వాగ్దాన భంగము'-ఆసూరి మరింగంటి వేంకట నరసింహాచార్యులు. Degree 4th sem Telugu syllabus
పాఠ్యభాగము: 'వాగ్దాన భంగము'
దేని నుండి గ్రహింపబడింది .'తాలంక నందినీ పరిణయము'లోని చతుర్ధాశ్వాసం.నుండి గ్రహింపబడింది.
కవి
: ఆసూరి మరింగంటి వేంకట నరసింహాచార్యులు.
కాలము
: క్రీ.శ. 1817-1880 ల మధ్యకాలంలో జీవించాడు.
కవిగారి రచనలు .
: తాలాంక నందినీ పరిణయము', 'ఇందిరాల భాగవతము (యక్షగానం)
కవిగారి తండ్రి
: కవి గారి తండ్రి "భావనాచార్యులు”, తన తండ్రి. మహా ప్రతిభావంతుడని, వేదాంత శాస్త్ర నిష్ణాతుడని, ఈ కవి స్వయంగా చెప్పుకున్నాడు.
కవిగారి నివాసము
ఈ కవి తన చరమ దశలో నల్లగొండ జిల్లా కనగల్లులో జీవించాడు. ఈయన బ్రతుకుదెరువు కోసం, వేర్వేరు ప్రాంతాల్లో నివసించాడని తెలుస్తోంది.
కవిగారి జీవన విధానము :
కవిగారితో పాటు ఈ వంశీయులు, తెలంగాణలో ఆచార్య పీఠం పొంది, శిష్యులతో సంచారం చేస్తూ ధార్మిక చింతనను మేల్కొల్పారు.
పాఠ్యభాగ సందర్భం :
తాలంకుడు' అంటే బలరాముడు. బలరాముని కూతురు శశిరేఖ. బలరాముని చెల్లెలు సుభద్ర. ఈమె అర్జునునికి భార్య, సుభద్రార్జునుల పుత్రుడు 'అభిమన్యుడు',' శశిరేఖా, అభిమన్యులు, మేనత్త మేనమామల బిడ్డలు. చిన్నప్పటి నుండి వారిద్దరికీ ప్రేమ చిగురించింది. తల్లిదండ్రులు కూడా, వారిని కాబోయే దంపతులు అంటూ ఆట పట్టించేవారు.
ఇంతలో పాండవులు జూదంలో ఓడిపోయి, అడవుల దారి పట్టారు. వారు సంపదలు కోల్పోయారు. బలరాముడికి పాండవులపై కన్నా, కౌరవులపై ప్రేమ అధికం. బలరాముడు తన కుమార్తె శశిరేఖ వివాహాన్ని అభిమన్యుడితో కాక, దుర్యోధన పుత్రుడు లక్ష్మణ కుమారునితో జరిపించాలని నిర్ణయించాడు.
సుభ్రద తన అన్న బలరాముడు తమకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాడని విలపించింది. శశిరేఖను లక్ష్మణ కుమారుడికి ఇచ్చి పెళ్ళి చేయకుండా ఆపమని, - సుభద్ర, కృష్ణుణ్ణి కోరింది. సుభద్ర తన కుమారుడికి శశిరేఖ నిచ్చి వివాహం జరిపిస్తానన్న బలరాముడు, తన వాగ్దానానికి తానే భంగం కలిగిస్తున్నాడని సుభద్ర వాపోయే
పాఠ్యభాగ సారాంశం
సుభద్ర కన్నులు ఎరుపు ఎక్కాయి. ఆమె మనస్సులో వ్యాకులత పెరిగింది. చెక్కిళ్ళపై నుండి చెమట జారుతోంది. ఓర్పు నశించింది. బలరామునిపై కోపం పెరిగింది. కోపంతో కూడిన భయంకరమైన ముఖంతో, ఆమె శ్రీకృష్ణుని వద్దకు వచ్చి ఇలా చెప్పింది.
సుభద్ర కోపోక్తులు : “మీ అన్న అన్యాయంగా తన కూతురును ఇతరులకు ఇవ్వవచ్చునా? ఈనాటితో మీకూ, పాండవులకూ బాంధవ్యం తెగిపోతుంది. మొదట మా మగవారూ. మీరూ స్నేహితులు, బంధువులు. అందువల్లనే నన్ను ఇక్కడ ఉంచి, వారు వనవాసమునకు వెళ్ళారు. మా పెద్దన్నగారు తన కుమార్తెను మా అబ్బాయికి ఇస్తానని, ఇప్పుడు డబ్బు కలవారని, దుర్యోధనుని పుత్రునికి ఇవ్వాలనుకుంటున్నాడు. ఇది న్యాయము కాదు. మీకు తెలియని ధర్మాలు లేవు.
అన్న తనకు పిల్ల పుట్టగానే బంధువులూ, స్నేహితులూ ఎదుట, నా కొడుకుకు ఇస్తానని చెప్పి, ఇప్పుడు ఆ మాటను కాదంటున్నాడు.” ఇలా విచారిస్తున్న సుభద్రను, రహస్య స్థలంలో చూసి, కృష్ణుడు ఇలా అన్నాడు.
||శ్రీకృష్ణుడు సుభద్రను ఊరడించడం :
ఈ విధంగా జరుగబోయే కార్యము తెలిసినవాడైనా, తెలియనివాడిలా సుభద్రను ఊరడిస్తూ, సుభద్రను తీసుకొని కృష్ణుడు బలరాముడి దగ్గరకు వెళ్ళాడు... కృష్ణుడు అన్నకు సాష్టాంగ నమస్కారం చేశాడు. బలరాముడు కృష్ణుడితో "వార్తలు
ఏమిటి?" అన్నాడు. కృష్ణుడు సభ్యులు వినేటట్లు ఇలా అన్నాడు.
కృష్ణుడు బలరామునితో పల్కిన పలుకులు :
"ప్రభూ! ఎన్నడూ లేని ముచ్చట నేను ఆశ్చర్యంగా విన్నాను. ఈ లోకంలో సత్యతపోగరిష్ఠులు, పండితులు, పుణ్యాత్ములు, దాననిష్ఠ గలవారు, సత్యవ్రతులు కొంచెము కూడా వ్యర్థమైన అప్రామాణ్యమైన 'మాటలు మాట్లాడరు. మీరు ముందుగా చెల్లెలు సంతోషించేలా మీ కూతురుని ఆమె కొడుకు అభిమన్యుడికి ఇస్తానని అన్నారు. ఇప్పుడు దుర్యోధన పుత్రుడికి ఇచ్చి, తుచ్ఛమైన సంపదలకు ఆశించడం పాపము కదా ! నీతికోవిదులు, అబద్ధం మహాపాపం అని, సత్యశౌచదయా గుణాలను పాటిస్తారు. చెల్లెలు నమ్మేటట్లు మాట ఇచ్చి, రాబోయే చెడ్డను గమనించకుండా, ఇప్పుడు కాదని, యోగ్యుడైన మేనల్లుడు ఉండగా, ఇతరుడు నీ కన్యకు వరుడు ఎలా అవుతాడు ? ఇటువంటి పనులు చెవులతో వినకూడనివని, నాకు అనిపిస్తోంది. మీకు నీతి, అవినీతి ధర్మములు తెలుసు కదా !"
కృష్ణుని మాటలకు బలరాముడు తోక తొక్కిన పాములా బుస కొడుతూ ఇలా అన్నాడు.
“కృష్ణా! ఇలాంటి వ్యర్థమైన మాటలు ఎందుకు ? ఈ మన చెల్లెలును, మనము వారికిస్తే ఈ విధంగా ఆమె సుఖాలు పొందుతోంది. ఇంక శశిరేఖను కూడా ఇస్తే ఆమెకు సుఖాలకు లోటు ఏముంటుంది ? కౌరవులు కూడా మనకు పాండవుల వలె చుట్టాలు కారా? నీవు అర్జునుడి పక్షం వహించి, మాట్లాడుతూ, కౌరవులపై కోపపడడం ఎందుకు ? నిష్కారణంగా భక్ష్యభోజ్యములను చేతితో దూరంగా గెంటి, చేదు కాయలను తినడం వంటిదే, పాండవులతో బంధుత్వము. మహా సామ్రాజ్య వైభవంతో ఉన్నవారిని కాదని, అడవులలో తిరిగే వారికి కన్యను ఇచ్చి, వియ్యము పొందే వెట్టివాడు.
అని బలరాముడు అనగా, కృష్ణుడు లోపల కోపంతో “అన్నా! పాండవులపై దయ లేకుండా, నీ కుమార్తెను నీకు అనుకూలురకు ఇచ్చి, మంచి లాభాన్ని పొందు. పాండవులు కోపంతో వస్తే, నేడు సంపదలతో ఉన్న కౌరవులుపడే కష్టాలు నీకు తెలియవు. నీకు మంచి కలిగేలా నేను చెప్పే మాటలు, నీవు తెలిసికోవు. దైవము ఏ విధంగా చేయబోతోందో ? ఎవరికీ తెలియదు" అని చెల్లెలును చూసి, “ఇంక నీ కుమారుడికి అన్న తన కుమార్తెను ఈయడని తెలుసుకో. దైవయోగం ఎలా ఉందో ?” . అంటూ వెంటనే కృష్ణుడు అక్కడ నుండి లేచి వెళ్ళాడు.
సుభద్ర అన్నను ప్రార్థించడం :
అప్పుడు సుభద్ర బలరాముని ముఖం వైపు చూసి, "అన్నా! నీకు మేనల్లుడు ఔతాడని, అభిమన్యుడికి శశిరేఖను ఇస్తానని నీవు అన్న మాటకు, సంతోషంతో ఇన్నాళ్ళూ నేను మాట్లాడలేదు. నీ మరదులు అడవులకు వెళ్ళినా, వారు పడే కష్టాలను ఎలాగో సహిస్తూ, నీవు చూపే ఆదరానికి, కొడుకుకు పెండ్లి చేస్తామనే ఆనందంతో, బ్రతికాను. మా పేదరికాన్ని చూడకు. కౌరవుల సంపదలకు ఆశ్చర్యపడకు. చీకటి వెన్నెల కాకుండా ఉండదు. లోకుల సంపదలు, క్షణంలో తరుగుతాయి, క్షణంలో పెరుగుతాయి. నీవు నీ కూతురుని ఇస్తానని చేతిలో చెయ్యి వేసి చెప్పావు. ఆ మాట కల్ల అయితే, పాండవులు నన్ను చుల్కనగా చూస్తారు. నీ అంతట నీకే దయ కలగాలి. అంతేకాని, నీవు తలచిన దానిని మాన్పించడానికి ఈశ్వరాది దేవతలకూ శక్యం కాదు. కొడుకే నా బ్రతుకు అని, నా భర్తా, బావ మరదులూ దూరమైనా, మీ దగ్గరికి వచ్చాను".
ఇలా ప్రార్థిస్తున్న చెల్లెలును చూచి, ముక్కంటిలా భయంకరంగా మారిన నిలదీస్తావా ? కూటికి పేదవారై బలరాముణ్ణి చూసి, సభ్యులు అతడు నిర్దయుడు అనుకున్నారు. “నేను నవ్వులాట ఇలా కోసం అన్న మాటను నిజం అనుకొని, నన్ను ఇలా 1. ఇతరులు పిల్లలను ఆశించిన వారికి, ఇలాగే అవుతుంది. నీకున్న సంపదలు తినడానికి కోడలు ఎందుకు ? ఇళ్ళు వదలి అడవులలో తిరిగే మీకు, పిల్లలను ఇవ్వడం కంటే, నూతిలోకి ఆ పిల్లను చచ్చిపోయేలా తోయడం మంచిది. నీకు ఉన్నవారే చీకాకులు పడి, తిండి, బట్టలేక తిరుగుతూ ఉంటే, కోడలు లేకపోతే నీకు లోటు వచ్చి బాధపడుతున్నావా ? పాండవులు ఎంత శక్తిమంతులయినా, దుర్యోధనునితో తులతూగగల రాజులేడని, వారితో వియ్యమందుకోవాలని నేను అనుకొన్నానని, నీవు
ఇంత విచారించడం ధర్మము కాదు. పాండవులు నిన్ను బలవంతంగా తీసుకొని వెళ్ళిన నాటి చుట్టరికం చాలు.” అని కర్ణశూలముల వలె బలరాముడు మాట్లాడాడు. అన్న మాటలకు సుభద్ర అంతులేని దుఃఖంలో మునిగింది. ఆమె అన్నతో ఇలా మాట్లాడింది.
“అన్నా ! తల్లిదండ్రులూ, పండితులూ, సోదరులూ వద్ద, పూర్వం నీవు నాకు ఇచ్చిన మాటలు నవ్వులాట కోసం మాట్లాడానని, నీవు కోపంతో మాట్లాడితే, ఇంక నిత్యమూ నిన్ను నేను ఎంతగా వేడితే మాత్రం ఏమి లాభము ? కౌరవుల సంపదపై ప్రేమతో కుంతీపుత్రులు పేదవారు అన్న మాటల ఫలము, తరువాత నీకు కనబడుతుంది. నీకు ఇష్టమైన బంధువుల సంపదలను నీవు పొగిడావు. మంచిది. ఇతరుల దారిద్ర్యానికి అసహ్యపడడం దేనికి ? ఎక్కువ తక్కువలు చూస్తున్నావు. నీ పిల్ల బొడ్డున మాణిక్యంతో పుట్టిందేమో! తోబుట్టువునని అనుకోకుండా పరుషంగా మాట్లాడావు. నీవు అన్నగారివేనా? నీ అన్నము తినడం కంటే, అడవుల్లో పండుటాకులు తిని బ్రతుకవచ్చు. గదా ! నీ ప్రేమను చూద్దామని ఇలా అన్నాను కాని, మాకు తగిన రాజకన్యలు, ఎందరో ఉన్నారు. ఇన్ని రోజులూ మిమ్మల్ని పిల్లనిమ్మని అడిగాను అన్నలారా ? మీరు వర్ధిల్లండి.
బ్రహ్మ పూర్వం తలమీద వ్రాసిన రీతిగానే, లోకులకు శుభాశుభము కల్గుతుంది. శాశ్వతంగా సంపదలు తెచ్చుకోవాలనే ఆలోచన గల నిన్ను, పెక్కుమాటలు మాట్లాడడం మంచి బుద్ధి కాదు. ఇక ముందు నీకు తోచిన విధంగా, వియ్యము పొంది సుఖంగా
అని సుభద్ర బలరాముని నిందించి, తన భవనానికి వెళ్ళింది.
సందర్భసహిత వ్యాఖ్యలు :
తెగు నా పాండవులతోడ నిక బాంధవమున్"
1. కవి పరిచయం :
ఈ వాక్యము ఆసూరి మరింగంటి వేంకట నరసింహాచార్య రచించిన 'తాలాంక నందినీ పరిణయము'లోని, "వాగ్దాన భంగం"లోనిది.
సందర్భం:
బలరాముడు, సుభద్రకు అన్నగారు. బలరాముడు తన కూతురు రేఖను, సుభద్ర కుమారుడు అభిమన్యుడికి ఇస్తానని వాగ్దానం చేశాడు. పాండవులు సంపదలు పోయి నేడు వనాలలో ఉంటున్నారని, బలరాముడు తన మాటను మార్చి, శశిరేఖను దుర్యోధన పుత్రుడికి ఇద్దామనే ఆలోచనలో ఉన్నాడు. ఆ విషయం తెలిసి, తన రెండవ అన్న కృష్ణుడి వద్దకు సుభద్ర వెళ్ళింది. బలరాముడు మాట తప్పి తన కన్యను ఇతరులకు ఇవ్వడం తగదనీ, అలా అయితే పాండవులతో బంధుత్వం తెగిపోతుందనీ, సుభద్ర, శ్రీకృష్ణుడితో చెప్పిన సందర్భంలోనిది.
వ్యాఖ్య:
తన అన్న బలరాముడు ఇచ్చిన మాటను కాదని శశిరేఖను ఇతరులకు ఇస్తే, పాండవులతో బంధుత్వం అనాటితోనే బలరామకృష్ణులకు తెగిపోతుందని సుభద్ర హెచ్చరించింది.
(2) తెలియని ధర్మములు త్రిజగతి స్థలి గలవే ?(Imp)
జ. కవి పరిచయం :
ఈ వాక్యము ఆసూరి మరింగంటి వేంకట నరసింహాచార్య రచించిన 'తాలాంక నందినీ పరిణయము'లోని "వాగ్దాన భంగం"లోనిది,
సందర్భం:
బలరాముడు చెల్లెలికి చేసిన వాగ్దానాన్ని మరచి, డబ్బు కలవాళ్ళని దుర్యోధన కుమారుడికి తన కూతురు శశిరేఖను ఇచ్చి పెండ్లి చేయాలను కున్నాడు. అలా చేయడం న్యాయము కాదనీ, బలరామకృష్ణులకు తెలియని ధర్మాలు లేవనీ, సుభద్ర, శ్రీకృష్ణుడికి వద్ద వాపోయిన సందర్భంలోనిది.
వ్యాఖ్య :
బలరామ కృష్ణులకు తెలియని ధర్మాలు ముల్లోకాల్లోనూ లేవని, అందువల్ల మాట తప్పడం న్యాయము కాదని వారికి తెలుసనీ సుభద్ర తను అన్న శ్రీకృష్ణుడి దగ్గర బాధపడింది.
3. పలుకు బొంకజేసె పాపమనక
జ. కవి పరిచయం :
ఈ వాక్యము ఆసూర్తి మరింగంటి వేంకట నరసింహాచారు రచించిన 'తాలాంక నందినీ పరిణయము'లోని "వాగ్దాన భంగం" లోనిది.
సందర్భం :
బలరాముడు తనకు పిల్ల పుట్టిన రోజుననే పౌరులూ, ఆప్తులూ, 'బంధువులూ చూస్తుండగా సుభద్ర కుమారుడు అభిమన్యుడికి ఇస్తానని వాగ్దానం చేశాడు. ఇప్పుడు పాపం వస్తుందని అనుకోకుండా బలరాముడు తన మాటను అబద్ధం చేశాడని, సుభద్ర శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళి చెప్పి బాధపడిన సందర్భంలోది. పిల్లను
వ్యాఖ్య :
పాపం వస్తుందని అనుకోకుండా తన వాగ్దానాన్ని అబద్ధం చేశాడు. తన అన్న వాగ్దానాన్ని మరిచి, మరొక అబద్ధం ఆడుతున్నాడని సుభద్రం బాధపడింది.
4. 'వృథా ప్రామాణ్యోక్తులు బల్కకుందురుగదా పాపాతిభీతిన్మదిన్' (Imp)
జ. కవి పరిచయం :
ఈ వాక్యము ఆసూరి మరింగంటి వేంకట నరసింహాచారు రచించిన 'తాలాంక నందినీ పరిణయము'లోని "వాగ్దాన భంగం”లోనిది.
సందర్భం :
సుభద్ర కుమారునికి పిల్లను ఇస్తానని మాట ఇచ్చి సుభద్ర అన్న బలరాముడు మాట తప్పాడు. అన్న బలరాముడు మాట తప్పుతున్నాడని సుభద్ర తన రెండవ అన్న కృష్ణుడికి చెప్పి బాధపడింది. అప్పుడు సుభద్రను తీసికొని బలరాముడి దగ్గరకు వెళ్ళి పండితులూ, పుణ్యాత్ములూ, సత్యవ్రతులూ, దాన నిష్ఠూలూ, వ్యర్థంగా అప్రామాణ్యమైన మాటలు మాట్లాడరని, శ్రీకృష్ణుడు, తన అన్న బలరాముడితో చెప్పిన సందర్భంలోనిది.
వ్యాఖ్య :
సత్యవ్రతులు కొద్దిగానైనా వ్యర్ధంగా ప్రమాణము లేని మాటలు, పాపం వస్తుందనే మహాభయంతో మాట్లాడకుండా ఉంటారు కదా ! అని "చెప్పి శ్రీకృష్ణుడు అన్నను అబద్ధమాడడం పాపమని హెచ్చరించాడు.
5. "ఎల్లవిధంబులన్ విశదమేకద నీతి యనీతిధర్మముల్".
కవి పరిచయం :
ఈ వాక్యము ఆసూరి మరింగంటి వేంకట నరసింహాచార్య రచించిన 'తాంక నందినీ పరిణయము లోని "వాగ్దాన భంగం"లోనిది.
సందర్భం:
బలరాముడు తన కుమార్తె శశిరేఖను చెల్లెలు సుభద్ర కుమారుడికి ఇచ్చి పెళ్ళి చేస్తానని మాట ఇచ్చి తప్పాడు. అప్పుడు అన్నగారి వద్దకు వెళ్ళి అబద్దం ఆడి యోగ్యుడైన మేనల్లుడు ఉండగా అతణ్ణి కాదని ఇతరుడికి . కూతురును ఇవ్వడం తగదని, నీతి అనీతి ధర్మాలు అన్నగారికి బాగా తెలుసుననీ శ్రీకృష్ణుడు బలరామునితో అన్న సందర్భంలోనిది.
వ్యాఖ్య :
మీకు అన్ని విధాలుగా నీతి ఏదో, అనీతి యేదో స్పష్టంగా తెలుసు కదా ! చెల్లెలికి మాట ఇచ్చి రాబోయే కీడు తెలిసికోకుండా ఇతరులకు పిల్లనివ్వడం, చెల్లని కార్యమని, కృష్ణుడు తన అన్న బలరాముడికి చెప్పాడు. .
6) సుఖంబున కేమిటి తక్కువయ్యెడిన్ Imp
జ. కవి పరిచయం :
ఈ వాక్యము ఆసూరి మరింగంటి వేంకట నరసింహాచార్య రచించిన 'తాలాంక నందినీ పరిణయము'లోని "వాగ్దాన భంగం"లోనిది.
సందర్భం :
శ్రీకృష్ణుడు బలరాముని దగ్గరకు వెళ్ళి, వాగ్దానాన్ని కాదని శశిరేఖను ఇతరులకు ఇవ్వడం తగదని చెప్పాడు. అప్పుడు బలరాముడు కోపంతో తోకతొక్కిన త్రాచులా లేచాడు. సుభద్రను పాండవులకు ఇస్తే సుభద్ర ఇలా సుఖాలలో తేలియాడుతోంది. ఇక శశిరేఖను కూడా ఇస్తే ఆమె పొందే సుఖాలకు తక్కువరాదని, వ్యంగ్యంగా బలరాముడు శ్రీకృష్ణునితో అన్న సందర్భంలోనిది.
వ్యాఖ్య :
సుభద్రను అర్జునుడికి ఇస్తే, “సుభద్ర పుట్టింట్లో పడి ఉంది. ఇక శశిరేఖను కూడా అర్జునుడి కుమారుడు అభిమన్యుడికి ఇస్తే, శశిరేఖకు కూడా సుభద్రలాగే సుఖం ఉండదని, బలరాముడు తమ్ముడికి చెప్పాడు.
7. వియ్యమందంగ నూహించు వెఱిగలడె ?(V. Imp).
2. కవి పరిచయం :
ఈ వాక్యము ఆసూరి మరింగంటి వేంకట నరసింహాచార్య రచించిన లంక నందినీ పరిణయము'లోని "వాగ్దాన భంగం"లోనిది.
సందర్భం:
మాట తప్పకుండా శశిరేఖను అభిమన్యుడికి ఇవ్వడం ధర్మమని చెప్పిన శ్రీకృష్ణుడితో, బలరాముడు పలికిన మాటల సందర్భంలోది. పూర్ణ సామ్రాజ్య భోగాలు కలవారిని కాదని, భయంకరమైన అడవులలో తిరిగే వారికి పిల్లనిచ్చి వియ్యం అందుకోవాలనే ఊహ చేసే వెట్టివాడు, ఉండదని, Yem బలరాముడు శ్రీకృష్ణునితో చెప్పిన సందర్భంలోనిది.
వ్యాఖ్య :
మహా సామ్రాజ్య భోగాలు కలవారిని విడిచిపెట్టి అడవులలో గుహలలో, కొండలపై తిరిగే వారికి పిల్ల నిచ్చి వెట్టివాడు తప్ప ఇతరులు వియ్యం అందుకోరని, బలరాముడు కృష్ణుడితో చెప్పాడు.
8. ఎయ్యది ఘటియించునో తెలియనౌనే మహాత్ములకైన నగ్రజా !Imp
జ. కవి పరిచయం :
ఈ వాక్యము ఆసూరి మరింగంటి వేంకట నరసింహచార్య రచించిన 'తాంక నందినీ పరిణయము'లోని "వాగ్దాన భంగం"లోనిది. ' : సుభద్ర కుమారుడికి పిల్లనిస్తానన్న వాగ్దానాన్ని నిలబెట్టుకోమని అన్న బలరామునికి శ్రీకృష్ణుడు చెప్పాడు. బలరాముడు అడవులలో తిరిగే వారికి పిల్ల నివ్వడం వెట్టిదనం అన్నాడు. దానితో కోపం వచ్చి పాండవులు | "కోపంతో వస్తే సంపదలతో ఉన్న ఈ కౌరవులు నానా బాధలు పడతారనీ అన కోరి తాను చెప్పిన మాటలు అన్న వినడం లేదని, దైవం ఏమి చేయనున్నదో ఎవరికీ తెలియదనీ, శ్రీకృష్ణుడు బలరామునితో చెప్పిన సందర్భంలోనిది.
వ్యాఖ్య :
"దైవ్యం ఏమి చేయనున్నదో, గొప్పవారికి సైతం తెలియదు”. అన్నగారితో శ్రీకృష్ణుడు చెప్పాడు.
9. దైవయోగమది యెట్లు గలదో ?
జ. కవి పరిచయం :
ఈ వాక్యము ఆసూరి మరింగంటి వేంకట నరసింహాచారు రచించిన 'తాలాంక నందినీ పరిణయము'లోని "వాగ్దాన భంగం" లోనిది. "
సందర్భం :
శ్రీకృష్ణుడు తన అన్న బలరాముడితో దైవము ఏమి చేస్తుందో చూద్దాము అని చెప్పాడు. తరువాత సుభద్రను చూసి, అమ్మా ! నీ కుమారుడికి అన్నగారు తన పిల్లను ఈయడని తెలిసికో. మరి దైవయోగం ఎలాగుందో | తెలియదు అని శ్రీకృష్ణుడు సుభద్రతో చెప్పిన సందర్భంలోనిది.
వ్యాఖ్య :
అన్నగారు తనకు తానుగా తన కూతురు శశిరేఖను అభిమన్యుడికి ఇయ్యడు. మరిదేవుడు ఏమి చేస్తాడో ? అని కృష్ణుడు, తన చెల్లెలు సుభద్రతో నర్మ గర్భంగా చెప్పాడు.
చీకటి వెన్నెల గాదా ? కవి పరిచయం : ఈ వాక్యము ఆసూరి మరింగంటి వేంకట నరిసంహాచార్య రచించిన 'కాలాంక నందినీ పరిణయము'లోని "వాగ్దాన భంగం"లోనిది.
బలరాముడు తన కుమార్తె శశిరేఖను అభిమన్యునికి ఇవ్వనని నిష్కర్షగా చెప్పాడు. కృష్ణుడు కోపంతో లేచి వెళ్ళాడు. అపుడు సుభద్ర తన అన్న బలరాముడిని చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోమని మరొకసారి బ్రతిమాలింది. పాండవులకు ప్రస్తుతం గల పేదరికాన్ని చూడవద్దనీ, దుర్యోధనుని సంపదలు చూసి ఆశ్చర్యపడవద్దనీ, చీకటి ఎప్పటికైనా వెన్నెల కాకపోదనీ, సుభద్ర బలరామునితో చెప్పిన సందర్భంలోనిది.
వ్యాఖ్య :
చీకటి పోయి వెన్నెల రావడం సహజం. అలాగే నేటి పేదరికం పోయి పాండవులు తిరిగి రాజ్యభోగాలు పొందడం తప్పక జరుగుతుందని సుభద్ర బలరామునికి సూచించింది.
*11)మీ బోటులకిచ్చుకంటే తెగ బుద్ధిని నూతిని ద్రోయుటొప్పగునా. (Imp)
జ. కవి పరిచయం :
ఈ వాక్యము ఆసూరి మరింగంటి వేంకట నరసింహాచార్య రచించిన 'తాలంక నందినీ పరిణయము'లోని "వాగ్దాన భంగం"లోనిది.
సందర్భం:
చేసిన వాగ్దానాన్ని నిలుపుకొని, అభిమన్యుడికి శశిరేఖ నిచ్చి పెండ్లి చేయుమని సుభద్ర తన అన్న బలరాముడిని బ్రతిమాలింది. చెల్లెలి సుభద్ర మాటలకు బలరాముడికి కోపం వచ్చింది. ఆ కోపంతో పాండవులు పేదవారనీ, వారికి తినడానికే తిండి లేదనీ, వారికి సిరి సంపదలు లేవనీ, వారికి కోడలు ఎందుకనీ, బలరాముడు చెల్లెలును అడిగాడు. ఇళ్ళు వదలి అడవులలో తిరిగే పాండవుల వంటి వారికి పిల్లను ఇవ్వడం కంటే, ఆ పిల్లను నూతిలోకి తోసి చంపడం మంచిదని, కఠినంగా బలరాముడు చెల్లెలు సుభద్రతో అన్న సందర్భంలోది.
వ్యాఖ్య :
పాండవుల వంటి కూటికిలేని పేదలకు పిల్లను ఇవ్వడం కంటే, బుద్ధిపూర్వకంగా పిల్ల మరణించేలా ఆమెను నూతిలోకి త్రోయడం మంచిదని బలరాముడు చెల్లెలు సుభద్రతో అన్నాడు.
12. కోడలు లేకున్నం గొరత గళవళించెదవేమో
! జ. కవి పరిచయం
: ఈ వాక్యము ఆసూరి మరింగంటి వేంకట నరసింహాచార్య రచించిన 'తాలాంక నందినీ పరిణయము'లోని "వాగ్దాన భంగం"లోనిది
సందర్భం :
వాగ్దానాన్ని నిలుపుకొని తన కుమారుడికి, తన కూతురు శశిరేఖను ఇమ్మని, సుభద్ర అన్నను అడిగింది. బలరాముడికి కోపం వచ్చింది. నీ భర్తా, అతని సోదరులూ కష్టాలు పడుతూ తిండి, గుడ్డలేక అడవులలో తిరుగుతున్నారు. అటువంటి నీకు కోడలు లేకపోతే లోటు వచ్చిందా ఏమిటి? అని బలరాముడు సుభద్రను ప్రశ్నించిన సందర్భంలోనిది.
వ్యాఖ్య :
కోడలు లేకపోతే లోటు వస్తుందా ? కోడలు లేని లోటుతో వ్యాకుల పడుతున్నావా ? అని బలరాముడు చెల్లెల్ని వ్యంగ్యంగా ప్రశ్నించాడు.
3 పేదలు కుంతీ సుతులంచుబల్కుటలు మీదంగానగా నయ్యెడిన్.
కవి పరిచయం :
ఈ వాక్యము ఆసూరి మరింగంటి వేంకట నరసింహాచార్య రచించిన 'తాలాంక నందినీ పరిణయము'లోని "వాగ్దాన భంగం”లోనిది.
సందర్భం :
బలరాముడు చెల్లెలు సుభద్రతో కఠినంగా, వ్యంగ్యంగా ఆమె మనస్సు నొచ్చుకొనేటట్లు మాట్లాడాడు. సుభద్రకు కోపం వచ్చింది. కావలసినవారి అందరి ఎదుటా వాగ్దానం చేసి, ఇప్పుడు నవ్వులాట కోసం Audio అన్నానని కోపంతో బలరాముడు చెప్పాడనీ, ఇంక పిల్లనిమ్మని అన్నను ఎంత వేడినా ఫలితం లేదనీ, కౌరవ రాజ్యలక్ష్మి మీద ప్రేమతో అన్న కుంతీ కుమారులు పేదవారని ఎగతాళి చేశాడని, ఈ అన్నమాటలకు ఫలితం ముందు ముందు కనబడుతుందనీ, సుభద్ర తన అన్న బలరాముని హెచ్చరించిన సందర్భంలోనిది.
వ్యాఖ్య :
కుంతీదేవి పుత్రులయిన పాండవులు బీదవారు. అని అన్నగారి మాటల వలం ముందు తప్పక కనబడుతుందని సుభద్ర అన్నను. హెచ్చరించింది.
https://sridharscience.blogspot.com/2023/04/degree-4th-sem-telugu-syllabus.html
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి