జానపదం Degree 5th sem
జానపదం భారతదేశం జనపదాలకు పుట్టినిల్లు, జనపదాల్లోనే తన ఉనికిని నిలుపుకుందీ దేశం. జనపదులకు సంబంధించింది జానపదం. జనపదం అంటే పల్లె లేదా చిన్న గ్రామం. జనపదాల్లో నివసించేవారు జానపదులు, జానపదుల జీవితం ప్రకృతికి దగ్గరగా ఉంటుంది. వారి జీవితానికి సంబంధించిన విశేషాల సమాహారాన్ని జానపద విజ్ఞానం (Folklore) అంటారు. జానపదుల సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, అలవాట్లు, వస్తు వైవిధ్యం, ఆటపాటలు మొదలైన విషయాలను జానపద విజ్ఞానం అధ్యయనం చేస్తుంది. జానపద విజ్ఞానంపై మొదటిసారిగా దృష్టి సారించినవారు గ్రిమ్స్ సోదరులు. వీరు తమ కాలంనాటి జానపద కథల్ని సేకరించారు. ప్రజలకు ఇష్టమైన ప్రాక్తన విషయాలైన 'Popular Antquities'ను వీరు 'VolksKunde' అనే పేరుతో పిలిచారు. అలా జానపద విజ్ఞానానికి తొలిసారి VolksKunde అనే పేరు స్థిరపడింది. విలియం థామ్స్ 1846లో The Athacnacum అనే పత్రికకు రాసిన వ్యాసంలో జానపద విజ్ఞానానికి Folklore అనే పదాన్ని సూచించాడు. Folk అనే మాటకు 'నిరక్షరాస్యులైన కర్షకులని' అర్థం. Lore అనే మాటకు 'పాండిత్యం లేదా విజ్ఞానం' అని అర్ధం. నిరక్షరాస్యులైన కర్షకులకు సంబంధించిన విజ్ఞానాన్...