత, భావం వాచ్యం కాకూడదు. ధ్వని ప్రధానమై ఉండాలె." గజల్ రసవంతమైన, మనోహరమైన ప్రక్రియ. అతి సున్నితమైన గజల్ దీర్ఘసమాసాలను తట్టుకోలేదు. మానవుని మధుర వేదనకు ప్రతీక గజల్.


వలపునై నీ హృదయ సీమల నిలువలెనని ఉన్నది. పిలుపునై నీ అధర వీధులు పలుకవలెనని ఉన్నది - దాశరథి కృష్ణమాచార్య


ఇందులో 'ఉన్నది' అనేది 'రదీఫ్' అయితే, 'నిలువవలె', 'పలుకవలె' పదాలలోని 'ఎ' అనే అచ్చు 'కాఫియా'. నిజానికి గజల్ కవి తన ప్రియురాలి గురించే చెప్తాడు. కాని అవే మాటలు ఒక ప్రేయసి తన ప్రియుడి గురించి చెబుతున్నట్టుగా కూడా తోస్తాయి. సాధారణ మనిషి తనకూ లోకానికి గల మిత్రుత్వాన్నో శత్రుత్వాన్నో చెప్తున్నట్టుగా ఉంటాయి. "అనుభూతి- ఆలోచన, హృదయం-బుద్ధి, భౌతిక-ఆంతరిక జగత్తులు, చేతన - అచేతన మానసిక స్థితులు, ఆశ నిరాశలు మొదలైన ద్వంద్వాలనే రెండు రెక్కలుగా చేసుకొని విహరించే పక్షి గజల్" అనిఅంటాడు. పెన్నా శివరామకృష్ణ


రమ్మంటే చాలుగానీ రాజ్యాలు విడిచిరానా నీ చిన్ని నవ్వుకోసం స్వర్గాలు గడచిరానా -దాశరథి కృష్ణమాచార్య

దాశరథికి బాగా కీర్తి ప్రతిష్ఠల్ని తీసుకొచ్చిన గజల్ ఇది. ఇందులో 'రానా' అనే పదం 'రదీప విడిచి, గడచిలోని 'ఇ' అనే అచ్చు 'కాఫియా', ఈ గజల్న దాశరథి 'తఖల్లుస్' లేకుండా రాశాడు.


సామాజికపరమైన, మానవీయకోణంలో రాసిన గజళ్ళు ఎక్కువకాలం ప్రజల నోళ్లల


ఉండిపోతాయి.


పరుల కోసం పాటు పడని వరుని బ్రతుకు దేనికని మూగ నేలకు నీరందివ్వని వాగు పరుగు దేనికని


శిశు హృదయానికి కల్లలు లేవు తన రాజ్యానికి ఎల్లలు లేవు లోపలి నలుపు సినారెకు తెలుసు పైపై తొడుగు దేనికని - సి. నారాయణరెడ్డి ఇందులో 'దేనికని' అనే పదం 'రదీఫ్', బ్రతుకు, పరుగు పదాల్లోని 'ఉ' అనే అచ్చు కాఫియా. ''సేనారి' అనేది 'తఖల్లుస్' చమత్కారమే గజలక్కు ప్రాణప్రదమైంది. ఒక అద్భుతాన్ని చూసినపుడు సంతోషంతో ఎంత ఉప్పొంగిపోతామో చమత్కారంతో కూడిన ఒక్కొక్క షేర్ను వింటున్నపుడు అంత ఆనందించాలి. మొదటి పాదం వినగానే శ్రోతకు ఉత్కంఠ కలగాలి. ఎందుకు? ఏమిటి? ఎలా? అనే సందేహాలు కలగాలి. రెండవ పాదం ఈ సందేహాలకు వివరణగానో, సవరణగానో, పూరణగానో ఉండాలి. ఇలా ఉంటేనే చమత్కారాన్ని సాధిస్తాం. చమత్కారం ఇలానే ఉండాలనే కొలమానాలు ఏమీ లేవు. కాని అది శ్రోతకు, పాఠకునికి చేరితే చాలు.. ప్రతీకాత్మకంగా చెప్పడం మరో ఆయువుపట్టు. దీని వల్లనే షేర్కు అనేకార్ధబోధకత, అవ్వడ సామర్ధ్యం, కొన్ని వందల ఏళ్ల క్రితం రాయబడిన షేర్ అయినా కాలదోషం పట్టకుండా ఇప్పటికీ ఎవరికి వారు అన్వయించుకునేలా ఉంటుంది. తుఫాను, పక్షి, పంజరం, సముద్రం, అలలు, వసంతం, శిశిరం, మొగ్గలు, పూలు, తోట మొదలైన వాటిని గజల్ కవులు తరచుగా ఉపమానాలుగా, ప్రతీకలుగా వాడుతుంటారు.


పత్తా పత్తా బూటా బూటా హాల్ హమారా జానే హై


జానే న జానే గుల్ న జానే బాగ్తో సారా జానే హై -మీర్ తకీ మీర్ 'ప్రతి ఆకుకు, ప్రతి తీగకు నా పరిస్థితి తెలుసు. పుష్పానికైతే తెలుసో లేదో కాని తోటకంతా నా పరిస్థితి తెలుసు.' ప్రేమలోనో, మరో విషయంలోనో చాలా మంది విఫలమై వేదన చెందుతుంటారు. మనలో కలిగిన ఆనందాన్ని కొంత ప్రయత్నం మీద దాచుకోవచ్చేమో కాని విషాదాన్ని దాచలేం. అది మన ముఖంలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కారణం తెలియకపోయినా మన చుట్టూ ఉన్నవారికి మన ముఖం మీద విషాదం తెలిసిపోతుంది. ఇక్కడ ఆకులను, తీగలను, తోటను లోకానికి ప్రతీకగా పువ్వును ప్రియురాలికి లేదా భగవంతుడికి ప్రతీకగా భావిస్తే కవి హృదయం అర్థమవుతుంది. ఇలా నర్మగర్భంగా చెప్పడానికి సాధన చేయాలి. పూర్వ కవులు ఏ భావాన్ని ఎంత ధ్వన్యాత్మకంగా చెప్పారో పరిశీలిస్తే ఈ మెళకువ మనకు అంత బాగా బోధపడుతుంది.


ఉర్దూలో ఏ ప్రక్రియకైనా మాత్రా ఛందస్సునే వాడుతారు. ఉర్దూలో ప్రాథమికంగా ఐదు మాత్రల గణాలు రెండు, ఏడు మాత్రల గణాలు అయిదుంటాయి. ఉర్దూలో ఉచ్చారణ ననుసరించి మాత్రా గణన ఉంటుంది. అయితే తెలుగులో ఈ బహర్ల లకు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు. మన స్వంత మీటర్ను సృష్టించుకోవచ్చు. కాకపోతే పదాల నడక మీద కొంత దృష్టి పెట్టాలి. ఈ నడక ఉపయోగించే పదాల బరువు (వజన్) మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఒకే విధమైన మాత్రలను వాడడం. గజల్లో అన్ని పాదాలు ఒకే తూగులో సమానంగా. ఉండాలి.


దృష్టిని బట్టే కనిపిస్తుంది స్పష్టని విన్నాను నువ్వది వాదం అన్నావు నేనది వేదం అన్నాను"


సంత నడుమ ఒక జోలె పట్టి పసిగొంతు మోగుతుంటే


నువ్వది గేయం అన్నావు నేనది గాయం అన్నాను.


నమ్మిన సత్యం కోసం ఒక్కడు ప్రాణాలర్పిస్తే


నువ్వది మరణం అన్నావు నేనది జననం అన్నాను - రెంటాల శ్రీవెంకటేశ్వరరావు ఇది 'తఖల్లుస్' లేకుండానే రాసిన గజల్. పై 'మల్లా'లో, పేర్లలో రెండు పాదాలు కూడా ఒక తూగులో నడుస్తున్నట్టు గమనిస్తాం. కాబట్టి గజల్ రాసేటప్పుడు పదాల బరువును దృష్టిలో పెట్టుకోవాలి. సమాన తూగులో గజల్ సాగిపోతుందా, లయాత్మకంగా పోతుందా లేదా అనేది చూసుకోవాలి. అలాగైతేనే గజల్ సౌందర్యం పెరుగుతుంది. గజల్ ప్రక్రియను కేవలం ఛందోబద్ధంగా రాస్తే సరిపోదు. భావం, లయ కూడా సరిగ్గా కుదిరి చక్కని జావళీలాగా కనిపించాలి.


ప్రతి షేర్ దేనికదే ప్రత్యేకంగా కనబడాలి. గజల్ నుంచి ఏ రెండు పాదాలను విడదీసి విడిగా చదువుకున్నా ఒక శతక పద్యంలాగా, ముక్తకంలాగా భావం సంపూర్ణంగా ఉండాలి. గజల్లో అన్ని షేర్లు ఒకే విషయంపై ఉండాల్సిన అవసరం లేదు. ప్రేమ, సౌందర్యం, విరహం, శృంగారం, వేదాంతం, రాజకీయం, ప్రకృతిని వస్తువులుగా తీసుకొని ఎన్ని రకాలుగానైనా రాయొచ్చు. అయితే అంతర్లీనంగా అన్ని షేర్లను కలిపే ఒక ప్రత్యేక వ్యక్తీకరణ, చమత్కారం, అంతఃస్సూత్రం, కవితాత్మక లయ ఉండాలి. అన్ని పేర్లు ఒకే విషయం గురించి కూడా రాయొచ్చు.

కొన్ని సూచనలు


గజల్ రాసేవారు 1. బహర్, పదాల బరువు (వజన్) లోపించకుండా చూసుకోవాలి. 2. పదాలను, పలుకుబళ్ళ అర్ధాలను, వాడకాన్ని లోతుగా తెలుసుకొని వాడాలి. 3, బలహీనమైన భావవ్యక్తీకరణ లేకుండా రాయాలి.


కొత్తగా రాసేవారు సరళమైన మీటర్ను ఎన్నుకోవాలి. రదీఫ్, కాఫియాలను తేలికైన పదాలతో వాడడం నేర్చుకోవాలి. కొన్ని కాఫియా పదాలను కాగితం మీద రాసుకోవాలి. తరువాత వాటిని సరైనచోట వాడుకోవచ్చు. సమాన తూగు ఉన్న పదాలను సేకరించుకొని పెట్టుకోవాలి. మీటర్ను అనుసరించి కాఫీయాలను వినియోగిస్తూ వీలయినన్ని ఎక్కువ షేర్లను రాయాలి. భావానికి అనుగుణమైన పదాలు ఎన్నుకున్న మీటర్లో పడుతున్నాయో లేదో చూసుకోవాలి. రాస్తున్న ప్రతి షేర్లో కవిత్వం, చమత్కారం సమానంగా ఉన్నాయా లేదా చూసుకోవాలి. మల్లాకు చమత్కారం, వినూత్న వ్యక్తీకరణే ప్రాణప్రదమైనది. ఒకసారి వినియోగించిన కాఫియాను మరోసారి వాడవద్దు. ఆత్మాశ్రయంగా కూడా రాయవచ్చు. ప్రతి షేర్ గాఢమైన కవిత్వానుభవాన్ని ఇవ్వాలి. గజలు శీర్షిక లేదు కాబట్టి ఎంత వైవిధ్యంగానైనా రాయవచ్చు. పాఠంలో ఇచ్చిన ఉదాహరణలతో పాటు ఇంకా ప్రసిద్ధ కవులు రాసిన గజళ్ళను శ్రద్ధగా వినండి. ఎంత ఎక్కువసార్లు విని వారి భాష, భావన, చమత్కారం, రదీఫ్, కాఫియాలను విశ్లేషించుకుంటే అంత మంచి గజల్ మనం కూడా రాయగలం.


నదీ సద్భతమైన తెలుగు సాహిత్య ప్రవాహంలో గజల్ ఒక విలక్షణ ప్రక్రియగా ప్రవేశించి తొలి రోజుల్లో ఉర్దూ ప్రభావంతో అడుగులు వేసి తరువాత తన సొంత అస్తిత్వాన్ని చాటుతూ ప్రవహిస్తుంది. చైతన్య తరంగమై శ్రోతలను మైమరపిస్తుంది.


ప్రియురాలితో సల్లాపంతో మొదలైన గజల్, రుబాయిలు రాను రాను సమకాలీన సమాజంలోని అవ్యవస్థలను, వ్యక్తిత్వ వికాసాన్ని, సామాజిక బాధ్యతలను అందంగా, అధిక్షేపంతో, కార్యోన్ముఖంగా చెప్పడంలో సఫలీకృతం అయ్యాయి. గాసయోగ్యమై పాఠకులను రంజింపజేసే గజల్, రుబాయిలను రాసే రచయిత ఎంతో జాగ్రత్తగా, మన ముందుతరం, సమకాలీన కవులు రాస్తున్న సాహిత్యాన్ని గమనిస్తూ, భావనాలలంతో కలం కదిలించినపుడే మేలిమి సాహిత్యం. పురుడుపోసుకుంటుంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

పంద్రాగస్టు పండుగన ? విషాదమా ?

విశ్వశాస్త్రం అంటే ఏమిటి ?