నారద గానమాత్సర్యం - పింగళి సూరన degree 4 th sem Telugu

1. నారద గానమాత్సర్యం- పింగళి సూరన(కలాపూర్ణోదయం - ద్వియశ్వస్వ నుండి) .


కవి పరిచయం

పాఠం : 'నారద గానమాత్సర్యం'

 దేని నుండి గ్రహింపబడింది. కళాపూర్ణోదయము' - ద్వియశ్వాస నుండి :

కవి: 'పింగళి సూరన

కాలము: 16వ శతాబ్దం. సూరన నంద్యాల పాలించిన ,

కృష్ణoరాజ ఆస్థానకవి.  క్రీ.శ.1532-1583 మధ్య జీవించారు.

అంకితం

: సూరన కళాపూర్ణోదయ కావ్యాన్ని 

కృష్ణoరాజుకు అంకితం  ఇచ్చాడని తెలుస్తోంది.

కవి రచనలు

: సూరన 1) గరుడ పురాణం, 2) రాఘవ పాండవ్యం,

3) ప్రభావతి ప్రద్యుమ్నం, 4) కళాపూర్ణోదయం అనే ఆయన నాలుగు పుస్తకాలు రాశారు.

కళాపూర్ణోదయం ప్రత్యేకత : కళాపూర్ణోదయం, ఒక కల్పిత కథ. ఈ కథ,  ఏ పురాణం లేదు .మరియు ప్రత్యేకమైన కల్పిత కథలను అమలు చేయడం వాటిని పోషించడంలో , నూతన సత్వాన్ని సూరన సాధించాడు.


పాఠ్యభాగ  సందర్భం 


నారద మహర్షి కృష్ణుడు  వద్దను , ఆయన రాణుల నుండి సత్యభామ, జాంబవతి మరియు రుక్మిణుల వద్దనూ,సంగీత విద్య నేర్చి పరిపూర్ణుడయ్యాడు . నారదుడు శిశ్యుడైన   మణికంధరుడు,   ద్వారకకు కృష్ణుడు వచ్చినప్పుడు నారదుని వీణను మోస్తూ, నారదుని  వెంట వెళ్లిన కలభాషిణి అనే ద్వారకా నగరంలోని వేశ్యయూ కూడా, కృష్ణుని దయతో సంగీత రహస్యాలు అన్ని గ్రహించారు. నారదుడు అప్పుడు తన శిష్యుడైన మణికంధరునితో నీవు సంగీతంతో విష్ణుమూర్తిని సేవించు. నేను కూడా నా కష్టాలు అన్నీ తీరేటట్లు, త్రిమూర్తుల సభలలో ఎక్కడో అక్కడ, నా సంగీత విద్యతో తుంబురుణ్ణి గెలుస్తానూ అని చెప్పాడు. అది విన్న మణికంధరుడు, "మీకు తుంబురుడితో స్పర్ధ ఎందుకు వచ్చింది ? తుంబురుడిని జయించడానికి మీరు ఏమేమి పాట్లు పడ్డారు ?" అని తన గురువైన నారదుడిని ప్రశ్నించాడు. అప్పుడు నారదుడు తుంబురుడిపై, తనకు అసూయ కల్గడానికి కారణాన్ని శిష్యునకు వివరించడానికి ప్రారంభించడంతో, ఈ పాఠ్యభాగం ప్రారంభం అవుతుంది.


పాఠ్యభాగ సారాంశం


విష్ణుమూర్తి సభ : ఒక రోజున విష్ణుమూర్తి నిండుకొలువు దీర్చి కూర్చున్నాడు. బ్రహ్మాది దేవతలూ, మునీంద్రులూ, ఆయనను సేవిస్తున్నారు. అప్పుడు నేనూ, తుంబురుడూ మొదలయిన వారు, అక్కడకు వెళ్ళాము. విష్ణుమూర్తి అప్సరసల నాట్యాలు చూస్తున్నాడు.


లక్ష్మీదేవి చెలికత్తెలతో ఉద్యానవనము నుండి, మహావైభవంతో విష్ణుమూర్తి సభా భవనానికి బయలుదేరింది. వేత్రహస్తులు వచ్చి, సభలోని వారిని అందరినీ బెత్తాలతో బాదారు. బ్రహ్మాదులతో పాటు, మేము అందరమూ దూరంగా పోయాము. అప్పుడు వేగ్రహస్తులు తుంబురుడిని పిలిచి, తిరిగి అతడిని సభలోకి తీసుకువెళ్ళారు. తుంబురుడిని తిరిగి ఎందుకు సభలోకి పిలిపించారో అని, అందరి మనస్సులలో సందేహం కలిగింది. నేను కూడా అక్కడే ఉన్నాను. విష్ణుసభలో తిరిగేవారు "విష్ణుమూర్తి, లక్ష్మీదేవితో కలిసి తుంబురుడి గానమును వింటున్నాడు” అని చెప్పారు.


'నారదుని హృదయంలో పరితాపము :మమ్మల్ని అందరినీ తరిమివేసి, తుంబురుడిని ఒక్కడినీ పిలిపించి, విష్ణుమూర్తి అతడి గానాన్ని వింటున్నాడని తెలిసి, నా గుండె మండింది. కొంతసేపు నేను అక్కడే ఉన్నాను. కొంతసేపటికి దేవతలూ, మునులూ ఆశ్యర్యపడేటట్లు, బంగారు పతకము, విలువైన వస్త్రము, ధరించి, మైపూత సొగసుతో, తుంబురుడు సభలో నుండి వచ్చాడు. అది చూసి నేను మరింతగా ఉడికిపోయాను.


తుంబురుడి బండారము వెల్లడి అయ్యే వరకూ, "అతడు ఏ తీరుగా అయినా వెళ్ళవచ్చు. నేను అతనితో వాడం పెట్టుకొని ఓడిస్తాను. నా సంగీత చాతుర్యము విష్ణుమూర్తి వినేటట్లు ఉపాయము చేస్తాను” అని నేను అనుకున్నాను. నా ఈర్ష్యను మనస్సులోనే దాచుకొని, స్నేహాన్ని నటిస్తూ, తుంబురుడి ఇంటికి రాకపోకలు సాగిస్తూ తుంబురుడి గానములోని గుణదోషాలు గ్రహిస్తేనే కాని, జయము లభించదని నేను నిశ్చయించాను.


నారదుడు తుంబురుడిని ఓడించే ప్రయత్నము : ఒక రోజున నేను తుంబురుడి ఇంటికి వెళ్ళాను. అప్పుడు అతడు పాట పాడడానికి సిద్ధంగా, తన వీణెను మేళగించి, అక్కడ పెట్టి లోపలికి వెళ్ళాడు. తుంబురుడు ఎక్కడికి వెళ్ళాడని నేను అడిగాను. వీణ అక్కడ పెట్టి, లోపలకు వెళ్ళాడని అక్కడివారు నాతో చెప్పారు. నేను తుంబురుడి వీణను పట్టుకొని మ్రోగించాను. అపూర్వమైన శ్రుతులు నాకు ఆశ్చర్యం కల్గించాయి. నేను వీణను అక్కడే పెట్టి, సిగ్గుతో తిరిగి వచ్చాను.


"ఈ తుంబురుడు గొప్ప గాన కళా ప్రవీణుడు. ఈ సంగతి నాకు ఇంతవరకూ తెలియలేదు” అని మనస్సులో నేను కలత చెందాను. బ్రహ్మాదుల సభలలో నేనూ, తుంబురుడూ కలసి, పాట పాడే వారము. తనకు ఇంత గాన కళాప్రావీణ్యం ఉందని, అప్పుడు నాకు అతడు తెలియనీయలేదు” అని నేను బాధపడ్డాను.


తుంబురుడిని గెలవడానికి నారదుడు పడ్డ పాట్లు : ఆనాటి నుండి ఎక్కడెక్కడ గాన విద్యా ప్రవీణులు ఉన్నారో, అక్కడికి వెళ్ళి వారివద్ద నేను సంగీత విద్య నేర్చుకున్నాను. కాని తుంబురునికి సాటి ఎవ్వరూ లేరని గ్రహించాను. సర్వజ్ఞుడైన విష్ణుమూర్తి అనుగ్రహం వల్లనే, నా కోరిక నెరవేరగలదని నేను గ్రహించి, విష్ణుమూర్తిని గూర్చి చాలాకాలము తపస్సు చేశాను..


విష్ణుమూర్తి ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. నేను విష్ణుమూర్తికి నమస్కరించి, తుంబురుడిని గెలవాలని కోరాను. విష్ణుమూర్తి నా యందు దయచేసి. తాను ద్వాపరయుగంలో వసుదేవుని కుమారుడిగా జన్మిస్తానని చెప్పి, అప్పుడు నా కోరిక తీరుస్తానన్నాడు.


నేను చాలాకాలము నిరీక్షించి, ఇప్పుడు ఈ విధంగా శ్రీకృష్ణుని దయతో సంగీత కళలో నేర్పరి నైనాను. నీవూ, కలభాషిణీ, ఏ శ్రమ లేకుండానే, సంగీత విద్యను నేర్చారు" అని, నారదుడు మణికంధరునితో చెప్పాడు.


'నీ వంటి గొప్ప తపోధనుడిని సేవించిన మాకు, ఈ సంగీత విద్యలో పాండిత్యం రావడం, ఆశ్చర్యం కాదు' అని మణికంధరుడు తన గురువైన నారుమడితో అన్నాడు.






కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మీరు అటామిక్ హ్యాబిట్ చదవకపోతే ఏమి జరుగుతుంది?మీరు అటామిక్ హ్యాబిట్ చదవకపోతే ఏమి జరుగుతుంది? ఎందుకు తప్పక చదవాలి

డెడ్ సీ అంటే ఏమిటి ?