విశ్వ విజేత అలెగ్జాండర్


క్రీస్తుపూర్వం 356-336

అలెగ్జాండర్ బాల్యం మరియు యవ్వనం విశ్వవిజేతగా గణుతికెక్కిన అలెగ్జాండర్ పిన్నవయసులోనే తనువు చాలించాడు. అతని జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలన్నీ ఇరవై ఏళ్ళ వయసు నుంచి ప్రారంభమై, అతని ముప్పయ్ రెండో సంవత్సరంలో ముగిసిపోయాయి. అలెగ్జాండర్ తన ముప్పయ్ రెండేళ్ళ జీవితంలో కేవలం పన్నెండేళ్ళ పాటు వీరోచితకార్యాలతో పరిపాలన చేశాడు.

ఒక మనిషి జీవిత కాలంలో పన్నెండేళ్ళు అంటే చాలా స్వల్ప కాలమే. ఆ స్వల్ప వ్యవధిలో అలెగ్జాండర్ ఎన్నో సాహసవంతమైన, ప్రేమ పూరిత అంకాలను నిర్వహించాడు. వాటికారణంగానే అతను ఎంతో గొప్పపేరు, కీర్తి ప్రతిష్ఠల్ని పొందాడు. అందుకే ప్రపంచం మొత్తం అతని విజయ గాధలను చదువుతోంది. అలెగ్జాండర్ విజయం వెనుకనున్న రహస్యం అతని వ్యక్తిత్వం. తనలోని మానసిక శక్తిని, శారీరక ఆకర్షణలను కలగలిపి ఎదుటివారి మీద ప్రయోగించేవాడు. అలెగ్జాండర్ పనితీరు వుండటమే కాదు మంచి క్రీడాకారుడు కూడా. ప్రతి విషయంలోనూ ఆసక్తి ఎక్కువగా చూపించేవాడు.



ప్రశాంతంగా అన్నీ తెలుసుకుంటూ అత్యవసర పరిస్థితుల్లో జాగ్రత్తగా, ముందు చూపుని ప్రదర్శించూ, తెలివిగా వ్యవహరించేవాడు. అతనికి బాగా నమ్మకస్తులు కొందరు వుండేవారు. తనతో సంబంధాలు కలవాళ్ళందరితో జాగ్రత్తగా ప్రవర్తించేవాడు.


తన మిత్రులతో మంచిగా, శత్రువులతో కఠినంగా ప్రవర్తించేవాడు. యుద్ధాలమీద, దేశాలను జయించడంపై తన శక్తిని వినియోగించినా అతని వ్యక్తిత్వం గొప్పగా మారింది. తనలోని ధీరత్వాన్ని ప్రదర్శించడానికి అలెగ్జాండర్‌కి ఎన్నో అవకాశాలు వచ్చాయి..


అలెగ్జాండర్ మాతృదేశం యూరప్, ఆసియాల సరిహద్దుల్లో వుంది. ఇప్పుడే కాదు అప్పట్లో కూడా ఆసియా, యూరప్లు రెండూ గొప్పనగరికతతో వుండేవి. అయితే అవి ఒకదానికొకటి పూర్తి భిన్నంగా వుండేవి. ఆసియావైపున పర్షియన్లు, మెడోస్, అస్సీరియన్స్ ఆక్రమిస్తే, యూరప్ వైపున గ్రీకులు, రోమన్లు ​​ఆక్రమించారు.

వారిని హెల్లెస్పాంట్ జలాలు, ఏజియన్ సముద్రం, మెడిటేరియన్ సముద్రం

విడదీసేవి. ఇవి సహజమైన సరిహద్దులుగా వుండటంవల్ల ఈ రెండు జాతులనూ విడగొట్టి వుంచాయి. ఈ రెండు ప్రాంతాల నాగరికతలలో ఏది గొప్పదో చెప్పడం కష్టం! ఎంత విభిన్నమైనవంటే వీటిని పోల్చి చూడటం కూడా కష్టం !

ఆసియా వైపు ధనము, విలాసవంతమైన సౌకర్యాలు వుంటే యూరప్ కేసి శక్తి, మేధస్సు, బలం వున్నాయి. ఒకవైపు విశాలమైన నగరాలు, అందమైన ప్రదేశాలూ, తోటలతో ప్రపంచం అద్భుతంగా వుంటే రెండోవైపు బలమైన కోటలు, సైనిక మార్గాలు, వంతెనలు, బాగా అభివృద్ధిచెంది, జనంతో కిక్కిరిసి వుండే నగరాలు వున్నాయి.

పర్షియన్లకి బలమైన, పెద్ద సంఖ్యలో సైన్యాలు వున్నాయి. వీరికి అందమైన గుడారాలు, అందంగా తయారు చేయబడ్డ గుర్రాలు, అత్యంత నాణ్యంగా తయారు చేసిన ఆయుధాలు, సామాగ్రి, అందమైన దుస్తులు ధరించే అధికారులు విలాసవంతమైన జీవితానికి అలవాటుపడివుంటారు.

ఇంకోవైపు రోమనులు, గ్రీకులు తమ సైన్యాలు పటిష్టంగా, కష్టపడటానికి ఇష్టపడటంతో పాటు క్రమశిక్షణ కలిగి వున్నాయి. వీరత్వం, నిలకడత్వం, తమ సైన్యంమీద విశ్వాసం, తమ స్వంత విజ్ఞానం, నైపుణ్యం కారణంగా వెలిగిపోయేవారు. ఈ రెండింటి సేనల మధ్య ఎంతో తేడా వుంది.* విశ్వ విజేత అలెగ్జాండర్


గ్రేసియన్ రాజ్యాలలో ఒకదానికి వారసుడిగా అలెగ్జాండర్ పుట్టాడు. గ్రీకులు,


రోమన్లకు వుండే గౌరవం, శక్తి, సాహసాలతోపాటు సైనిక సామర్థ్యాలను కలిగివుండే వాడు. తన సైన్యాలను సమాయత్తపరచి యూరప్, ఆసియాలమధ్య నున్న హద్దులను దాటాడు.


ఆసియన్స్కి చెందిన సైన్యాలను నాశనం చెయ్యడం, అందమైన నగరాలను ఆక్రమించడం తనదారికి ఆటంకంగా పరిగణించబడే రాజుల్ని, సైన్యాధికారుల్ని, యువరాజుల్ని బందీలుగా పట్టుకునేవాడు.


అలెగ్జాండర్ తండ్రి పేరు ఫిలిప్స్, గ్రీస్కి ఉత్తరభాగంలో వున్న మెసెడోన్ అతని రాజ్యం. అలెగ్జాంర్ తల్లిపేరు ఒలింపియన్. ఆమె తండ్రి ఎపిరస్ రాజ్యాధిపతి. అతని రాజ్యం మెసెడోస్ కంటే కొంచెం చిన్నది. మెసెడోన్కి పడమరవైపు వుంది. ఒలింపియస్ చాలాబలమైన, దృఢనిశ్చయం, వ్యక్తిత్వం గల స్త్రీ.


అలెగ్జాండర్ తన శక్తిని ఆమెనుంచి పొందాడు. ఆకర్షించే వ్యక్తిత్వం మాత్రం . ఆమెకి లేదు. కాని అలెగ్జాండర్కి వుంది. ఫిలిప్స్ దర్బారులో అలెగ్జాండర్కి యువరాజుగా చాలా ప్రాముఖ్యత వుండేది. అతని తండ్రి మరణం తర్వాత అలెగ్జాండర్ రాజు అవుతాడని అందరికీ తెలుసు కాబట్టి అతన్నంతా జాగ్రత్తగా గమనించేవారు.


అలెగ్జాండర్ బాల్యం గడిచే కొలదీ అంతా అతని తెలివి, వ్యక్తిత్వం యొక్క గొప్ప అసాధారణ లక్షణాలు గమనించారు. ముందు ముందు అతను సాధించబోయే గొప్పతనానికి సూచనగా తోచేవి.


అలెగ్జాండర్ యువరాజైనా అతని పెంపకం, విలాసవంతంగా, అప్రయోజనకరమైన అలవాట్లతో జరగలేదు. ఆరోజుల్లో తుపాకుల్లాంటివిలేవు. అందువల్ల యుద్ధంలో వీరులంతా. నిలబడిపోరాడటం లేదు. దూసుకుంటూ ముందుకుపోయి యుద్ధం చేయడమే! ప్రాచీన యుద్ధాల్లో సైనికులు ఒకరివైపు ఒకరు దూసుకొచ్చి ఒకరితో ఒకరు చేతులతో, ముష్టియుద్ధాలు, కత్తులతో, బల్లాలతో యుద్ధం చేసుకునేవారు.


ఆ ఆయుధాలకు గొప్ప శారీరక శక్తి అవసరం. అందువల్ల వీరత్వం, కండరాల బలం చాలా అవసరం. యుద్ధరంగంలో వుండే అధికారుల బాధ్యతలు, ఇప్పటి వాటితో పోలిస్తే భిన్నంగా వుంటాయి. ఇప్పుడైతే అధికారి ప్రశాంతంగా వుండాలి. అతని పని లెక్కలు వేయడం, పథకాలు వెయ్యడం, దారి చూపడం, ఏర్పాట్లు చేయడం.... కొన్నిసార్లు తప్పించలేని ప్రమాదం ఎదురైనప్పుడు మాత్రమే తన వీరత్వాన్ని ప్రదర్శించాల్సి రావచ్చు. కానీ అలా గొప్ప శారీరక బలం ప్రదర్శించాల్సి రావలసిన అవసరం చాలా అరుదు.ప్రాచీన కాలంలో అధికారుల పని, క్రింది స్థాయి అధికారులు తమ సైన్యాన్ని దారి చూపడం, వారికి ఆదర్శంగా నిలవడానికి తాము యుద్ధాలలో వ్యక్తిగత శక్తులను ప్రదర్శిస్తారు. అలెగ్జాండర్ జీవితం మొదటి భాగంలో ముఖ్యమైన లక్ష్యం ఇదే !


అలెగ్జాండర్ని చిన్నప్పుడు పెంచిన ఆయా లాన్నయస్. తన శక్తిమేరకు అతని బలం, కాయపుష్టి కలగడానికి ప్రయత్నించింది. అలాగే అతనితో మంచిగా, సున్నితంగా వ్యవహరించేది. అలెగ్జాండర్కి ఆమె అంటే ఎంతో ఆప్యాయత వుంది. తను జీవించి


వున్నంతకాలం ఆమెని ఎంతో గౌరవంగా చూసుకునేవాడు.


అలెగ్జాండర్ చదువు బాధ్యత లియోన్నాటసికి అప్పగించబడింది. తనకితానుగా చదువుకోగలిగే సామర్థ్యం అలెగ్జాండర్కి వచ్చాక అతనికి గురువుని ఏర్పాటు చేశారు. అతని పేరు లిసిమాచూస్. ఆ రోజుల్లో యువరాజులకు నేర్పించే విషయాలను అతను చెప్పేవాడు.


ఆ రోజుల్లో ముద్రించబడిన పుస్తకాలు లేవు. తోలుచుట్టలమీద వ్రాయబడి వుండే వాటిని యువ పండితుల చేత చదివింపజేసేవారు. ఆ గ్రంథాలలో జ్ఞానానికి చెందినవి, ప్రేమ పూరిత చరిత్రలు, ఆ రోజుల్లో వున్న వీరుల కథలు వుండేవి.


అలెగ్జాండర్కి నాలుగు లేదా అయిదు వందల సంవత్సరాల ముందు పుట్టి జీవించిన హోమర్ అనే ప్రాచీన కవి వ్రాతలు ఇలాంటి వాటిలో ప్రసిద్ధమైనవి. పదేళ్ళపాటు కొనసాగిన ట్రాయ్ ముట్టడిలోని కొందరు గొప్పవీరుల విన్యాసాలు, కథలు ఎంతో గొప్పగా, అందంగా వ్రాయబడ్డాయి.


వాటిలోని పాత్రల చిత్రీకరణ, ప్రేమపూరిత సాహసాలు, అద్భుతమైన, స్పష్టమైన వర్ణనలు, అలాగే సన్నివేశాల వర్ణన కారణంగా అవి వ్రాయబడిన భాషను అర్థం చేసుకోగలిగే ప్రతీ ఒక్కరూ, ఏ వయసు వారైనా సరే వాటిని చదివేవారు.


అవి తన మాతృభాషలో వ్రాయబడి వుండటం వల్ల అలెగ్జాండర్ వాటిని తేలికగా అర్థం చేసుకోగలిగేవాడు. ఆ కథనం కారణంగా ఎంతో ఉత్సుకతకు గురిఅయ్యేవాడు. అలెగ్జాండర్ చదువులో కొంతభాగం అరిస్టాటిల్ ఆధ్వర్యంలో జరిగింది.


ప్రాచీన కాలంలో బాగా ప్రఖ్యాతి పొందిన పండితుల్లో అరిస్టాటిల్ ఒకడు. హోమర్ పద్యాల అందమైన ప్రతిని అరిస్టాటిల్ అలెగ్జాండర్ కోసం తయారుచేయించాడు. అది పూర్తిగా సరిచేయబడి అత్యంత అందంగా ఎత్తి వ్రాయించాడు. అలెగ్జాండర్ ఆ ప్రతిని, తన అన్ని యుద్ధాలలో తీసుకునిపోయేవాడు. కొన్ని సంవత్సరాల తర్వాత పర్షియన్లని జయించిన తరువాత తన విజయంలో దోచుకోబడ్డ వస్తువుల్లో చాలా అందమైన, ఖరీదైన బుట్టని తీసుకున్నాడు. దాన్ని మహారాజు రియన్ తన నగలు, ఖరీదైన నిధులను పెట్టడానికి వాడేవాడు. తన అందమైన ప్రతిని ఈ పెట్టెలో పెట్టాలని అలెగ్జాండర్ నిర్ణయించుకున్నాడు. అప్పటి నుంచి ఆ పెట్టెలో ఇది అతని వెంట అన్ని యుద్ధాలలోనూ వచ్చేది.


అరిస్టాటిల్ ఇచ్చే గ్రంధాలను చదవడానికి అలెగ్జాండర్ అమితంగా ఇష్టపడేవాడు. తర్కసంబంధమైన జ్ఞానంతోపాటు లెక్కల్లో అపరిమితమైన అభివృద్ధిని సాధించినందువల్ల, అతని లెక్కలు వేసే శక్తి నిర్ణయాలు తీసుకునే సామర్ధ్యం బాగా పెరిగాయి.


అతని తండ్రి ఫిలిప్స్ గొప్ప వీరుడు. గ్రీస్ లోని ఎన్నో భాగాలను జయించాడు. కానీ అతను ఆసియాలోకి మాత్రం ప్రవేశించలేదు. విజయం సాధించి ఫిలిప్స్ మెసెడోన్లోకి వచ్చినప్పుడు, దర్బారులో వున్న వాళ్ళంతా ఆనందంతో పొంగిపోయేవారు. కానీ అలెగ్జాండర్ మాత్రం ఆ సమయంలో దీర్ఘంగా ఆలోచిస్తూ నిరాశలో వుండేవాడు. తన తండ్రి తను జయించడానికి ఒక్కదేశం కూడా మిగలకుండా అన్నీ తనే జయించేస్తాడేమోనని బాధపడేవాడు.


ఒకసారి పర్షియన్ దర్బారు నుంచి కొంతమంది రాయబారులు వచ్చారు. ఆ సమయంలో ఫిలిప్స్ అక్కడ లేడు. రాయబారులు అలెగ్జాండర్ని చూసి అతనితో మాట్లాడారు. అలెగ్జాండర్ పర్షియన్ ప్రభుత్వం యొక్క కవాతు, ఆడంబరాల గురించి వినడానికి ఆసక్తి ప్రదర్శిస్తాడనుకున్నారు.


ప్రపంచ ప్రఖ్యాతి చెందిన వేలాడే ఉద్యానవనాలు (ఇవి గాలిలో ఎత్తుగా వున్న ఆర్జీమీద పెంచబడ్డాయి) బంగారంతో చేయబడిన వైన్ (దీనిలో పళ్ళ బదులు విలువైన రాళ్ళున్నాయి. విశాలమైన పర్షియన్ నగరాలు, అందమైన ప్రదేశాలు, విందులు, ఉత్సవాలు, గొప్ప గొప్ప వినోదాల గురించి చెప్పడానికి వారిదగ్గర ఎన్నో కథలు వున్నాయి.


కానీ అలెగ్జాండర్కి వాటి గురించి వినేంత ఆసక్తి లేదు. వివిధ పర్షియన్ దేశాల ఖగోళపరమైన స్థానాలు, వాటిలోపలకు పోవడానికి దారితీసే మార్గాలు, ఆసియన్ దేశాల సైన్యాల అజమాయిషీ, వారి సైనిక వ్యూహ ప్రతివ్యూహ పద్ధతుల గురించీ, పర్షియన్ రాజు ఆర్టాక్సె రెక్సెస్ వ్యక్తిత్వం, అలవాట్ల గురించి తరచి తరచి అడిగేవాడు.


ఆ యువరాజు ముందు చూపు, మానసిక పరిపక్వత, దాని తాలుకూ నిదర్శనాలను చూసి రాయబారులకి చాలా ఆశ్చర్యం వేసింది. వారు అతన్ని ఆర్టాక్సెరెక్సెస్తో పోల్చకుండా వుండలేకపోయారు. 


"అలెగ్జాండర్ గొప్పవాడు. మా రాజు కేవలం ధనవంతుడు" అన్నా రాయల ఆసియాన్ దేశాల్లో గొప్పవాళ్ళుగా భావించే వారితో అతన్ని పోల్చి, అతని ఏర్పరచుకున్న నిర్ణయం తర్వాత కాలంలో నిజం అని నిరూపించబడింది. అలెగ్జాండర్ విజయం వెనుక వున్న రహస్యం అతని ప్రశాంతమైన లెక్కలు వేసి ఆలోచించే తత్వంతోపాటు అతని శక్తి సామర్ధ్యాలే! అతని గుర్రం బుసే ఫలు కథ విని తీరాలి. అలెగ్జాండర్ చిన్న తనంలో చాలా మొండిగా, నిర్లక్ష్యంగా ప్రవర్తించే ఓ గుర్రాన్ని ఫిలిప్స్ దగ్గరకు తీసుకొచ్చారు కొంతమంది వ్యాపారులు.


రాజభవనానికి ఎన్నోదారుల కూడలి అయిన ఓ ప్రదేశంలోకి ఆ తీసుకొచ్చారు. ఫిలిప్స్ ఇతర రాచకుటుంబీకులతో కలసి ఆ గుర్రాన్ని చూడటానికి వెళ్ళాడు. ఆ గుర్రం చూడటానికి అదోలావుంది. చాలా ఆగ్రహంగా, ఎగసెగసి దుముకుతూ విన్యాసాలు చేసింది. దాన్ని అదుపు చేయడం చాలా కష్టం అన్పించింది ఫిలిప్స్కి.


దాన్ని అధిరోహించడానికి ఎవరూ ధైర్యం చెయ్యలేదు. అసలాగుర్రం పట్ల ఫిలిప్స్ ఏమాత్రం సంతృప్తి చెందలేదు. అంత చురుకుగా వున్న ఆ గుర్రాన్ని ఎక్కడానికి ఎవరూ ముందుకు రాలేదు. అలాంటి గుర్రాన్ని తన ముందుకు తెచ్చినందుకు చిరాకుపడ్డాడు.


అక్కడ వున్న మిగిలిన వాళ్ళు ఆ గుర్రాన్ని తక్కువ చేసి మాట్లాడసాగారు. అలెగ్జాండర్ నిశ్శబ్దంగా నిలబడి, దాన్ని కదలికలను గమనిస్తూ దాని స్వభావాన్ని శ్రద్ధగా అధ్యయనం చేయసాగాడు. కొత్తగా విచిత్రంగావున్న ఆ ప్రదేశంలో ఆ గుర్రం అనుభవిస్తున్న కలవరం కారణంగా అది ఎంత అస్థిమితంగా వుందో అర్థం చేసుకున్నాడు.


ఆ సమయంలో నేలమీద స్పష్టంగా, బలంగా వున్న తన నీడను చూసి తనే భయపడుతుందని అర్థం చేసుకున్నాడు. ఆ గుర్రం అంత ఎక్కువగా ఆత్రపడటానికి చేసుకున్నాడు. గొప్పనాడీ, కండరాల శక్తి తాలూకూ వీరత్వం, చురుకుదనం, వివేకాలకు అది నిదర్శనం. ఉపయోగం లేనిదని


ఆ గుర్రం భావించి, అది వచ్చిన తెస్సలికే తిరిగి దాన్ని పంపించెయ్య మన్నాడు ఫిలిప్స్. అయితే అంత నాణ్యమైన గుర్రాన్ని కోల్పోవడానికి అలెగ్జాండర్ సిద్ధంగా లేదు. ఆ గుర్రాన్ని అధిరోహించే ప్రయత్నం చేసేందుకు అనుమతి నివ్వమని తండ్రిని కోరాడు.


ఫిలిప్స్ ముందు తిరస్కరించాడు. గుర్రాలకు చెందిన అనుభవజ్ఞులు, నిపుణులు ఉందని చెప్పబడిన గుర్రాన్ని అధిరోహించే ప్రయత్నంచేయడం మంచిదికాదన్నారు. కానీ చివరకు ఫిలిప్స్ ఒప్పుకున్నాడు. 


అలెగ్జాండర్ ఆ గుర్రం దగ్గర కెళ్ళి దాని కళ్ళాన్ని చేతిలోకి తీసుకున్నాడు. దాని మెడమీద తడుతూ తేలికగా, తన గురించి భయపడ వద్దని సంకేతాలు ఇస్తూ, దానికి అర్థమయ్యేట్లు ప్రవర్తిస్తూ తన గొంతుతో దాన్ని శాంతింపజేశాడు. ఒక తెలివైన గుర్రం తన దగ్గరకు వచ్చిన వాళ్ళు భయపడుతూ వచ్చారా, లేక జాగ్రత్తగా వచ్చారా అన్న విషయాన్ని సులభంగా గుర్తించగలదు. అలాంటి యజమానిని అది అనుమానంగా. _చూస్తుంది. లొంగకూడదని నిర్ణయించుకుంటుంది.


ధైర్యంతోపాటు శాంతంగా వుండే లక్షణాలు వున్న వ్యక్తికి గుర్రాలు తమ విధేయతని చూపడానికి ఇష్టపడతాయి. అలాగే ఆ గుర్రం నెమ్మదించింది. అలెగ్జాండర్ దాన్ని అధిరోహించి పూర్తిగా లొంగతీసుకున్నాడు. తనని నిమరడానికి అతన్ని అనుమతించిందా.. నీడ కన్పించని దిశకు తిప్పాడు అలెగ్జాండర్.


దానిని అదుపు చేయడానికి కంగారు పడకుండా దాన్ని స్వేచ్ఛగా తిరగడానికి తన కంఠంతో పిలుస్తూ ఉత్సాహపరిచాడు. మైదానంలో అత్యంతవేగంగా పరుగెత్తిందా గుర్రం. ముందు భయంతో వణుకుతూ ఫిలిప్స్, అతని రాచకుటుంబీకులు దాన్ని చూశారు. తర్వాత ఆహ్లాదంగా, ఆనందంగా చూశారు. అలెగ్జాండర్ గుర్రంతోపాటు తిరిగి రాజు దగ్గరకు సురక్షితంగా తిరిగొచ్చాడు.


రాచకుటుంబీకులు అతన్ని ప్రశంసలతో, శుభాకాంక్షలతో ముంచెత్తారు. ఫిలిప్స్ అతన్ని అభినందిస్తూ అలెగ్జాండర్ మెసెడోన్కంటే పెద్ద రాజ్యాన్ని పాలించడానికి అర్హుడన్నాడు. గుర్రం నిజమైన స్వభావాన్ని అంచనా వెయ్యడంలో అలెగ్జాండర్ సమర్ధుడని ఆ సంఘటన రుజువు చేసింది. ప్రతీ విషయంలో అది తన యజమానికి తలవొగ్గి ప్రవర్తించేది. అలెగ్జాండర్ ఆజ్ఞ ఇవ్వగానే అది ముందు మోకాళ్ళ మీదకు వంగేది, తద్వారా తన యజమాని తేలికగా తనపై ఎక్కగలుగుతాడని.


అలెగ్జాండర్ దాన్ని చాలా కాలం తనతో వుంచుకున్నాడు. అది అతనికి చాలా ఇష్టమైన గుర్రం. యుద్ధంలో దాని విన్యాసాలు, సూక్ష్మ బుద్ధి గురించి ఎన్నో కథలు ఆరోజులకు చెందిన చరిత్రకారులు చెప్పేవారు.


యుద్ధం కోసం సైనిక అలంకారాలతో అది సిద్ధమయ్యేదంటే, అది చాలా గర్వంగా, ఆహ్లాదంగా వుందని అర్థం. అలాంటి సమయాల్లో అలెగ్జాండరిన్ని తప్ప ఇంకెవర్నీ దాని మీదకు ఎక్కనిచ్చేదికాదు. దానికి చివరకు ఏమయిందనే విషయం తెలియదు. దాని మరణం గురించి రెండు కథలున్నాయి. ఒక సందర్భంలో అలెగ్జాండర్ యుద్ధ రంగంలో శత్రువులు మధ్యలోకి, మరీలోపలకి చొచ్చుకుపోయాడని, కొంత సమయం తెగించి పోరాటం చేసినా బుసేఫలుస్ అత్యంత కష్టమైన, తీవ్రమైన ప్రయత్నాలు చేసి అలెగ్జాండర్ని బయటకు తీసుకుపోవడానికి


ఎన్ని చోట్ల గాయాలైనా, ఎంత తీవ్రగాయాలైనా, దాదాపుగా శక్తి అంతా అంతరించిపోయినా ఆగకుండా ప్రయాణించి, అలెగ్జాండరిని సురక్షితమైన ప్రదేశానికి. తీసుకుపోయి అక్కడ అతన్నిదించి అది మరణించిందని కథ.


కానీ అది అప్పుడు చనిపోలేదని, మెల్లగా కోలుకుందని కొందరి చరిత్రకారుల కధనం. అది ముప్పయ్ ఏళ్ళపాటు జీవించిందనీ, ఒక గుర్రానికి అది చాలా ముసలివయసనీ, తర్వాత అది మరణించిందని అంటారు.


అలెగ్జాండర్ దాని కర్మకాండలు గొప్పగా నిర్వహించి, దాన్నికప్పెట్టి, దాని


జ్ఞాపకచిహ్నంగా, దాని పేరుమీద 'బుసేఫాలియా' అనే నగరాన్ని నిర్మించాడు. అలెగ్జాండర్ చాలా వేగంగా పరిపూర్ణతను సాధించాడు. అతన్ని పదహారేళ్ళ గయసులోనే మెసెడోన్కి అధిపతిగా ప్రకటించాడు ఫిలిప్స్. గ్రీసులోని మిగిలిన రాష్ట్రాల్లో నిక ప్రచారానికి వెళ్ళినప్పుడు ఆ పనిచేశాడు, ఫిలిప్స్ ఎవరికీ, ఏ మాత్రం అనుమానం తెలగకుండా.


అలెగ్జాండర్ తను తాత్కాలిక అధిపతిగా వున్నప్పుడు తన సహాయకులుగా పై అధికారుల్లో గొప్ప సామర్థ్యం, బాగా అనుభవం వున్నవారిని నియమించుకునేవాడు. ఆలోచనా మందిరంలో తన శక్తిని సంపూర్ణంగా ప్రదర్శించి, వాటిని విజయవంతం చేసేవాడు.


తన క్రింది అధికారులు తన కంటే తక్కువ స్థాయికి చెందినా, వయస్సు అనుభవంలో తనకంటే ఆధిక్యులు గనుక వారితో పూర్తిగా అణుకువగా మెలుగుతూ, వారికి మర్యాదని ఇచ్చేవాడు.


అలెగ్జాండర్కి పద్దెనిమిదేళ్ళ వయస్సు వచ్చాక, ఫిలిప్స్ అతన్ని తనతోపాటు యుద్ధానికి దక్షిణం వైపు తీసుకుపోయాడు. ఫిలిప్స్ చేసిన గొప్ప యుద్ధాల్లో బొకాటియాలో జరిగిన యుద్ధం ఒకటి. ఈ యుద్ధానికి ఏర్పాట్లు చేస్తున్న సమయంలో అలెగ్జాండర్కి సైన్యంలోని ఓ దళానికి ఆధిపత్యం ఇచ్చాడు.


మిగిలిన సైన్యాన్ని తన అజమాయిషీలో వుంచుకున్నాడు. తన యువకుమారుడికి కొంత బాధ్యతను అప్పగించడం ద్వారా కొంత ప్రశాంతంగా వున్నాడు ఫిలిప్స్. కానీ ఎలాంటి చెడు ఫలితం రాకుండా వుండటానికి అలెగ్జాండర్కి తోడుగా సమర్థులైన అధికారులని నియమించాడు. చివరికి ఫిలిప్స్ విజయాన్ని సాధించాడు. తద్వారా గ్రీసులోని రాష్ట్రాలపై ఆధిపత్యాన్ని పొందాడు.


జీవిత ప్రారంభం మొదట్లో అలెగ్జాండర్ మెదడుకి అసాధారణమైన తెలివితేటలున్నా అతను తరచుగా తుంటరిగా, తలబిరుసుగా ప్రవర్తించేవాడు. తన గౌరవాన్ని, తనకు కోపాన్ని తట్టి లేపిన సంఘటనలతో అతన్ని అదుపుచెయ్యడం కష్టం అయ్యేది.


అతని తల్లి ఒలింపియస్కి తుంటరితనంతోపాటు అహంకారం ఎక్కువ. ఆమె తన భర్తతో తరచుగా గొడవపడుతుండేది. కొందరు అతనే ఆమెతో గొడవపడేవాడని అంటుండేవారు. ఒకరికొకరు నమ్మకంగా వుండలేదు.


ఒక చేదు అనుభవం తర్వాత ఫిలిప్స్ తన భార్యని విడిచిపెట్టి వేరొక స్త్రీని పెళ్ళిచేసుకున్నాడు. ఆ వివాహం సందర్భంగా ఏర్పాటు చెయ్యబడిన పండుగ ఉత్సవాల్లో పెద్ద విందుని ఏర్పాటుచేశాడు.


ఆ విందులోని అతిధుల్లో ఒకరు క్రొత్త రాణిని పొగుడుతూ ఏదో అన్నారు. అతను ఉపయోగించిన మాటలను అలెగ్జాండర్ తన తల్లి, తనపుట్టుకపట్ల అవహేళనగా భావించాడు. అతనికోపం తారాజువ్వలాలేచింది. ఆ మాటలన్న వ్యక్తి తల మీదకు తను తాగుతున్న పాత్రని విసిరేశాడు.


అతని పేరు అట్టాలుస్. అతను కూడా తిరిగి తన పాత్రను అలెగ్జాండర్ కేసి విసిరాడు. అక్కడ భోజనాలు చేస్తున్న అతిధులు లేచి నిలబడ్డారు. అంతా అయోమయం...... అంతా గందరగోళం.

ఫిలిప్స్ అప్పటిదాకా జరుగుతున్న ప్రశాంతమయిన వేడుకలో తలెత్తిన ఆటంకాన్ని గమనించి తన ఖడ్గాన్ని చేతిలోకి తీసుకుని అలెగ్జాండర్ కేసి వేగంగా రాబోయి తూలిముందుకు పడిపోయాడు. అలా పడిపోయిన తండ్రి కేసి నిర్లక్ష్యంగా చూస్తూ అన్నాడు అలెగ్జాండర్.నేలమీద సరిగ్గా నడవలేకపోయిన ఒక వ్యక్తి గ్రీస్ రాష్ట్రాల సైన్యాలకు సారధ్యం

వహిస్తున్నాడు." అంటూనే అక్కడ నుంచి, రాజ భవనంలోంచి వెళ్ళిపోయాడు. వెంటనే తన తల్లి ఒలింపియన్తో తో కలసి ఆమె స్వదేశానికి వెళ్ళిపోయాడు అలెగ్జాండర్, అతని తల్లితోపాటు ఎఫిరస్లోనే కొంతకాలం వున్నాడు.

లోపు ఫిలిప్ ఆసియాలోకి దండయాత్ర చేయాలని పథకం వేశాడు. గ్రీస్లోని రాష్ట్రాలలోని శక్తివంతమైన సైన్యాలను పోగేసి, సైన్యాన్ని సిద్ధం చేశాడు. అతని మనస్సు

మొత్తం ఈ విశాలమయిన ప్రయత్నం మీద నిమగ్నమయివుంది. తన స్వంత రాజ్యం పూర్తిగా సంపదతో, సంవృద్ధితో అలరారుతోంది. అతని ప్రాధాన్యత మిగిలిన యూరోపియన్ రాజ్యాలమీద పూర్తిగా కేంద్రీకృతమయింది. ఫిలిపీ

తన కుమారుడు అలెగ్జాండర్ అంటే ఎంతో గర్వం! యుద్ధాలు చేయడం, కోటలని ముట్టడించి స్వాధీనం చేసుకోవడంలో కుమారుడి సహాయాన్ని తీసుకుంటున్నాడు ఫిలిప్స్. తను చేపట్టిన పనులవల్ల అలెగ్జాండర్కి అద్భుతమైన భవిష్యత్ వుంటుందని ఆశించే వాడు ఫిలిప్స్.

అలెగ్జాండర్కి అహంకారం కూడా అధికమే! తన తండ్రికి లభిస్తున్న గౌరవ మర్యాదలు, ప్రతిష్టని చూసి కొంత అసూయ, మరికొంత ఈర్ష్యగానూ వుండేది. అతను తల్లి పక్షం వహించడానికి కారణం తనకు లభించాల్సిన పేరు, గొప్పతనాలకి తండ్రి అడ్డంకిగా వున్నాడని అతను భావించడమే !

తన తండ్రి స్థానాన్ని పొందడానికి కావలసిన శక్తి సామర్థ్యాలు తనకున్నాయని అతని నమ్మకం! తన తండ్రి జీవించివుండగా తను కేవలం యువరాజు మాత్రమే! దేనిమీదయినా ప్రభావం చూపించి సాధించగలవాడు మాత్రమే! తనకంటూ స్వంతంగా నిర్ణయాలు తీసుకునే అధికారంలేదు.

ఫిలిప్స్ కొడుకు అనే పరదాలోనే తను జీవిస్తున్నాననే ఆలోచనలతో అసహనంగా, నిద్రలేని రాత్రులు గడుపుతుండేవాడు. ఆ స్థాయినుంచి పైకి ఎదగాలంటే ఎన్నో సంవత్సరాలు గడవాల్సి వుంటుంది. కానీ అలెగ్జాండర్కి అదృష్టవశాత్తూ ఆ అవకాశం చాలా తొందరగా వచ్చింది.



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

పంద్రాగస్టు పండుగన ? విషాదమా ?

నారద గానమాత్సర్యం - పింగళి సూరన degree 4 th sem Telugu

ఉర్దూ కవితారూపాలు Degree 5th sem