పోస్ట్‌లు

అధ్యయన సంస్కృతి Degree 5th sem

 అధ్యయన సంస్కృతి మన సమాజం క్రమానుగతంగా పరిణామం చెందింది. ప్రకృతిలో భాగమైన ఆదిమ. సమాజం నుంచి ఆధునిక యుగం వరకు మనుషులు సుదీర్ఘ ప్రయాణం చేశారు. ప్రకృతిలో జరిగే పరిణామాలకు కార్యకారణం తెలియక అమూర్తభావనలోకి ఇంకిపోయారు. సూర్యుడు. ఉదయించటం, వెన్నెల కురియటం, మేఘం వర్షించటం, మెరుపు మెరవటం, ఉరుము ఉరమటం, పిడుగు పడటం, భూమి చలించటం, విత్తనం మొలకెత్తటం, పువ్వు కాయగా మారటం, ఆకు రాలిపోవటం, వసంతం చిగురించటం, పక్షుల కిలకిలా రావాలు, పులి గాండ్రింపు, లేడి గంతులు, నెమలి నాట్యం ఇలా ఎన్నో మరెన్నో అద్భుతాలను తొలిమానవులు చూశారు. విన్నారు. కానీ ఆ ప్రకృతి రమణీయతను అర్థం చేసుకోవడానికి చాలా కాలం పట్టింది. భూమిని సాగు చేయటం, నీటికి అడ్డుకట్ట వేయటం ఆ కాలపు మనిషి సాధించిన అద్భుత ప్రగతి. 'భూమితో మాట్లాడితే జ్ఞానమిస్తుంది' అనేది సూక్తి, నిజంగా వ్యవసాయం ప్రారంభం కావటం మానవవికాసదశలో ముఖ్యమైనది. భూమిని సాగుచేస్తున్న క్రమంలో మనుషులు ఎన్నో అనుభవాలను సొంతం చేసుకున్నారు. ప్రకృతిలో దొరికిన పదార్థాలను ఏ రోజుకారోజు తిని జీవించే స్థితినుంచి పంటను ఉత్పత్తి చేసి తర్వాతి కాలానికి నిల్వ చేసుకునే స్థాయికి సమాజం ఎదిగింది. జంతువు

సాహిత్య అధ్యయనం ప్రయోజనాలు Degree 5th sem Telugu

సాహిత్య అధ్యయనం ప్రయోజనాలు పాటలు, గేయగాథలు, సామెతలు, పొడుపు కథలు, తోలుబొమ్మలాటలు, యక్షగానం, కోలాటం మొదలైన రూపాలలో శ్రామికవర్గాల సాహిత్యం ప్రజలలో సజీవంగా ఒక తరం నుంచి మరో తరానికి కొనసాగుతున్నది. దీనినే మనం విద్యాసంబంధ పాఠ్య ప్రణాళికలలో జానపద సాహిత్యం అంటున్నాం. ఇది కాకుండా మార్గ సాహిత్యంగా ఉండిన కావ్యాలు, ఇతిహాసాలు సామాజిక ప్రతిబింబాలుగా కోకొల్లలుగా వచ్చాయి. వేదాలలో ఉన్న భావాన్ని పురాణంగా, ఇతిహాసంగా, సాహిత్యంగా మార్చి ప్రజలలోకి తీసుకొచ్చారు. వేదం రాజులాంటిదని, పురాణం మిత్రుల వంటిదని, కావ్యం కాంత వంటిదని మన పెద్దలు చెప్పారు. వేదంలోని విషయాలను, పురాణంలోని అంశాలను సున్నితంగా, రసాత్మకంగా అందరికీ అర్ధమయ్యేలా ప్రేమగా చెప్పవలసిన అవసరం ఆనాటి సమాజానికి ఏర్పడింది. కనుక ధర్మశాస్త్రాలు, ప్రకృతి శాస్త్రాలు, వైద్య శాస్త్రాలు, మంత్రగత విషయాలు, నీతిశాస్త్రాలు, వైదిక విషయాలు మొదలైన శాస్త్ర సంబంధ అంశాలన్నింటిని సాహిత్యంగా మార్చి చెప్పటం వలన ప్రజలు ఆకర్షితులయ్యారు. ఆనాటి సమాజానికి సాహిత్యం రూపొందవలసిన అవసరం ఏర్పడింది. మనిషిలో ఉండే సహజాతమైన ఉద్వేగాలు, సామాజిక సంబంధాలు కళాత్మకంగా వ్యక్తమవుతాయి, ప్రకృతి, శ్ర

ముందుమాట Degree 5th sem

 ముందుమాట ఇంటికి ప్రధాన ద్వారం ఎలాగో పుస్తకానికి ముందుమాట అలాంటిది. పుస్తక పుటల్లోకి ప్రవేశించడానికి ముందుమాట ఒక సన్నని బాట ఏర్పరుస్తుంది. పుస్తక స్వరూప, స్వభావాలను సారాంశాన్ని ముందుమాట ప్రతిబింబిస్తుంది. ముందుమాట కొత్త పాఠకులకు ఒక దీపధారిలాంటిది. 'Fore word ' అనే ఆంగ్ల పదానికి సమానార్ధక పదంగా తెలుగులో ముందుమాట అని వాడుతున్నారు. గ్రంథం లేదా రచనకు ప్రారంభంలో ముందుగా ఉంటుంది. కాబట్టి ముందుమాట అని వ్యవహరిస్తున్నాం. తెలుగు గ్రంథాలలో మున్నది, ఆముఖం, పీఠిక, ప్రస్తావన, పరిచయం, భూమికలాంటి మాటలతో సూచించారు. జె.ఎ. కర్జన్ (J. A. Cuddon) తన డిక్షనరీ ఆఫ్ లిటరరీ టెక్స్ట్ fore word అంటే usually a short introductory piece to a book. It is similar to preface (Q.V) and an introduction, but is generally com- posed not by the author but by some are else" అని వివరించాడు. ఇది నిర్వచనం కాకపోయినా fore word అంటే ఏమిటో వివరిస్తుంది. తెలుగులో 'ముందుమాట' అనే అర్ధాన్నే ఇస్తూ అనేక పదాలున్నట్లుగానే ఆంగ్లంలోనూ Preface, introduction అనే పదాలున్నాయి. ఆయా కాల, సందర్భాల్లో వారి వారి అవసరాలను బట్టి భి

పుస్తక సమీక్ష Degree 5th sem Telugu

  పుస్తక సమీక్ష పుస్తక రచయితకు, పాఠకుడికి మధ్య వంతెన లాంటిది. సాహిత్యంలో అస్పష్టత, అన్వయ క్లిష్టత పెరుగుతున్న నేటి కాలంలో సమీక్షా వ్యాసం ఎంతో ప్రజాదరణ పొందుతున్నది. అవగాహనకూ, అనుభూతికి పుస్తక సమీక్ష తోడ్పాటునందిస్తున్నది. సాధారణ పాఠకుడికి మార్గదర్శనం చేస్తూ పఠనాభిలాషను పెంపొందిస్తుంది. పుస్తక సమీక్ష దూరతీరాల్లో ఉన్న సహృదయ పాఠకుడి దగ్గరికి పుస్తకాన్ని చేరవేస్తుంది. ' ఈక్ష' అనే ధాతువుకు 'సం' అనే ఉపసర్గ చేరి 'సమీక్ష' అనే పదం ఏర్పడింది. అంటే లోతుగా చూడడం, పరిశీలన, అవగాహన, అన్వేషణం, ఆలోచన అనే అర్ధాలున్నాయి. విమర్శ. సమీక్ష రెండూ ఒకటి కాదు. రెండింటి మధ్య సన్నటి విభజనరేఖ ఉంది. విమర్శ అంటే 'గుణదోష వివరణ' సమీక్ష అనే పదానికి శబ్దరత్నాకరము 'చక్కగా చూచుట', 'వెదుకుట' అనే అర్ధాలనిచ్చింది. ఆంగ్లంలోని Review అనే పదానికి సమానార్ధకంగా తెలుగులో 'సమీక్ష' అనే పదాన్ని వాడుతున్నారు. ఆంగ్ల సాహిత్య పరిచయంతో తెలుగులో సమీక్ష మరింత పరిణతి సాధించింది. ముద్రణా సౌకర్యాలు పెరగడం, పత్రికలు పెరగడం, విరివిగా పుస్తకాలు వెలువడటం ఇత్యాది కారణాల వలన గ్రంథ సమీక్ష ఒక ప్రత

జానపదం Degree 5th sem

జానపదం భారతదేశం జనపదాలకు పుట్టినిల్లు, జనపదాల్లోనే తన ఉనికిని నిలుపుకుందీ దేశం. జనపదులకు సంబంధించింది జానపదం. జనపదం అంటే పల్లె లేదా చిన్న గ్రామం. జనపదాల్లో నివసించేవారు జానపదులు, జానపదుల జీవితం ప్రకృతికి దగ్గరగా ఉంటుంది. వారి జీవితానికి సంబంధించిన విశేషాల సమాహారాన్ని జానపద విజ్ఞానం (Folklore) అంటారు. జానపదుల సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, అలవాట్లు, వస్తు వైవిధ్యం, ఆటపాటలు మొదలైన విషయాలను జానపద విజ్ఞానం అధ్యయనం చేస్తుంది. జానపద విజ్ఞానంపై మొదటిసారిగా దృష్టి సారించినవారు గ్రిమ్స్ సోదరులు. వీరు తమ కాలంనాటి జానపద కథల్ని సేకరించారు. ప్రజలకు ఇష్టమైన ప్రాక్తన విషయాలైన 'Popular Antquities'ను వీరు 'VolksKunde' అనే పేరుతో పిలిచారు. అలా జానపద విజ్ఞానానికి తొలిసారి VolksKunde అనే పేరు స్థిరపడింది. విలియం థామ్స్ 1846లో The Athacnacum అనే పత్రికకు రాసిన వ్యాసంలో జానపద విజ్ఞానానికి Folklore అనే పదాన్ని సూచించాడు. Folk అనే మాటకు 'నిరక్షరాస్యులైన కర్షకులని' అర్థం. Lore అనే మాటకు 'పాండిత్యం లేదా విజ్ఞానం' అని అర్ధం. నిరక్షరాస్యులైన కర్షకులకు సంబంధించిన విజ్ఞానాన్

వాతావరణ మార్పు సమయంలో స్థిరమైన అభివృద్ధి

 పరిచయం సుస్థిర అభివృద్ధి, ఇటీవలి కాలంలో, విస్తృత ఒప్పందం ఉన్న ప్రపంచ సమస్య. బ్రండ్ట్‌ల్యాండ్ యొక్క నివేదిక స్థిరమైన అభివృద్ధిని ఇలా నిర్వచించింది: "భవిష్యత్తు తరాల వారి స్వంత అవసరాలను తీర్చుకునే సామర్థ్యాన్ని రాజీ పడకుండా ప్రస్తుత అవసరాలను తీర్చడం". స్థిరమైన అభివృద్ధి భావనను సిఫార్సు చేస్తున్నందున ఈ నిర్వచనం ఎక్కువగా ఆమోదించబడింది. అంతర్జాతీయ ప్రకృతి మరియు సహజ వనరుల పరిరక్షణ (IUCNNR) ప్రపంచ పరిరక్షణ వ్యూహ నివేదిక (1980) ద్వారా స్థిరమైన అభివృద్ధిని చేపట్టడానికి సామాజిక, ఆర్థిక మరియు పర్యావరణ కారకాలను తప్పనిసరిగా పరిగణించాలని ప్రకటించింది మరియు నిర్ధారించింది. వాతావరణ మార్పుపై అంతర్జాతీయ ప్యానెల్ (IPCC) యొక్క కొన్ని నిర్వచనాలు వాతావరణ మార్పు మరియు స్థిరమైన అభివృద్ధి మధ్య సంబంధాన్ని వివరిస్తాయి. వాతావరణ మార్పు: సున్నితత్వం, అనుకూలత మరియు దుర్బలత్వం సున్నితత్వం అనేది వాతావరణం-సంబంధిత ఉద్దీపనల ద్వారా ప్రతికూలంగా లేదా ప్రయోజనకరంగా ఉండే వ్యవస్థను ప్రభావితం చేసే స్థాయి. శీతోష్ణస్థితి-సంబంధిత ఉద్దీపనలు వాతావరణ మార్పు యొక్క అన్ని అంశాలను కలిగి ఉంటాయి, వీటిలో సగటు వాతావరణ లక్షణాలు, వాత

పేదలకు న్యాయం జరగాలి

 న్యాయం అనే పదం 'న్యాయంగా మరియు న్యాయంగా' వ్యవహరించడాన్ని సూచిస్తుంది. కోర్టుల్లో విచారణ సమయంలో, న్యాయమూర్తులందరినీ 'మై లార్డ్' అని సంబోధిస్తారు. నిరుపేద ప్రజలకు న్యాయం చేయడం కోసం వారు ఉపయోగించాల్సిన శక్తిని ఇది సూచిస్తుంది, దానిని వారు చేయాలి. దురదృష్టవశాత్తూ, ఈ రోజుల్లో ప్రజలు ప్రేమ మరియు గౌరవంతో సహా చాలా వస్తువులను కొనుగోలు చేయవచ్చని వ్యతిరేక అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు మరియు తద్వారా నైతికత లేదా చట్టాలను పూర్తిగా విస్మరిస్తారు. న్యాయవ్యవస్థ తన అధికారాన్ని వినియోగించుకోవడం ద్వారా సమాజంలోని అణగారిన వర్గానికి గొప్ప సహాయం చేయగలదు, ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యానికి ముఖ్యమైన స్తంభం. పేద ప్రజలు మెరుగైన మనుగడ సాధించాలంటే వారికి కనీస సౌకర్యాలు కల్పించాలి. వారు చాలా అరుదుగా సమాజంలో గౌరవం పొందుతారు మరియు చాలా బాధపడతారు. దురదృష్టవశాత్తు, భారతదేశంలో సుదీర్ఘమైన న్యాయ ప్రక్రియ వారికి చాలా కష్టతరం చేస్తుంది మరియు అది పొందడం చాలా అరుదు. అయితే, దానిని పొందిన వారు తమను తాము చాలా అదృష్టవంతులుగా భావిస్తారు. న్యాయం యొక్క ప్రాముఖ్యత నైతికత తగ్గుతున్న ప్రపంచంలో కృషి మరియు నిజాయితీ వంటి ఆదర్శాల