నరుడ నేను నరుడు నేను - కాళోజి నారాయణరావు

 పాఠ్యభాగము

 పాఠ్య భాగము దేని నుండి స్వేకరించ బడింది :'నరుడ నేను, నరుడ నేను'


: 'నా గొడవ' పేరుతో వచ్చిన కాళోజీ సమగ్ర రచనల సంపుటి నుండి గ్రహంప బడింది.


కవి : కాళోజీ నారాయణరావు

జనన తేదీ: సెప్టెంబరు 9,1914వ సంవత్సరం


తల్లి తండ్రుల: రమాబాయి, కాళోజీ రంగారావు

విద్యాభ్యాసము: 

ఈ కవి, వరంగల్ జిల్లా మడికొండలో ప్రాథమిక విద్యను, హైదరాబాద్లో ఉన్నత విద్యను, నేర్చారు :


ఉద్యమ జీవితము : 

 కాళోజీ వివిధ సామాజిక రాజకీయ, పౌరహక్కుల ఉద్యమాల్లో కీలకపాత్రను పోషించారు.


సామాజిక చైతన్యం

: ఈ కవి, ఆర్యసమాజ కార్యకర్తగా, హేతువాదిగా కారుణ్యమూర్తిగా, ప్రజాస్వామ్యవాదిగా, అన్యాయాలను ఎదిరించే క్రియాశీలవాదిగా, సామాజిక చైతన్యం కోసం నిరంతర కృషి చేశాడు.


కాళోజీ కవితా భూమిక

: సామాజిక రాజకీయ అవ్యవస్థలను, ఎప్పటికప్పుడు సరిచేసే ప్రయత్నమే, కాళోజీ కవితకు 'భూమిక'.

రచనలు :

ఈయన, 1953లో 'నా గొడవ' పేరుతో తొలి సంపుటిని ప్రచురించాడు. 1968లో ఖలీల్ జిబ్రాన్ రచనను, “జీవనగీత"గా అనువాదం చేశాడు .


అవార్డు: 

1992లో భారత ప్రభుత్వం 'పద్మవిభూషణ్'తో' 2. ఈయనను సత్కరించింది. పలు అవార్డులు, సన్మానాలు, పురస్కారాలు, అందుకున్నాడు.


ఆకాంక్ష- 

రాజ్యాంగ నైతికతకు లోబడి, వ్యవస్థలూ, పౌరులూ, నడవాలన్నదే కాళోజీ ఆకాంక్ష


మరణము :

2 నవంబర్ 13, 2002.


పాఠ్యభాగ ఉద్దేశం :


మనిషి జీవితం మూడు కాలాలతో బంధింపబడి ఉంటుంది. మనిషి భూత, వర్తమాన, భవిష్యత్ విషయాలను గురించి, అనేక విషయాలపై కలత చెందుతూ, తన వర్తమాన జీవితాన్ని సంక్లిష్టం చేసుకుంటూ ఉంటాడు. ఆశనిరాశల మధ్య మనిషి నలిగిపోయి, తల్లడిల్లుతున్నాడు. మనిషి సంతోషంగా జీవించాలంటే, సమతా మమతా భావాలు ఉండాలి.


మనిషి ఉన్నదానితో సంతృప్తి పడలేకపోవటం, లేనిదానికోసం కోరుకోడం, పొందవలసిన వాటి గురించి విచారించడంతో తన ఆనందాన్ని పాడు చేసికొంటున్నాడు. మానవుడిని కామ క్రోధ లోభ మద మోహ మాత్సర్యములు అనే ఆరు శత్రువులూ ఎప్పుడూ చుట్టుముట్టి ఉంటాయి. కాని, ఆది ఆత్మవంచన అనియే చెప్పాలి.


కళ్ళు చెమ్మగిల్లితేనే, బ్రతుకు తీపి తెలుస్తుంది. కష్టసుఖాల సారము తెలుసుకుంటేనే, జీవన సత్యం తెలుస్తుంది. సాటి మానవుడి పట్ల కరుణ, దయ, జాలి, అనుకంప, సానుభూతి, ఉన్నప్పుడే జీవితార్ధం బోధపడుతుంది. మొదట తాను మనిషిని అనే భావంతో మనిషి జీవించాలి. తాను మనిషినని గుర్తిస్తే, తన సాటివారు కూడా మనుష్యులు అనే భావన, కలుగుతుంది. ఈ సహోదర భావం, సమానత్వాన్ని కోరుతుంది. ఆధిక్యతా భావం, తొలగిపోతుంది. నాలాగే ఇతరులు, ఇతరులలాగే తాను, అన్న అవగాహన, అవసరం. సంతోషంగా జీవించటం కోసం, అనేక కష్టాలు పడి, తన సుఖం కోసం, ఇతరులను పీడించే మనస్తత్వాన్ని వదలిపెట్టడమే నరత్వం, నారాయణత్వం అని, కాళోజీ జీవన సారాంశం.

ప్రశ్నలు జవాబులు

1)నరుడ నేను నరుడ నేను' కవితలో కాళోజీ వెలిబుచ్చిన జీవన సారాంశమును వివరించండి.

(లేదా)

కాళోజీ మనిషి జీవ విధానం గురించి వెలువరించిన జీవన సత్యాలను వివరించండి.


కాళోజీ నారాయణరావుగారు, వారి 'నరుడ నేను, నరుడ నేను' అనే కవితలో మనిషి జీవన సారాంశాన్ని ఇలా వివరించారు.

"కళ్ళు చెమ్మగిల్లితేనే, బ్రతుకు కమ్మదనము తెలుస్తుంది. దాహం తీరేలా త్రాగితేనే, మనసుపై కప్పిన మబ్బు విడిపోతుంది. సిగ్గుపడుతూ జీవిస్తే, హృదయము వికసించదు. సంతోషంగా ఆడితేనే, హృదయము కదలుతుంది.

మాయా, మమతలు లేని వ్యర్థమైన శరీరము, కట్టెల బరువు. మమత గల మనస్సులోనే 'సమత్వం' కలుగుతుంది. మానవుడు మట్టికాదు మనసు ఉన్నవాడు. మనిషి నవ్వగలడు. ఏడ్వగలడు.అనుభూతి తెలియని అమరత్వము కంటే, మనిషి జన్మ గొప్పది. తృప్తిలేని బ్రతుకు, చవట బ్రతుకు.


శత్రువులు ఆరుగురూ మనిషిని ఎప్పుడూ చుట్టుముట్టి ఉంటారని, మనిషి మనస్సులోని బాధను దాచుకొని, జీవచ్ఛవంలా బతకరాదు.

మనిషి హాయిగా నవ్వలేక, ఏడ్వలేక, క్రొవ్వులో కరిగి, సంతోషాన్ని పొందకుండానే భూమిని విడిచి వెడుతున్నాడు.


మనిషి కోరికలు తీరా బ్రతికి, చావాలి. చావు రాకుండా మనిషి పిరికి ఆత్మహత్య చేసికోరాదు. తృప్తిగా సుఖాలు అనుభవించి, వాటిపై ఏవగింపు కలిగాకే మనిషి మరణించాలి. కాబట్టి మనిషి తన శరీరంలో బలము ఉన్నప్పుడే, తన కోరికల బులుపును, తీర్చుకోవాలి. భవిష్యత్తులో రాబోయే బాధలకు భయపడి, వర్తమానంలోని సుఖాన్ని త్యాగం చేయకూడదు. ఎప్పుడో రాబోయే బాధ కోసం, ప్రస్తుతం బాధపడకూడదు. తన కోరిక తీరితే, కోటి బాధలు పడినా పరవాలేదు. మనిషి బ్రతికి ఉన్నపుడే, నిర్భయంగా తన కోరికలు తీర్చుకోవాలి.


బ్రహ్మకు సహితం, మనిషి భయపడకూడదు. చేసే పని అశాస్త్రీయమని, లౌకికమని వెనుకడుగు వెయ్యకూడదు. కోరికలు సంపూర్తిగా తీరేలా, హాయిగా జీవించాలి. మనిషి ఇచ్ఛయే అతనికి దైవమని నమ్మాలి. తనకు నచ్చినట్లు చేయాలి. 


కోరిక అయిపోయిన దాన్ని గురించి ఆలోచించకూడదు. జరుగుతున్న దాని గురించి బాధపడకూడదు. భవిష్యత్తులో ఏదో జరుగుతుందని ఊహించకూడదు. సంతోషంగా ఎల్లప్పుడూ జీవించాలి. ఎంత సౌఖ్యం కలుగుతుందన్నా ఇతరుల్ని బాధించకూడదు.


తన సుఖం కోసం పరులను పీడించే మనస్తత్వాన్ని విడిచిపెట్టడమే, నరత్వం, నారాయణత్వం అని, కాళోజీ తన కవితా ఖండికలో జీవన సారాంశాన్ని వివరించాడు.


సందర్భ సహిత వ్యాఖ్యలు


1. 'చెమ్మగిలని కనులు బ్రతుకు కమ్మదనము చూడలేవు'


 జ. కవి పరిచయం : 

ఈ వాక్యము కాళోజీ రచించిన 'నా గొడవ' అనే సమగ్ర రచనల సంపుటిలోని “నరుడ నేను, నరుడ నేను" అనే కవితా ఖండికలోది. 

సందర్భం :

 మనిషి కన్నులు చెమ్మగిల్లితేనే, బ్రతుకు తీపి తెలుస్తుంది. కష్ట సుఖాల సారం తెలిసికొంటేనే, జీవన సత్యం తెలుస్తుంది. సాటి మానవుడిపట్ల కరుణ, దయ, జాలి, అనుకంప, సానుభూతి ఉంది, ఇతరులు కష్టాన్ని చూసి, తాను కంటతడి పెట్టగలిగితేనే, జీవనంలోని తీయదనం తెలుస్తుందని కాళోజీ తన కవితా ఖండికలో చెప్పిన సందర్భంలోది.


వ్యాఖ్య: 

ఇతరుల బాధలు చూసి, అయ్యో అని తాను బాధపడి, తాను వారి కోసం కంటతడి పెట్టగలిగితేనే, జీవితంలోని కమ్మదనమూ, మాధుర్యమూ తెలుస్తాయని కాళోజీ భావము.


2. "మాయ మమత లేని వట్టికాయము కట్టెల చేటు"(V.Imp


జ. కవి పరిచయం : 

ఈ వాక్యాలు కాళోజీ రచించిన 'నా గొడవ' అనే సమగ్ర రచనల సంపుటిలోని “నరుడ నేను, నరుడ నేను" అనే కవితా ఖండికలోనివి.

సందర్భము : 

కాళోజీ 'నరుడ నేను, నరుడ నేను' అనే కవితా ఖండికలో, మనిషికి ఇతరుల కష్టాలను చూసి కంటతడిపెట్టే జాలి, కరుణ, దయ, అనుకంప ఉండాలని చెప్పాడు. అటువంటి దయలేని బ్రతుకుకు, జీవన మాధుర్యము తెలియదన్నాడు. మనిషిలో దయ, మమత ఉండాలని, అది లేని శరీరము, వ్యర్ధమని, ఆ శరీరము కట్టెల చేటు అని, కాళోజీ చెప్పిన సందర్భములోనివి. 

వ్యాఖ్య : 

మనిషి చచ్చిపోతే దాన్ని కాల్చి బూడిద చెయ్యాలి. అందుకు కట్టెలు అనగా కఱ్ఱలు కావాలి. మాయ అనగా దయ, మమత అనగా మమకారము. అవి లేని వాడి శరీరము వ్యర్ధమనీ, దాన్ని తగులపెట్టడానికి కఱ్ఱలు కూడా దండుగ అని, కాళోజీ చెప్పాడు.


3. మన్ను కానె కాను నేను, మనసు వున్న మానవుడను.


జ. కవి పరిచయం : 

ఈ వాక్యాలు కాళోజీ రచించిన 'నా గొడవ' అనే సమగ్ర రచనల సంపుటిలోని “నరుడ నేను, నరుడ నేను" అనే కవితా ఖండికలోనివి. 

సందర్భం:

 మనిషి, మొదటగా తాను మనిషిని అనే అవగాహనతో జీవించాలి. మనిషి తాను మనిషిని అని గుర్తిస్తే, తనలాగే సాటివారూ, తోటివారూ మనుషులు అనే భావన కలుగుతుంది. మనిషికి మనసు ఉండాలనీ, మనిషి మట్టి కాదనీ కాళోజీ చెప్పిన సందర్భంలోనివి.

వ్యాఖ్య :


: మనిషి మన్ను కాదు. అనగా మట్టికాదు. అతడిలో మనసు ఉండాలి. అంటే సాటి మానవునిపై జాలి, దయ, కరుణ, అనుకంప, సానుభూతి ఉండాలి. మనిషి మట్టిముద్దలా పడి ఉండరాదనీ, మనస్సు కలిగి, సాటివారిపై కాళోజీ ఈ పంక్తుల ద్వారా సూచించాడు.


4. 'అనుభూతియే ఎరుగనట్టి అమరత్వము నే గోరను

జ. కవి పరిచయం :

ఈ వాక్యాలు కాళోజీ రచించిన 'నా గొడవ' అనే సమగ్ర రచనల సంపుటిలోని “నరుడ నేను, నరుడ నేను” అనే కవితా ఖండికలోనివి. 

సందర్భం: 

మనిషికి అనుభూతి ఉంటుంది. అనుభూతి అంటే సుఖదుఃఖాలను పొందడం. హాస్య సంఘటన చూస్తే మనిషి నవ్వగలడు. బాధ కలిగితే, ఏడ్వగలడు. నవ్వడం, ఏడ్వడం అనే అనుభూతులు, మనిషికి ఉంటాయి. దేవతలకు అటువంటి సుఖదుఃఖానుభవము ఉండదు. అందువల్ల దేవతల కంటె మానవుడే గొప్పవాడని, అందుచే తాను దేవత్వాన్ని కోరననీ, నరునిగానే ఉంటాననీ, కాళోజీ తన హృదయాన్ని వెల్లడించిన సందర్భంలోనివి. 

వ్యాఖ్య : 

ఇతరుల కష్టసుఖాలకు ప్రతిస్పందించని అమరత్వం అనగా దేవతా భావం కంటే ఇతరుల కష్టసుఖాలు చూసి కన్నులు చెమ్మగిల్లే నరుడే గొప్పవాడనీ, తనకు అమరత్వం వద్దనీ నరత్వమే కావాలనీ కాళోజీ కోరాడు.


*5. )'చావురాక మున్నె పిరికి చావు చావలేను నేను'.(Imp


జ. కవి పరిచయం : 

ఈ వాక్యాలు కాళోజీ రచించిన 'నా గొడవ' అనే సమగ్ర రచనల సంపుటిలోని “నరుడ నేను, నరుడ నేను" అనే కవితా ఖండికలోనివి. 

సందర్భం : 

మనిషి బ్రతికియుండగానే, హాయిగా సుఖం అనుభవించాలి. మనిషి బ్రతికుండగానే తనకు ఉన్న కోరికలు అన్నీ తృప్తిగా తీర్చుకోవాలి. అంతేకాని, తృప్తిలేని చవటబ్రతుకు జీవించరాదు. అలాగే పిరికితనంతో చావు రాకుండానే జీవితంపై అసంతృప్తితో, లేదా రాబోయే కష్టాలను ఎదుర్కొనే ధైర్యం లేక, ఆత్మహత్యలు చేసికోరాదని కాళోజీ చెప్పిన సందర్భంలోనివి. 

వ్యాఖ్య : 

చావు సహజంగా ఉండాలి. అంతేకాని పిరికిదనంతో జీవితంలోని కష్టనష్టాలకు భయపడి, ఆత్మహత్యలు తగవని కాళోజీ ఈ పంక్తుల ద్వారా మానవులను హెచ్చరించాడు.

6 కోటి బాధలైన యోర్తు కోరిక తీరిన చాలును


కవి పరిచయం : 

ఈ వాక్యాలు కాళోజీ రచించిన 'నా గొడవ' అనే సమగ్ర రచనల సంపుటిలోని “నరుడ నేను, నరుడ నేను" అనే కవితా ఖండికలోనివి. 

సందర్భం : 

ప్రతి మానవుడూ తనలో శక్తి ఉండగానే, తన కోరికలను తీర్చుకోవాలి. ఎప్పుడో బాధలు వస్తాయని, వర్తమానంలో బాధలు పడరాదు. దానివల్ల ఎటువంటి పరిణామము సంభవించినా, లెక్కచేయరాదు. మనిషి కోటి బాధలయినా పడి, తన కోరికలు తీర్చుకోవాలని కాళోజీ చెప్పిన సందర్భంలోనివి.


వ్యాఖ్య : 

కోరికలు తీర్చుకోవాలనీ, దానివల్ల ఎన్ని కష్టాలు వచ్చినా లెక్కచేయరాదనీ కాళోజీ మానవజాతికి ఈ పంక్తుల ద్వారా జీవన సందేశాన్ని ఇచ్చాడు.


*7. )'ఎంతటి సౌఖ్యానికైన ఇతరులు పీడించలేను'


జ. కవి పరిచయం : 

ఈ వాక్యము కాళోజీ రచించిన 'నా గొడవ' అనే సమగ్ర రచనల సంపుటిలోని “నరుడ నేను, నరుడ నేను” అనే కవితా ఖండికలోనిది. 

సందర్భం: 

మనిషి నిత్యమూ తన కోరికలు తీర్చుకోవాలి. హాయిగా జీవించాలి. సుఖంగా సంతోషంగా జీవించడం కోసం ప్రయత్నం చెయ్యాలి. అంతేకాని తన గొప్ప సౌఖ్యం కోసం, ఇతరులను బాధించరాదని కాళోజీ చెప్పిన సందర్భంలోనిది.


వ్యాఖ్య : 

మనిషి సుఖంగా సంతోషంగా జీవించాలి. కాని తన సుఖం కోసం ఇతరులను పీడించరాదని, పరహింస చేయాలనే మనస్తత్వాన్ని విడిచిపెట్టాలనీ అదే సర్వం అని, నారాయణత్వం అని, కాళోజీ ఈ పంక్తుల ద్వారా జీవన సారాంశాన్నీ, జీవన సత్యాన్నీ తెలిపారు.






కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నారద గానమాత్సర్యం - పింగళి సూరన degree 4 th sem Telugu

మీరు అటామిక్ హ్యాబిట్ చదవకపోతే ఏమి జరుగుతుంది?మీరు అటామిక్ హ్యాబిట్ చదవకపోతే ఏమి జరుగుతుంది? ఎందుకు తప్పక చదవాలి

డెడ్ సీ అంటే ఏమిటి ?